నిశ్చిన్తా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహన్త్రీ, నిష్పాపా, పాపనాశినీ | |
శ్లోకం వివరణ :
నిశ్చింతా - ఏ చింతలూ లేనిది.
నిరహంకారా - ఏ విధమైన అహంకారము లేనిది.
నిర్మోహా - అవగాహనలో పొరపాటు లేనిది.
మోహనాశినీ - మోహమును పోగొట్టునది.
నిర్మమా - మమకారము లేనిది.
మమతాహంత్రీ - మమకారమును పోగొట్టునది.
నిష్పాపా - పాపము లేనిది.పాపనాశినీ - పాపములను పోగొట్టునది
Leave a comment