చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా ||
శ్లోకం వివరణ :
చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
పార్వతీ - పర్వతరాజ పుత్రి.
పద్మనయనా - పద్మములవంటి నయనములు కలది.
పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.
Leave a comment