శ్రీగురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును ఈ చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకముందు, దేవుని ముందు కూర్చుని, దీపారాధన చేసి, అగరువత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవపదార్థాలు తీసుకొనవచ్చు.
ఉదయము పారాయణ చేసుకొనుటకు అవకాశము లేనినాడు సాయంత్రము స్నానము చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆరోజు చేయబడిన పారాయణ పూర్తి చేయడానికి వీలుపడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరల స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుగొనుటకు | సప్తాహ నారాయణ |ఒకవారము లేక 7 రోజులు పూర్తి చేయలేనివాడు ద్విసప్తాహ (2వారాలు) చేసుకొనవచ్చు. అందుకుగూడ అవకాశం లేనివారు రోజుకు ఒక అధ్యాయము చొప్పున పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు.
శిరిడీ సాయిబాబా భక్తులకు "శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సారే, అన్నాసాహెబ్ ధలోత్కర్ వంటి వారికి సాయిబాబా దర్శనం, అనుగ్రహం లభించడానికి. "శ్రీ గురుచరిత్ర" పారాయణమే కారణమయింది. స్వయంగా పాడాయణ చేడు లేనివాడు శ్రీ గురు చరిత్ర పణ చేసినా అదీ పలితముటదని శ్రీగురుడు చెప్పాడు.
Leave a comment