విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసినీ ||
శ్లోకం వివరణ :
విజయా - విశేషమైన జయమును కలిగినది.
విమలా - మలినములు స్పృశింపనిది.
వంద్యా - నమస్కరింపతగినది.
వందారుజనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
వామకేశీ - వామకేశ్వరుని భార్య.
వహ్నిమండవాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.
Leave a comment