హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా ||
శ్లోకం వివరణ :
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
Leave a comment