సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా ||
శ్లోకం సవరించు
సర్వారుణా :- సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
అనవద్యాంగీ :- వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
సర్వాభరణ భూషితా :- సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
శివకామేశ్వరాంకస్థా :- శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
శివా :- వ్యక్తమైన శివుని రూపము కలది.
స్వాధీన వల్లభా :- తనకు లోబడిన భర్త గలది.
Leave a comment