దత్తాత్రేయుని అవతారాలలో శ్రీపాద శ్రీవల్లభస్వామి, శ్రీ నరసింహ సరస్వతిస్వామి నిజాము ప్రాంతంలో శ్రీమాణిక్యప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్ కోట్ కర్ మహారాజ్ గారు, చివరిది ఆహ్మదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీసాయిబాబా.
సాయిబాబా పారాయణం భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. షిర్డీ సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసులో చెలరేగే కలతలు, కల్లోలాలు తగ్గి సుఖశాంతులతో ప్రశాంతమైన జీవనం సాగించవచ్చు...
సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన చేస్తారు సాయి, సత్చరిత్ర పేరు ఏదయినా, రూపం ఏదయినా అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! 'సబ్ కా మాలిక్ ఏక్' అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ అన్నింటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్షదైవం సాయిబాబా!
Leave a comment