గురువారం పారాయణ ప్రారంభం
అధ్యాయం - 1
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోకప్రసిద్ధి అయి దూర ప్రాంతాల నుండి అందరూ వచ్చి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేనివారు సంతానం, పేదవారు ధనము ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. నామ దారుకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఒక్కటీ తీరక, శ్రీ గురుని మహత్యం విని, ఆకలిదప్పులు మరిచి కాలినడకన అతడు శ్రీ గురు స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు.
అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు పోవడం లేదు, అందుకు నా పాపాలు కారణమైతే, అన్నిటినీ కరుణించే మీ నామం, దేవతలకె శక్తిని అనుగ్రహించి విశ్వం అంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా! మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? వీటి అన్నిటికీ నేను చేసిన తప్పులే కారణమా? అని పలువిధాలు శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ చివరకు కిన్నుడై, శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురుని నే స్మరించాడు. భక్తుల పాలిటి అమ్మ దేనికైనాకామధేనువైన ఆయన జడలు, విభూది, పులి చర్మముతో నామధారకుడికి దర్శనం ఇచ్చారు. అతడు పొడవైన తన జుట్టుతో వారి పాదాలు తుడిచి, అభిషేకించి, గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో తన హృదయం శాంతించి, అతని మనసులో ఆయన రూపం స్థిరంగా నిలిచింది.
ఆ యోగీశ్వరుడు అతనిని లేవ నెత్తి ముఖాన విభూది పెట్టి , తలపై చేయి ఉంచి ఆశీర్వదించగా, వెంటనే మెలుకువ వచ్చింది. కానీ నామ దారుకుడు కి ఆ అనుభవము అలానే ఉన్నది, ఆశ్చర్యపోయి చుట్టూ చూసాడు, అక్కడ మరెవ్వరూ లేరు, తనకు స్వప్న దర్శనం ఇచ్చినది ఆ గురుమూర్తి నే అని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 2
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
స్వప్నంలో జడలు, విభూతి , పులి తోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామదారకుని మనసుపై చెరగని ముద్ర వేసుకుంది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. కొద్ది దూరం వచ్చేసరికి ఒక చోట కృపాకరుడు,ద్వంద్వాతీతుడు అయినా యోగి పుంగవుడు పీతాంబరం, దానిపై పులిచర్మం,, దేహమంతటా విభూది జడలు ధరించి కనిపించాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగి నే. నామ దారుకుడు రోమాంచిత మై, కన్నులు ఆనందభాష్పాలతో స్వామి! నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయం సంతోషంతో ఉప్పొంగింది, నా దుఃఖం పోగొట్టగల వారు మీరేనని స్పష్టమైంది. స్వామి! నా అదృష్టం వల్ల మీ దర్శనం అయింది. నా పేరు నామ దారక శర్మ. తమ పేరేమి? ఎక్కడనుండి వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగాడు.
ఆ యోగి ఇలా చెప్పారు, నాయనా! భక్తులకు ఎవరు భక్తిని, ముక్తిని ప్రసాదిస్తారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో ఆ త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను.
నామ దారుకుడు, స్వామి! శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీ లందరూ ఆయన భక్తులే. నేను కూడా ఎల్లప్పుడు ఆయనను స్మరిస్తున్నాను, కానీ నేనంత కష్టాలలో ఉన్న నన్ను ఆయన అనుగ్రహించడం లేదు ఏమి? నాపై ఆగ్రహించారు ఎందుకు? అని అడిగాడు.
సిద్ధ యోగి ఇలా చెప్పారు , 'నాయనా! నేను చెప్పేది శ్రద్ధగా విను - భక్తులపై ఆయన కృపను అన్ని జీవులకు ఆయన ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది, దానిలో ఎలాంటి లోపం ఉండదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ద లేని వాడు, సంశయాత్ముడు ఎవరి చేత అంగీకరించబడడు. ఆయన ఎవరి పైన కోపించరు, అలాంటిది శ్రీ గురుణ్ణే శంకించే వాణ్ని అనుగ్రహించేది ఎవరు? అని చెప్పగా నామ దారకుడు "స్వామి! దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరు అన్నారే అది ఎలా సంభవం? అందుకు ఏమి తార్కాణం ఏమి చెప్పమనగా , సిద్ధుడు అతని జిజ్ఞాస కు సంతోషించి నీవు బుద్ధిమంతుడు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడు గానున్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించి మొదట నారాయుని నాభి నుంచి ఒక కమలము - దాని నుండి బ్రహ్మ పుట్టారు. మొదట బ్రహ్మనిస్టు లైనా సనక, సనందన, సనత్ కుమార , ప్రజా పతులైన మరీచి, అత్రి, అంగీరస లను సృష్టించాడు, తరువాత లోకాలను , దేవతలను, జీవరాశిని, మానవులను సృష్టించారు, వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలు మరియు 4 యుగాలను సృష్టించారు.
అప్పుడు బ్రహ్మ! కలి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచి పెట్టి అధర్మం అనుసరించే వారిని లోబరచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింప చేయి. శివ కేశవులు ఒక్కరే అని, తల్లిదండ్రులు - గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు - తులసిని పూజించే వారిని భావించవద్దు. ప్రత్యేకించి గురు సేవ అందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవేమి చేయలేవు', వారిని భావించవద్దు అని చెప్పారు. శ్రీ గురుని గొప్పతనం గురించి బ్రహ్మ ఇలా చెప్పారు.
కలి పురుషుడు స్వామి! గురువంటే ఎవరు? అతని గురించి ప్రత్యేకించి చెబుతున్నారే ! అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు? అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు - ' గురువు త్రిమూర్తుల స్వరూపం, ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపిస్తే వారిని త్రిమూర్తులు కూడా రక్షించలేరు. గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులు అవుతారు గాని గురువు సంప్రీతులు కాకపోవచ్చు .
పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సబ్బ్రాహ్మణులు , వ్రత దీక్ష పూనిన వారు, తపస్వులు ఉండేవారు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు, వారిలో ఫైలుని కుమారుడు వేద ధర్ముడనే ముని ఒకరు. ఒకసారి అంగీరస మహర్షి శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించవలసి, అందరినీ పిలిచి ఇలా అన్నారు.' నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం - ఈ జన్మలో తపస్సుతో నశించిపోయింది ,మిగిలి ఉన్న కొంచెం జీవితం అయిన అనుభవిస్తే కాని తీరదు. దీనిని తప:శ్శక్తితో పోగొట్టుకుంటే అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది కనుక పాపం అనుసరించి గళత్కు కుష్టి రోగిని, కుంటి వాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవించి మోక్షం పొందాలి. అంత కాలము అక్కడ నాకు తోడుగా సేవ చేయగల వారు మీలో ఎవరున్నారు'' అని అడిగారు.
గురుసేవలో లోపం వస్తే ప్రమాదం అన్న భయంతో అందరూ మౌనం వహించారు కానీ ద్వీపకుడు అనే శిష్యుడు ముందుకు వచ్చి, పాప శేషం ఉంచుకోకూడదు , కానీ మీరు అనుమతిస్తే నేను అనుభవించి మీకు సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అది నేను అనుభవించవలసిందే , వేరొకరు అనుభవిస్తే తీరదు, నా పాప శేషం అనుభవించడం కన్నా నాకు సేవ చేయడమే కష్టతరం, అందుకు ఇష్టమైతే నాతో రావచ్చు.
వేద ధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణిక కు నమస్కరించి పూజించాడు. అలా చేయగానే ఆయనకు గళత్కు కుష్టురోగం , కుంటి తనం, గుడ్డితనం వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్టురోగంతో కుళ్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది., దానికి తోడు మతిస్థిమితం కూడా వచ్చింది ఇప్పుడు. దీపకుడు గురువును సాక్షాత్తు విశ్వనాథుడు అని సేవించేవాడు, కానీ వేద ధర్ముడు అతన్ని అన్ని రీతుల బాధిస్తూ ఉండేవాడు . అతను మంచి అన్నం తెస్తే కొంచెమే తెచ్చాడని ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువ తీసుకొస్తే రుచిగా లేదని విసిరి కొట్టి మంచిది తెమ్మని వేధించేవారు. ఒక్కొక్కసారి ప్రేమతో " అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడువి, నా కోసం చాలా కష్టపడుతున్నావు" అని, మరుక్షణంలోనే నన్ను ఈగలు కుడుతున్నాయి కానీ వాటిని నీవు సరిగ్గా తోలకుండ నన్ను చంపుకుతింటున్నావే " అని తిట్టేవారు. దీపకుడు ఆ పని చేయబోతే ఓరి దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతోంది. ఇంకా భిక్షకు వెళ్లి అన్నం తీసుకురావా? అని అంటుండేవారు. గురువే సకల దేవతా స్వరూపమని భావించి కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక, దేవతలని కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యే వాడు. ఎవరితోనూ మాట్లాడకుండా, తన పని కూడా చేసుకోకుండా గురుసేవలోనే నిమగ్నమయ్యే వారు.ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని భక్తికి మెచ్చి అతనికి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నా కూడా గురువు ఆజ్ఞ లేనిదే ఏ వరము కోరుకో లేనన్నాడు. దీపకుడు గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా వరం కోరడం మీకు ఇష్టమేనా అని అడుగగా, ఏమిరా! నాకు సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నాకు ఎట్టి వరం వద్దు అన్నారు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసే వారికి దర్శనం ఇవ్వకుండా ఎప్పుడు స్మరించని నాకు వరం ఇస్తానంటున్నారు ఏమిటి? అని అడగగా గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే! అట్టి వారికి నేను ఆదీనుడను. కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు, గురువే సకలదేవతా స్వరూపం అని, సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఇచ్చే వరం గురువు కూడా ఇవ్వగలడు కదా! అన్నాడు దీపకుడు. అవును “మేము ఇద్దరం ఒక్కటే” మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అనగా, దీపకుడు స్వామి! అలా అయితే గురుభక్తి వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి గురు సేవ వలన తరించావు, బ్రహ్మానందం పొందగలవు' అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.
దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినది అంతా చెప్పాడు, శిష్యునితో నాయనా! నీ గురుభక్తికి మేము సంతోషించాము. నీవు కాశి క్షేత్ర యాత్ర చేసి నీవు ఇక్కడే సుఖంగా నివసించు, బ్రహ్మానందం పొందగలవు అన్నారు. వెంటనే గురువు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు, నిజానికి గురుభక్తి పరీక్షించడానికి ఇలా చేశారు గాని, వాస్తవానికి ఆయనకి పాపం ఎక్కడిది? అనుకున్నాడు. ద్వీపకుడిని ఆశీర్వదించి ఆయన అదృశ్యమయ్యారు.
ఓ కలిపురుషా! కలియుగం ప్రారంభం కావలసి యున్నది, నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురువు భక్తుని నీవు కంటి తో నైనా చూడవద్దు సుమా! అని ఈ బ్రహ్మ దేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు.
గురువు యొక్క మహిమ ఇంతటి దని చెప్పడానికి వీలుందా? నామదారకా! ధ్రుడ భక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని పూజిస్తారో తప్పక కృతాజ్ఞలు అవుతారు అనిసిద్ధులు చెప్పారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 3
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామదారకడు నమస్కరించి, ఓ సిద్ధమని మీరు నా సందేహాలన్నీ తొలగించారు, నాకు గురువు యొక్క యదార్ధ తత్వం తెలిసింది మీకు జయము జయము.. ఇంతకూ మీ నివాసం ఎక్కడ అని అడగగా శ్రీ గురుని చెంతనే ఉంటాను, శ్రీ గురు స్మరణయే నాకు ఆహారం, “శ్రీ గురు చరిత్ర శ్రవణం చేస్తుంటే భక్తి, ముక్తి లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణం లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానం, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానం ఎవరు కోరిన వారికి లభిస్తాయి” అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు.
నామదారకడుఎంతో ఆసక్తితో ఆయనకు నమస్కరించి దీనిని నేను శ్రవణం చేయాలని అనిపిస్తున్నది, నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వద్ధ (రావి) వృక్షం దగ్గరకు తీసుకువెళ్లి ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టుకుని “శ్రీ గురుని పట్ల నీకు అట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం”, చెబుతాను శ్రద్ధగావిను.
పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరి, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించే వారు. ఒకరోజు ద్వాదశి తిధి ఒక గడియ మాత్రమే ఉండగా, దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యుల తో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి అనుష్టానం పూర్తి చేసుకుని భోజనానికి త్వరగా రమ్మని ప్రార్ధించాడు. మహర్షి స్నానానికి వెళ్లి పారాయణ సమయం మీరి పోతున్నా రాకుండా ఆలస్యం చేసినందున, తిధి మించితే వ్రతభంగం అవుతుంది అలా అని భోజనం చేస్తే అతిధిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని ఆ రెండింటిని పరిరక్షించుకోవడానికి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చి కోపించి, “రాజా! నీవు నానా యోధులలో జన్మింతువు గాక ! అని శపించారు., అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీ హరిని శరణు పొందాడు, శ్రీహరి దుర్వాసునికి సాక్షాత్కరించి “మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు, అతనిని రక్షించడం నా ధర్మం,” అయినా మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింప చేయి అన్నారు. ఇలా నైనా శ్రీహరి అవతరిస్తూ లోకోపకారం చేయగలరని సంతోషించి అంతర్ధానం అయ్యారు, ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు, ఈయన అత్రి అనసూయలకు జన్మించారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 4
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు, ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాశాలకు వెళ్లి , అక్కడ అనసూయాదేవి ప్రాతివ్రత్యాని ఎంతగానో ప్రశంసించాడు , ఆమె వలే ఆదరించే సాధ్వి మరొకరు లేరని కొనియాడారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలె భయపడి అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిధి వేషాలలో అత్రి మహా ముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, “అయ్యలారా! మీ రాక చేత పావనం అయ్యింది. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అనగా, అప్పుడు ఆ అతిథులు “అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తాడో, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె భోజనానికి దయచేయమని ప్రార్థించగా అపుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తామని మాట ఇచ్చావు , కానీ మాదొక షరతు ఉన్నది, నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే భోజనం చేస్తాము. లేకపోతే ఆకలితోనే వెళ్లి పోతాము అన్నారు, వారు ఆకలితో వెళ్లిపోతే అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్య భంగమువుతుంది!అయినా వారి విచిత్ర షరత్తుకు నవ్వుకుని," తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంసర్గం వలన నాకు భయం లేదు, ఆకలితో అన్నం అడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పర పురుషులు కారు" అనుకుని ఆ సాధ్వి' అయ్యలారా! అలానే చేస్తాను భోజనానికి లేవండి ' అని చెప్పి లోపలకు వెళ్లి మహర్షి పాదుకలకు నమస్కరించి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలు అయ్యారు, అంతేకాకుండా బాలింత వలె ఆమెకు సన్యమొచ్చింది, ఆమె వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలించి నిద్రపుచ్చగా త్రిమూర్తులు ప్రపంచాన్ని పాలించి అలిసిపోయిన వారిలా విశ్రాంతి చెందారు.
అత్రి మహర్షి సర్వమూ ఆమె నుండి తెలుసుకుని త్రిమూర్తులను దర్శించి, స్తుతించగా ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ తమ రూపాలలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు వారు" మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి" అని కోరారు.త్రిమూర్తులను పుత్రులుగా పొందిన అత్రిమహర్షి - బాల విష్ణుమూర్తికి దత్తుడు అని, బ్రహ్మ దేవునికి చంద్రుడని, రుద్రునికి దుర్వాసనుడు అని నామకరణం చేశాడు. ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి "దత్తాత్రేయుడని" వ్యవహరిస్తారు.
నామధారకా! అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మయైన శ్రీదత్తుడుశాశ్వతంగా భూమిమీద సంచరిస్తూ భక్తులను సంచరిస్తుంటాడు. కనుక అట్టి కలియుగంలో కూడా బుద్ధి పూర్వకంగా శ్రీ గురుని ఆరాధించి తరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం నీకు లభించింది శ్రద్ధతో విను అన్నాడు సిద్ధయోగి. నామధారకుడు దత్తఅవతారం గురించి విని ఆనందించి, "ఆహా!అలనాటి అనసూయ దేవి ప్రాతివ్రత్యం వలన ఈ మానవాళికి గురు పరంపర, మా వంటి అజ్ఞానులకు మీవంటి గురువు యొక్క కృప లభించాయి" అన్నారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 5
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడు , మహానుభావా! భగవంతుడు కలియుగంలో రెండుసార్లు అవతరించారు అంటిరి కదా! వాటిని వివరించమనగా, అతనికి శ్రద్ధభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు, " మంచిది, ఆ కథలు వినడం వలన నీకు ఎంత ప్రయోజనమో, అవి చెప్పడం వలన నాకూ అలాంటి ప్రయోజనం కలుగుతుంది " కనుక చెబుతాను శ్రద్ధగావిను. ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వ పురానికి తూర్పు దిక్కున దూరంగా, పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు ఆపస్తంబ శాఖకు చెందినవారు దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా, ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకరు కుంటివాడు, మరొకరు గ్రుడ్డివాడు. తర్వాత కూడా ఇద్దరు పుట్టి చనిపోయారు.
నిత్యం బిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ చేస్తుండగా, ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. అలాంటి రోజున బ్రాహ్మణులు భోజనం చేయకుండా మరెవరూ భోజనం చేయరాదు అని శాస్త్రం. ఇల్లాలైనా సుమతి వచ్చి అతనిని తమ కుల దైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన సన్యాసి తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చి , నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు, నీ అభీష్టమేమిటో చెప్పమనగా? " పరమాత్మ! అ యోగులను కూడా ముగ్దులను చేసేలా దర్శనమిచ్చి, నా చేతి స్వీకరించారు, ఇంతకంటే నాకేం కావాలి? కానీ నీవు నన్ను తల్లి కనుక నీవిచ్చిన మాట నిలబెట్టుకో" చాలు అన్నది.
భక్తిశ్రద్ధలతో జాగృతమైన ఆమె బుద్ధికి ఆశ్చర్యచకితుడైన దత్తాత్రేయుడు, " అమ్మా! నాతో సమానుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు" అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అప్పుడు సుమతి దేవి ఆనంద పారవశ్యంతో పితృశార్ధ కాలాపాని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి జరిగింది చెప్పగా," సాధ్వి , మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శార్ధకర్మను యజ్ఞభోక్తయైన విష్ణుకి అర్పిస్తాం? నీవు పెట్టిన బిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మనం మహద్భాగ్యం. ఇది కేవలం నీ విశ్వాసమే! శ్రీ దత్తాత్రేయస్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిధి వలె సంచరిస్తూ ఉంటాడు అని వెల్లడి అయినది.
సుమతి దేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయ శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయినా భగవంతునికి పుట్టుక ఇచ్చింది. అతనికి " శ్రీపాదులు" అని నామకరణం చేశారు. నామధారకా! అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం.
శ్రీ పాదుడు పుట్టినది మొదలు అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటకడుతుండగా, శుభ ముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా గురువు వద్ద అధ్యయనం చేస్తే గాని వేదం రాదు కానీ ఆ మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి పూర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతి దేవికి ఇచ్చిన మాట పదార్థం అని నిరూపించారు. ఇది ఆయనకు తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీ పాదుడు పదహారేండ్ల రాగా రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలనికోగా అది తెలిసి నాకు తగిన సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగ స్త్రీ, నేను ఆమెని చేపట్టి సన్యాసి అవుతాను. ఆ మాటలు తల్లిదండ్రులకు మనస్థాపాన్ని కలిగించింది. ఆయనను వారించి నాయనా! నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైనా నీ సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరల ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో ప్రగతి ఏమీ? అనగా శ్రీపాద స్వామి అన్న తన అమృత హస్తంతో స్పృచించిన వెంటనే వారిద్దరూ పాద, నేత్ర వంతులయినారు. భగవంతుని సాదియా సాదియా లు లేవు.
ఈ అద్భుత సన్నివేశం కనులారా చూసినా తల్లిదండ్రులు శ్రీ పాదుడు కేవలం తమ పుత్రుడు మరచి ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంత ఇంట కట్టిపెట్టుకోవడం అపరాధమని తోచి, సుమతి దేవి ప్రభూ! నీవు నా పుత్రుడవు అని గ్రహించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వ లోకాలను పాలించే సంగతి మరిచాను, అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు! అప్పుడు ఆయన తన యదార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశారు." అమ్మా! మీరిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు. నీ కొడుకులు ఇద్దరూ నూరేళ్లు సుఖంగా జీవిస్తారు " అన్నారు.
ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని స్తుతించాక, "తన తల్లి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి తీసుకుని సన్యసించి,పాదచారియై కాసి బృందావనం మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ వదిలి వెళ్ళిన తరువాత గోకర్ణ క్షేత్రం చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగం రూపంలో సాక్షాత్తు శంకరుడే నివాసముంటున్నాడు. ఆ లింగాన్ని ప్రతిష్టించిన వారు గనేశ్వరుడు . సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్లారు" అని సిద్దుడు చెప్పారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 6
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడు“కాశి, బదరీ, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధ మై నందు వలన శ్రీపాద స్వామి అక్కడికి వెళ్లారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు, ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించమని ” కోరాడు. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు, “పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందాలని, నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజించేది. బలగర్వితుడై న రావణుడు అది చూసి శంకరునితోపాటు సెక్స్ కైలాసాన్ని లంకకు తేవాలని, అక్కడకు వెళ్లి శక్తినంతా ఉపయోగించి పర్వతాన్ని నెత్తికి ఎత్తుకో గా , లోకాలన్నీ అకాల ప్రజల్లో ప్రళయంలో నశిస్తాయని తలచి , శివుని ప్రార్థించగా, శివుడు రావణున్ని కైలాస పర్వతం క్రిందకు అణిచి veyaga , రావణుడు ప్రాణభీతితో శివుని దీనాతిదీనంగా ప్రార్థించి, రాగయుక్తంగా, సుస్వరంగా మధుర గానం చేశాడు. అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు వరం కోరుకోమనగా, “నేను ఈ కైలాసాన్ని నాతో సహా లంక కు తీసుకు వెళ్ళాలా అనుగ్రహించు అని కోరాడు”. ఈ కైలాస పర్వతం తో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగాన్ని ఇస్తా తీసుకో అన్నారు. ఇదంతా నాయకుడు బ్రహ్మ, విష్ణువులకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి, “ఎంతపని చేశావు? రావణునికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చారు? సర్వప్రాణి కోటికీ కంటక ప్రాయుడు, లోక భయంకరుడు, అయిన రావణుడు నీ అంతటి వాడు అవటం తగునా? ” అని ఆలోచించి, గణపతిని రావణుని వద్దకు పంపారు. రావణుడు గణపతితో “ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, అందుకుగాను లంకా పట్టణం చూపిస్తా, నీకు ఇష్టం అయితే అక్కడే ఉండవచ్చు” అన్నాడు.
అమ్మో! ఇంత బరువైన శివలింగాన్ని నేను అంత సేపు మోయగలనా? అయినా ఆ భయంకర లంకాపురి కి నేను రాను అన్నాడు. రావణుడు ప్రాధేయపడి ఒప్పించ గా, అలాగే “ రావణ! దీనిని మోయలేనపుడు ఎలుగెత్తి మూడు సార్లు పిలిచి, ఇక్కడే స్థాపిస్తాను " అన్నారు . రావణుడు పక్కకు వెళ్లినదే వెంటనే గణపతి మూడు సార్లు పిలిచి అక్కడే స్థాపించారు. రావణుడు వచ్చి కోపంగా ఎంత పెకలించిన చూశాడు కానీ రాలేదు. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణ మని పేరు వచ్చింది. నాన్ ద్వారక! దానిని భూకైలాస మన వచ్చు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 7
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడు సిద్ధ యోగి నమస్కరించి. “స్వామి మనదేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ గోకర్ణ క్షేత్రం ఎందుకు ఆశ్రయించారు చెప్పండి" అడిగాడు.
అప్పుడు సిద్ధ యోగి ఇలా చెప్పారు," పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్ర సహుడనే పేరు గల రాజు రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అడవిలో క్రూర జంతువులను వేటాడుతూ ఒక రాక్షసుణ్ణి నేల కూల్చాడు, అప్పుడు ఆ రాక్షసుడు ప్రాణాలు విడుస్తూ తన సోదరిని పిలిచి, రాజు పై పగ తీర్చుకో మన్నాడు. ఆ రాక్షసుడు మామ చేత సామాన్య మానవుడిలా రాజుకు ఎంతో వినయంతో సేవ చేస్తూ ఉండగా, ఒక రాజు ఆ రాజు పితృశార్ధనికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు
ఆ కపట సేవకుడు వంటలో రహాస్యంగా నర మాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకుని రాజు పై కోపించి, “రాజా! నీవు మాకు నర మాంసం వడ్డించచావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడు అవుతావు” అని శపించాడు. ఆ రాజు కోపంతో ప్రతి శాపం ఇవ్వబోతే పతివ్రత అయిన అతని భార్య దమయంతి గురువును శపించడం మహాపాపమని చెప్పి, ఆ ఆ శాప జలాన్ని తన పాదాలపై పోసుకో మని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని,
Leave a comment