ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ||
శ్లోకం వివరణ :
ఆ బ్రహ్మకీటజననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
నిజాజ్ఞారూపనిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
పుణ్యాపుణ్యఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.
Leave a comment