బుధవారం పారాయణ ప్రారంభం
అధ్యాయం - 44
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామదారకుడు నమస్కరించి, “స్వామి! శ్రీ గురుణ్ణి లీలలు ఇంకొకటి వివరించండి!” అని కోరగా సిద్ధ యోగి ఇలా చెప్పసాగారు. “శ్రీ గురుని సేవకులలో తంతకుడు అనే సాలె వాడు ఒకడుండేవాడు, అతడు నిత్యం ఇంటి పనులు చూసుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గులు పెట్టేవాడు. అటుతరువాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికి అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు “ఓరి వెర్రి వాళ్ళ రా! శ్రీశైలం ఎక్కడ ఉంది అనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? నేను ఆయనను , ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు. అతనిని తెలియని మూర్ఖుడని వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. వాళ్ళని సాగనంపి గురు సేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు.
స్వామి అతనిని పలకరించి మీ వాళ్ళందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెల్లడం వలన ఇంట్లో పాపం నీవు ఒక్కడివే ఉన్నావు కాబోలు! నీవు ఇదివరకుపుడైనా శ్రీశైలం దర్శించావా, లేదా? అన్నారు. “స్వామి! ఏలినవారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను, తీర్థయాత్రలు అన్ని నాకు మీ పాద సేవ లోనే ఉన్నాయి” అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ అత్యంత బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. నీవు ఎప్పుడూ చూడలేదు కదా,నీవు కూడా వెళితే బాగుండేది అన్నారు”. అప్పుడు “స్వామి! నాకు దాని మీద అంత ప్రీతి లేదు, ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది” అన్నాడు. శ్రీ గురుడు అతని భక్తికి అబ్బురపడి “నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది, నీవు నా పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో! అని ఆదేశించారు. అతడు చిత్తమని అలా చేయగా, శ్రీ గురుడు క్షణకాలంలో శైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవని చెప్పి, శ్రీ గురుడు నవ్వుతూ “భయపడతావెందుకు ? ఇదే శ్రీశైలం. నీవు, క్షవరం,. స్నానం మొదలగునవి పూర్తిచేసుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా, పో! అని హెచ్చరించారు.
తంతకుడు శ్రీ గురునికి నమస్కరించి మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ల అతనిని చూసి ఆశ్చర్యపడి,, ఏమయ్యా! నీకు ఆ స్వామి తప్ప మరే యాత్ర అక్కర్లేదు అన్నవాడివి మళ్లీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావ్ ఏమి? అని ఎగతాళి చేశారు. వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకుముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీ గురుడు ఇంతలో నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు అంతేకాని నాకు ఏవి తెలియదు అని చెప్పి మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లగా అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు, ఆ స్థానంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు దర్శనం అయింది, మొదట క్షణకాలం ఆశ్చర్య చకితుడయ్యాడు కానీ మరలా తెలివి తెచ్చుకుని “శ్రీ గురుడు సాక్షాత్తు శంకరులే కదా!” అది సమాధానపడ్డాడు. తరువాత మల్లికార్జునునికి పూజ చేసుకుని, పొంగిపొర్లుతున్న సంతోషంతో శ్రీ గురుని వద్దకు వచ్చి' మహాత్మా! నేడు ఒక విచిత్రం చూసి వచ్చాను, లింగార్చన కని వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగం లో మీరే ఉండి పూజలు అన్ని అందుకున్నట్లు దర్శనం అయింది. అటువంటప్పుడు మీ పాదాల వద్ద పడియున్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు నాకు అర్థం కావడం లేదు” అన్నాడు. 'నాయనా! , అలా కాదు. పరమేశ్వరుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్న స్దాన మహిమ వలన భక్తులు తరిస్తారు.
“నాయనా! మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమ శాలి, బుద్ధిమంతుడు అయినా విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ, పర స్త్రీ లంపటుడుగ ఉండేవాడు. కానీ మరొక ప్రక్క శ్రద్ధగా లింగార్చన చేసి, నృత్యగీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు. ఆమె అతనితో, “ప్రాణనాధా! మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, ఆహార వ్యవహారాలలో ఎట్టి నియమం పాటించని మీకు ఇంత ఈశ్వరభక్తి ఎలా సాధ్యమయింది ? అని అడగగా రాజు నవ్వి ఇలా చెప్పాడు.
“ప్రేయసి! నీకు నా పూర్వ జన్మ వృత్తాంతం చెబితే కానీ సందేహం తీరదు, వెనుకటి జన్మ లో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు శివరాత్రి నాడు అందరూ ఉపవసించాలి కనుక మా యజమాని కూడా అన్నం వండలేదు, నాకు కూడా పెట్టను లేదు. అందువలన నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. నేను ఆకలికి ఓర్వలేక పులి విస్తరాకులు కోసం వెతుక్కుంటూ, దేవాలయంలో ఏమైనా దొరుకుతుందేమోనని గుడిలో ప్రవేశించి అన్ని మూలల తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి శివలింగం నా కంట పడింది, ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి, “కుక్కను కొట్టండి !” అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూసాను గాని సింహద్వారం దగ్గర జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. వారి నుండి తప్పించుకోవడానికి ఆలయం చుట్టూ మూడు సార్లు పరిగెత్తాను. చివరికి అచటి జనం బలంగా బాదటంతో నేను ఆలయ ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకుండానే ఉపవాసం ఉండి, శివ పూజ దర్శించి, ప్రదక్షిణం చేసి పుణ్యం ఆ ర్థించాను. గుడిలోని దివిటీలను చూస్తూ శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను, అందుకే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానం, రాజ్యం లభించాయి. ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి“ప్రాణనాథ! శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులు ”అయ్యారు , తెలియకనే ఆ క్షేత్రంలో చేసిన ప్రదక్షణం వలన కుక్కకు రాజ్యం లభించింది, గంధర్వపురంలో ఈ మల్లికార్జున తో సమానమైన కాళేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యం ఆయనను ఆరాధించు అని చెప్పాడు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో శ్రీ గురు దర్శనానికి వచ్చి లభించక నిరాశతో తిరిగి పోయారు. శ్రీ గురుడు వాళ్లందరినీ పిలుచుకురమ్మని తంతకుడుని గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూసి ఆశ్చర్యంతో," నీవు మహా శివరాత్రి నాడు తల గొరిగించుకున్న ఏమి?" అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పి, అందుకు తార్కాణం గా శ్రీశైలం ప్రసాదం చూపాడు. వాళ్లు అది నమ్మక " మధ్యాహ్నం కూడా నిన్ను మా ఇంటి దగ్గర చూసాము, ఇది నిజం కాదు అన్నారు. తనను శ్రీ గురుడు రెప్పపాటులో శ్రీశైలం తీసుకు వెళ్లారని చెప్పి, స్వామి ఇప్పుడు సంగమంలో ఉన్నారు మిమల్ని పిలుచుకు రమ్మన్నారు అని చెప్పాడు. వెంటనే అందరూ శ్రీ గురునీ దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనం ఇచ్చారని స్తుతించారు.తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పుర వాసులు తిరిగి వచ్చి, ఆ క్షేత్రంలో తాము తంతకుడు ని చూశామని చెప్పారు. కొందరు నమ్మని వారు కూడా తంతకుడుచెప్పినది వాస్తవం అని తెలుసుకున్నారు. " శ్రీ గురుని మహత్యం ఎంతని చెప్పగలం! నామధారకా !
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా!!
అధ్యాయం - 45
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
సిద్ధ యోగి ఇంకా ఎలా చెప్పారు, నామధారకా ! ఇంతకుముందు నరహరిశర్మ వలెనే శ్రీ గురుని సేవించి, మరో ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీ గురుడు వారినెల అనుగ్రహించారో చెబుతాను విను. నంది శర్మ అనే బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు బాధ తొలగించుకోవడానికి తుల్జా పురం వెళ్లి, అహర్నిశలు తదేక దీక్షతో భవాని దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి 3 రోజులు ఉపవాసం చేశాడు. మూడవ రాత్రి స్వప్న దర్శనమిచ్చి, చందాల పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానం అయింది. ఆ ప్రకారమే ఏడు మాసాలు ఒంటిపూట భోజనంతో పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని అంతర్ధానమైంది. నిద్ర లేచి" అయ్యో! నేను ఇంతకాలం దీక్షతో ఉపవసిస్తే తేలినది ఇదేనా? దేవి! ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. మూడు సంవత్సరాలు తులజభవాని న్ని ,ఏడు నెలలు నిన్ను సేవిస్తే, నీవు చివరకు నన్నొక మానవమాత్రుడిని ఆశ్రయించమంటారే , నీ దైవత్వం ఏమున్నది? ఇలా చెప్పడానికి పరాశక్తి వైన నీకు సిగ్గు వేయడం లేదా? బలహీనుడైన నేను ఇంకెక్కడకు పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే దీక్ష చేస్తాను. దేవి! నీవు నా రోగం పోగొట్టుకుంటే మీ పాదాల వద్ద ప్రాణత్యాగం చేస్తాను, అని దేవికి చెప్పి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆరోజు దేవి మరల స్వప్న దర్శనం ఇచ్చి అచటి నుండి వెళ్లిపొమ్మని ఆదేశించి, పూజారికి కూడా స్వప్నంలో సెలవిచ్చింది. ఉదయమే పూజారి వచ్చి అతనితో “నందయ్యగారు” అమ్మవారు సెలవు అయ్యింది. తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపాసిస్తూ ఒక శివరాత్రికి గాణ్గాపురం చేరుకున్నాడు. అతడు ఆ దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని నగర వాసులను విచారించగా, సంగమానికి స్నానానికి వెళ్లారు, కొద్ది సేపటిలో తిరిగి వస్తారు అని చెప్పారు. స్వామి మఠానికి వచ్చి కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్టురోగి వచ్చారని అచటి వారు మనవి చేశారు, అది వినగానే శ్రీ గురుడు“ వాడు సంశయాత్ముడు” అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. శ్రీ గురుడు నంది శర్మతో “! ఏమయ్యా! మొదట దేవిని ఆశ్రయించాక, మానవమాత్రుడిని దర్శించేది ఏమిటి? అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుండా రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులు అని తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామి! నేను మూఢుడను, పాపాతీతుడైన నేను , మీరు మాయాతీతుడు అని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకోలేకపోయాను. మీ దర్శనం వల్ల నా పాపాలు నశించాయి. ఈ దుస్థితిలో నేను బ్రతకలేను మీరే నాకు దిక్కు, ఆపైన మీ దయ” అని దీనాతిదీనంగా శ్రీగురుని వేడుకున్నాడు.
శ్రీ గురుడు అతని పట్ల కృప చెంది, సోమనాథుడు అనే ప్రియ శిష్యుని పిలిచి, “నాయనా! నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పి , అచట షాట్కుల తీర్థంలో స్నానం చేయించి, అశ్వత్థ వృక్షాన్ని సేవించి, అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకుని రా! అని ఆదేశించారు. ఆ ప్రకారం నంది శర్మ స్నానానికి వెళ్లి ఆ నదిలో ఒక్కసారి మునిగి పైకి లేవగానే శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది, అశ్వద్ద వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. పాత వస్త్రాలు మూటకట్టి తగల పెట్టగా ఆ ప్రదేశం అంతా చవుడు బారి పోయింది. ఒక్క గడియ క్రిందట దేహమంతటా కుష్టురోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్దుడై, సోమనాథుని తో పాటు వస్తున్న నంది శర్మను చూసి అచటి వారందరూ ఆశ్చర్యపోయారు.
శ్రీ గురుడు అతనిని చూసి, “ఏమి నందిశర్మ! నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్లంతా చూసుకుని చెప్పు! అన్నారు. తన పిక్క మీద కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూసి బాధపడి, “అయ్యో! మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించ లేదే! నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, “నాయనా! నీవు దేవతల వలన కానిది, ఒక మానవమాత్రుడి వలన ఎలా సాధ్యమవుతుందని సంశయించినంత మేరకు మిగిలింది. మీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త కూడా తొలగిపోతుంది అన్నారు. నంది శర్మ “స్వామి! మీ అందు నాకు సంశయం లేదు కానీ, నేను చదువు కోలేదు నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం ? అయినా నా నోటి నుంచి వచ్చిన మాట వెనుకకు మరలదు. నంది శర్మని నోరు తెరవమని చెప్పి భస్మం నాలుక చివర ఉంచారు, అంతే అతడు జ్ఞానవంతుడుడై చేతులు కట్టుకుని స్తుతించాడు.
నంది శర్మ, శ్రీ గురుని స్తుతించడంలో తనను తాను మరచిపోయి, వీరి పాద స్పర్శ వలన బ్రహ్మ చే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిధి వల్లే నేడు మనకి ఈయన లభించారు. ఈయన మహత్యాన్ని నేను ఎంతని వర్ణించను? వాక్కు మనస్సు కు అతీతమైన ఈయన మహిమను వర్ణించ బోయి వేదమే మూగపోయింది, అని ఇక నోటమాటరాక ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. ఆ స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు బ్రాహ్మణునికి “కవీశ్వరుడు” అని బిరుదు ఇస్తున్నాము. నేటినుండి అందరూ ఇతనిని కవీశ్వరుడు అని పిలవండి. ఇంతలో నంది శర్మ తన శరీరం పరిశీలించుకుని ఆ కొద్ది కుష్టు కూడా మటు మాయం అవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నంది శర్మ శ్రీ గురుని స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా!!
అధ్యాయం - 46
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామ దారుకుడు , “స్వామి! శ్రీ గురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండే వాడంటిరి కదా! అతడెవరు? అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో , ఆయనను ఎలా సేవించాడు వివరించండి అన్నారు. సిద్ధ యోగి ఇలా చెప్పనారంభించారు. గాణ్గాపురం సమీపంలోనే 'హిప్పగిరి' అనే గ్రామం ఉన్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు వచ్చి శ్రీ గురుణ్ణి పూజించి పాద పూజ చేసుకో దలచి ఆయనను ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకు వెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంలా జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు పాద పూజలు చేశారు. ఆ ఊళ్లోనే నరికేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి శివ భక్తుడు . అతడు నిత్యం కల్లేశ్వరుడుని స్తుతిస్తూ , పంచ పద్య మణిమాలలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవారు. అతడు శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించే వాడు కాదు, స్తుతించే వాడు కాదు. అతడు ఒకసారి శ్రీగురుని గురించి నంది శర్మ చేసిన స్తోత్రం విని, “ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, కానీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు” అని తలచారు.
కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి కవి చంద్ర! మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి కి కవిత్వం అంటే ఎంతో ప్రీతి, కనుక వారిని స్తుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసి ఇస్తే అవి వారి ఎదుట చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా! అది నావల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. అయన సేవకి నా కవిత్వం అంకితమిచ్చాను అని చెప్పి, కలే శ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్లాడు. అదేమి చిత్రమో గాని పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర రాసాగింది. ఎంత ఆపుకుందామనుకు న్నా ఆగక పూజ మధ్యలో కునుకుపట్టింది. ఇంతలో ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో కూడా పూజ చేస్తున్నాడు కానీ ఎప్పుడూ కనిపించే కళ్ళే శ్వరుడు కనిపించకుండా ఆ స్థానంలో శ్రీ గురుడు కూర్చుని వున్నారు, ఆయన నవ్వుత్తూ నీవు కల్లేశ్వరుని తప్ప మరి ఎవరిని నీ కవితతో స్తుతించవు కదా ? మానవమాత్రులేనా మమ్ము పూజిస్తున్నావేమి అన్నారు . నరకేసరి తుళ్ళిపడి మళ్ళీ పూజ ప్రారభించగా కొద్దిసేపటికి కునుకుపట్టింది. శ్రీ గురుడు మళ్లీ స్వప్న దర్శనమిచ్చి “మేము - కాళేశ్వరుడు ” వేరు కాదు అన్నారు.
ఈసారి మేల్కొని“అయ్యో!” నేను ఇంతవరకు పొరబడ్డాను! ఈ నరసింహ సరస్వతి యతి రేణులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని, నేను అనుకున్నట్లు మానవమాత్రులు కారు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురుడు దర్శనానికి వెళ్లి స్వామిని తన కవితతో స్తుతించాడు. “అనంత! సచ్చిదానంద స్వరూపమైన మీరు సాక్షాత్తు ఆ కలేశ్వరులే. కఠోర తపస్సు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు, కళేశ్వరం కృప వలన నాకు ఈనాడు మీ దర్శనం లభించింది. ఇక లోకంలో మీ పాదాలను ఆశ్రయించక, ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే! అని స్తుతించాడు. శ్రీ గురుడు అతనిని నీ అభీష్టాలు అన్ని నెరవేరు తాయని అని ఆశీర్వదించారు. నామధారకా ! శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా! అని చెప్పారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా!!
అధ్యాయం - 47
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
ఒకనాడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత వ్యక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు బిక్షకు ఆహ్వానించాలని గాణ్గాపురం వచ్చారు. ఆ యేడుగురు ఆ చుట్టుప్రక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే అదే రోజు అందరూ ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? మీలో మీరే నిర్ణయించుకునిఎవరి గ్రామానికి రావాలో చెప్పండి, అక్కడికి మేము రాగలవు అన్నారు.
అప్పుడు ఆ ఏడుగురు ఇంటికి రావాలంటే, తన ఇంటికి రావాలని వాదించు కొనసాగారు. వారు ఒక నిర్ణయానికి రాకపోయేసరికి శ్రీగురుడు నవ్వి, మీరు వాదించుకోవడం ఎందుకు? మీరందరూ నా పై విశ్వాసం ఉంచి, ఆ విషయం మా ఇష్టానికి విడిచి పెట్టండి. అప్పుడు స్వామి! , “మీరు మీ ఇళ్లకు వెళ్ళండి. ఆనాడు మాకై మేమే రా గలం , సందేహించవలదు! అని వాగ్దానం చేశారు. ఆరోజు గంధర్వ పురవారసులు వెంటనే వారి వద్దకు వచ్చి, ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్లొద్దు అని బ్రతిమాలారు. వారితో “స్వామి మేమా నాడు ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళాము” అని మాట ఇచ్చి ఊరడించారు.
చివరకు ధనత్రయోదశి తానే వచ్చింది, ఆ రోజు ఆ ఏడుగురు గ్రామాల పెద్దలు శ్రీ గురుడు తప్పక తన ఇంటికి రాగలరు అని ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం సమయంలో శ్రీ గురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు! అయినప్పటికీ ఎనిమిదవ రూపంలో తమ మఠంలోనే ఉండి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన అన్ని గ్రామాలకు వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. పదిహేను రోజుల తర్వాత కార్తీకపూర్ణిమ దీప తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ పురం చేరుకున్నారు. వాళ్ళందరూ ధన త్రయోదశి ఉత్సవ విశేషాలు చెబుతుండగా, ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివి గా తోచాయి. ఎవరికి వారు, శ్రీ గురుడు తమ ఇంటనే బిక్ష చేశారని ఒకరి మాట ఒకరికి ఖండించుకోగా, ఎక్కడికి వెళ్ళలేదు గంధర్వపురం లోనే ఉండి మా సేవలు అందుకున్నారని పుర వాసులు మందలిస్తుండగా , అప్పుడు శ్రీ గురుడు మీరు వాదులాడుకో వద్దు. మీలోఎవరు అబద్ధం చెప్పడం లేదు! మేము అంతటా ఉన్నాము కదా! అన్నారు. స్వామి అనాడు అన్ని రూపాలు ధరించి, అందరి పూజలు అందుకున్నారు అన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీ గురుని కీర్తించు కున్నారు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం. ఆయనను మించిన దైవము లేదు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి శ్రీ గురు పాద సేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా! అన్నారు సిద్ధ యోగి.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 48
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
“స్వామి! ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేస్తారో చెప్పండి! అని కోరిన నామ దారకునితో సిద్దుడు ఇలా చెప్పారు. “నాయనా! భగవంతుడు ప్రతిరోజు స్నాన అనుష్టానాలకు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారని చెప్పారు కదా! అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు సాగుచేసే పొలం మఠానికి వెళ్లేదారిలో ఉండేది. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో భక్తి శ్రద్ధలతో దూరం నుంచే నమస్కరించుకుని పోతుండేవాడు. ఎంత కాలానికి అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీ గురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే “నాయనా! నిత్యం నీ వింతా భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను, మా నుండి మీకేమి కావాలో చెప్పు” అన్నారు. ఇంతకాలానికి తనకంటే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి “నా పొలాన్ని ఒక్కసారి చూసి తమ పాదము పెడితే మాకు మేలు అవుతుందని నా ఆశ ” అన్నాడు. స్వామి! , “నాయనా! నీ పొలంల్లో ఏమి పైరు వేసావు? అని అడిగారు. అతడు అయ్యా! ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటే చేను బాగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటుంది. ఎవరో శూద్రుడు ఏధో చెప్పాడు లే అని తలచి నా మాట తీసు పుచ్చ వద్దు”, నా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు.
శ్రీ గురుడు,' సరే పద చూసి వద్దాం,' అని చెప్పి , అతనితో కూడా చేను వద్దకు వెళ్లారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూసి ఏమిరా! మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను! అన్నారు ఆ రైతు. “తండ్రి మీ మాట జవదాటతానా” ? మీరు ఒక మాట చెప్పాక తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు . గురువు ఆజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. అయితే నా మాట మీద నమ్మకం ఉంచి , మధ్యాహ్నం తిరిగి వెళ్లే లోపు పైరు అంతా కోయించు! అని చెప్పి సంగమానికి వెళ్లి పోయారు.
శ్రీ గురుని ఆజ్ఞ పాటించాలని తలచి ఆ పొలం యొక్క ఆసామి వద్దకు వెళ్లి ఆ ముందు సంవత్సరం చెల్లించిన ప్రకారమే గుప్త చెల్లిస్తానని, లేకపోతే దానికి సరిపడా నా దగ్గర పశువులు ఉన్నాయి భయం లేదు, పొలం కో పెంచడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. పైరుకు పాలు పట్టే సమయం లోనే అతడు కోత కోయిస్తున్నాడు! పులులు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. భార్యాబిడ్డలు వచ్చి అతనిని వారించినా కావాలంటే వినకపోయేసరికి ఆ స్వామి వద్దకు వెళ్లారు. పర్వతేశుడు పైరు కోత త్వరత్వరగా పూర్తి చేయించి, శ్రీ గురుని స్మరిస్తూ, అయినా సంగమం నుండి మఠానికి వెళ్లేదారిలో శ్రీ గురు నీ రాకకై ఎదురు చూడగా, శ్రీ గురుడు ఆ కోసి ఉన్న పొలాన్ని చూసి , స్వామి ఆశ్చర్యం నటిస్తూ,' అయ్యో! నీవు అనవసరంగా పైర్ అంతా కోసి వేయించ వే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావు? పాపం మీ జీవనమెలా? అమాయకుడా ! పండిన పైరు కోసి అంతా వృధా చేసేసావు కదా అన్నారు!
కానీ పర్వతేశుడు జంకకుండా గురు వాక్యమే శ్రీరామరక్ష. మీరు ఉండగా నాకేమీ భయం? అన్నాడు. “నీకు అంత దృఢ విశ్వాసం ఉంటే అలానే జరుగుతుంది లే! అని మఠానికి వెళ్లిపోయారు.” ఒక వారం రోజులు గడిచాక 8వ రోజు విపరీతమైన, చలిగాలి వీచటం ప్రారంభించింది. దానివల్ల చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయాయి. దానికితోడు అకాల వర్షం కురిసింది మిగిలిన ఫైరు లన్నీ పూర్తిగా పాడైపోయాయి. పర్వతేశుడు కోయబడిన మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు 10, 11 చొప్పున పిలకలు వచ్చాయి, పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది.
ఆ భార్య భర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీ గురుడి వద్దకు వెళ్లి ఆయనను పూజించుకున్నారు. స్వామి! మీ దయ వలన మేము కోరినా దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. నెల గడిచేసరికి పంట పండి, కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి, ఆ కాపు ధాన్యం నూరి రాసిపోసి, ఆ భూమి ఆసామి వద్దకు పోయి' అయ్యా! చూశారా! స్వామి దయ వల్ల పైరు ఎంత బాగా పండిందో? మీకు కూడా మనం చేసుకున్న ఒప్పందం కంటే ఎక్కువ ఇస్తాను మీ బాగం మీరు తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తన ఒప్పందం కంటే ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత దాన్యం ఇచ్చాడు. అటుపైన బండ్ల మీద వేసి ఇంటికి చేర్చుకున్నాడు. నామధారక! శ్రీ గురుని మహత్యం ఎంతటిదో చూసావా? గురుభక్తి అభిష్టాలన్నింటిని ప్రసాదించగలదు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 49
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
భూమి మీద ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉండగా. ఈయన ఈ సంగమ క్షేత్రాన్ని తమ నివాసం గా ఎందుకు ఎంచుకున్నారు అనగా అప్పుడు యోగి ఇలా చెప్పసాగారు. “నాయనా! ఒక అశ్వినీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ పుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు శ్రీ గురుడు శిష్యులందరిని పిలిచి, “మనమీనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాం" అన్నారు. అందరూ దారి ఖర్చులు, కావలసినవి సమకూర్చుకుని వస్తామని, అనగా ఎట్టి సన్నాహాలు అవసరం లేదు. కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో రండి అని ఆదేశించారు . ఈ బీమా - అమరజా సంగమం, గంగా యమున సంగమం కంటే ఎక్కువ పవిత్రమైనది. స్వామి! ఈ నదికి “అమరజ” అని పేరు ఎలా వచ్చింది సెలవియ్యండి! అన్నాడు.
“పూర్వమొకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది, అందులో జలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. మహాదేవ! ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పదనట్లు ఉన్నది ”అని శంకరనీతో చెప్పుకున్నారు . ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాధించాడు, వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్లందరూ జీవించారు. ఆ పాత్రలో అమృతం కొద్దిగా భూమి మీద పడింది, అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది, అందుకే దీనికి “అమరజా ” అనే పేరు వచ్చింది.
పూర్వం భరద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి, పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో ఒళ్ళు మరిచి తిరుగుతుంటే అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునే వారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, “కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా, కాళ్ళీడ్చుకుంటూ వెళ్లడం ఎందుకు?, అన్నాడు. “అయితే నాకు చూపించగలవా”? అనినప్పుడు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, “వ్యోమకేశ! దీనిని కాశీగా చేసి , ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు! అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయ్యింది. కాశీలో ఉన్న దేవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులు ఇద్దరూ ఆశ్చర్యపడి అప్పుడు ఆయన మహా జ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు.
' స్వామి! అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి, “ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మం అవుతాయి.' అని చెబుతుండగా, పూర్వాశ్రమంలో తన సోదరి అయిన రత్న దేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీ గురుడు, “అమ్మాయి! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా? అన్నారు వెంటనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ! దయానిధి! ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్లినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి “నువ్వు ఎన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మలో అనుభవిస్తావు లేక ఈ జన్మలో పోగొట్టుకుంటావో చెప్పు! అన్నారు. ఆమె “ఇంకా మరొక జన్మ ఎందుకు ? నా పాపాలు ఇప్పుడే తొలగించి మరల జన్మ లేకుండా చేయి ” అని ప్రార్ధించింది. అలా అయితే నిత్యం పాపనాశ తీర్ధంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించి పోతుంది. ఈ కుష్టురోగం ఒక లెక్క? అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయం అయింది. అది నేను స్వయంగా చూశాను, ఆ క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం -50
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటితీర్థం చూపించి, “ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి, ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం, దానానికి కోటి రెట్లు ఫలితం ఉంటుంది” అని చెప్పారు. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్దత్ముడు , సర్వభూత సమ్ముడును... పూర్వజన్మ సంస్కారం వలన మన దేవతలను, పుణ్య క్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తుండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో, “రాజా! మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది, ఇప్పుడు మీరు చేసేది కలలోనైనా తలచి రానిది. అని రాజుని ఎప్పటికప్పుడు వారిస్తూనే ఉండేవాడు.
ఒకప్పుడు విధివశాన, దైవయోగం వల్లనో కానీ, ఆ మ్లేచ్చ రాజుకు తొడ మీద పుండు లేచింది, అది ఎన్ని చికిత్సలు చేయించిన తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతడికి నిద్ర ఆహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్ వి విప్రుని పిలిపించి, దానికి నివారణోపాయం కోరాడు. ఆ విప్రుడు,' రాజా! నీవు యవనుడవు - నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువల్ల ఏకాంతంలో చెబుతాను' అన్నాడు. అప్పుడా రాజు అతనితో కలిసి ఏకాంత స్థలానికి వెళ్ళాడు. రాజా! నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధుల రూపంలో బాధిస్తాయి, తీర్ధయాత్ర, దేవతారాధన , దానములు వలన కొన్ని పాపాలు , వ్యాధులు తొలగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన పాపాలు, వ్యాధులు కూడా నశిస్తాయి.
కనుక ఓ రాజా! నీవు ఎవరికి తెలియకుండా విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్ధానికి వెళ్ళు , అక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి, తన పుండు గురించి నివారణ కోసం ద్విజుడు చెప్పిన ఉపాయం చెప్పి నివారణోపాయం చెప్పమని కోరాడు. “స్వామి! నేను మ్లేచుడనని మీరు ఉపేక్షించ వద్దు, నేను యవనుడానైనా, మీ ధర్మాన్ని కూడా ఆదరించే వాడిని! నాకు దయతో సెలవియ్యండి, అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయం, వెనుక ఋషభ యోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన పతితుడైనా బ్రాహ్మణు డు జన్మాంతరంలో ఉదహరించబడిన నిదర్శనాన్ని వివరించారు. కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయిన నశించగలదు. కనుక నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నారు, ఆ సత్పురుషుని పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో తెలుపమని కోరగా, గంధర్వపురంలో ని శ్రీ గురుని గురించి తెలిపారు, వెంటనే రాజు గాణ్గాపురానికి బయలుదేరాడు.
సరిగా అదే సమయానికి శ్రీ గురుడు, ఇక్కడకు మ్లేచ్చ రాజు వస్తున్నాడు, కనుక మీరంతా ఇండ్లకు వెళ్లిపోండి, అతడి వల్ల ఆచార్య వంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. కనుక మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు,' మహాత్మా' మీరు సాక్షాత్తు దత్తాత్రేయ లే' . మీరు మాకు అండగా ఉండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలక జాలదు. కనుక మేము సన్నిధి విడిచి ఎక్కడికి ఫోన్ అవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదల్లేదు .
కొద్ది సమయానికి ఆ యవన రాజు గంధర్వ పురం చేరి , అచటి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు? స్వామి మాటలు స్మరించి భక్తులు కీడు శంకించిన అతనికేమీ చెప్పడంలేదు. “అయ్యలారా! నేను కూడా స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడు ను సంశయించక వారు ఎక్కడున్నారోచెప్పండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అనుష్టానానికి సంగమానికి సంగమానికి వెళ్లారని మధ్యాహ్నం వస్తారు అని భక్తులు చెప్పారు. పరివారం అంతటిని విడిచి, తానొక్కడే త్వరత్వరగా సంగమానికి ఈ స్వామిని దర్శించి దూరం గా నిలిచాడు.
శ్రీ గురుడు,' ఓరి సేవకుడా! ఇన్నాళ్లకు కనిపించావ్ ఏమి? అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే , రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితం అయింది, మాట పెగల్లేదు, కొంతసేపటికి తెప్పరిల్లి “మీరు శ్రీపాద స్వామియే” ఏమి సేవకుడనైన చాకలిని! స్వామి! ఈ దీనుడిని ఎందుకు ఉపయోగిస్తున్నారు ఏమి? మీ పాద సేవ విడిచి దూరంగా ఉండేలా చేశారే! రాజ వైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని ఇంత కాలం మరిచి గడిపాను ! ఇన్నాళ్లు మీ దర్శనమే లభించలేదు, చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా మీ పాదాలను గుర్తించ లేక పోయాను. ఇంతకాలం అజ్ఞానంలో పడి ఉన్నాను ఇకనైనా నన్ను వద్ద ధరించండి! అని చెప్పి నమస్కరించి కొన్నాడు. వెంటనే ఆ రాజు తనను భావిస్తున్న ప్రాణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి! ఏది రా నీ రణం చూపించు! అనగానే అడుగు తొడ వంక చూసుకుని, ఆ మటుమాయం అవ్వటం చూసి ఆశ్చర్య చకితుడై భక్తితో ఆయనను కు నమస్కరించాడు. అప్పుడు శ్రీ గురుడు” ఏమిరా, నీవు కోరుకున్న రాజ భోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు! అన్నారు. అప్పుడా రాజు మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమే లను. నాకు కొడుకులు, మనుమలు కూడా కలిగారు. నా మనసు ఇప్పుడు పూర్తిగా తృప్తి చెందింది కానీ భక్తవత్సలా'! మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలని కోరిక ఒక్కటే మిగిలింది. స్వామి, “ఓరి! సన్యాసుల మైన మేము పాపభూయిష్టమైన ఈ మ్లేచ్చ రాజ్యం లో అడుగు పెట్టకూడదు. మీ మతస్తులు కనుక మాకు అది తగదు అన్నారు. స్వామి! నేను మీ సేవకుడిని, ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించిన అదే కదా! కర్మ వసాన ఈ జాతిలో జన్మించాను. మీ రాకకు అవరోధ మైన గోవద నిషేధిస్తాను.” అని చెప్పి కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడి కున్నాడు.
స్వామి! ఆహా! మా మహత్యం వెళ్లడం వలన నీచులు ఇంకెందరు ఇక్కడికి వస్తారు. కనుక ఈ స్థానం విడిచి వెళ్లడమే కర్తవ్యం అనుకుని, మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీ గురుని అంగీకారం చెవిని పడగానే యవనడు ఉప్పొంగి, వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని నడవసాగాడు. రాజు అయిన నీవు బ్రాహ్మణ సన్యాసి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్నుదూషిస్తారు. రాజు “స్వామి! నేనింకా రాజును? అంతకంటే ముందు నీ సేవకుడనైన చాకలి నే కదా! కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడని అయ్యాను. శ్రీ గురుడు సంతోషించి, “మనం చాలా దూరం పోవాలి” నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. రాజు అందుకు అంగీకరించి గుర్రం ఎక్కగా శ్రీ గురుడు' నాయనా! నీవు మ్లేచుడిగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో వెలుగుతున్నావు సంతోషమే! కానీ, సన్యాసుల మైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తే త్రికాలనుష్టానం సక్రమంగా చేయడం వీలు పడదు. కనుక మేము ముందుగా వెళ్తాము , మీరంతా మెల్లిగా వచ్చి పాపనాశ తీర్ధంలో దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. అంతలో ఆయన కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పనస తీర్ధం చేరి అక్కడ యోగాసనంలో అనుష్టానం చేసుకోసాగారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడు నాగ నాధుడు స్వామి దర్శించాడు. ప్రార్థించి శిష్యసమేతంగా ఇంటికి తీసుకుపోయి పూజించి, అందరికీ బిగ్ సి ఇచ్చాడు. నాటి సాయంత్రం నాయనా! పాపనాశ తీర్ధానికి రమ్మని చెప్పారు , మేము అక్కడికి పోతాము, అంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడు వస్తే మీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గర వచ్చి, అక్కడ భద్రా సలంలోలో కూర్చున్నాడు.
ఆ యవనరాజు మహా వైభవంగా ను అలంకరించిన ఆ నగర వీధుల్లో స్వామివారి శిష్యు కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. నగర వాసులు లైన బ్రాహ్మణులు సంతోషించి, రాజుకు అడుగడుగునా హారతులు వింజామరలు వీస్తుండగా చూసిన ప్రవాసులు స్వామిని చూసి నా, ప్రవాసులు స్వామిని చూసి “ఎవరు భగవత్ అవతారమేగానీ మానవమాత్రులు కారు., ” లేకుంటే ఒక సన్యాసికి రాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు” ? అయినప్పటికీ ఈ దృశ్యం కలికాల వైపరీత్యమే! అనుకుని ఆశ్చర్యపోయా రు. చివరకు పల్లకి రాజ భవనం వద్ద దింపించి, అందం, కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకి తీసుకుని పోయి, స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టి రాజు తన తన ప్రాణులు, అంతఃపుర కాంతల తో పాద పూజ చేయించారు. అతడు చేసిన సపర్య లకు సంతోషించి శ్రీ గురుడు అందర్నీ దీవించి, ఓరి! నీకు ఇంకా ఏమైనా కోరవలసిన అది ఉంటే నిస్సంకోచంగా చెప్పు అన్నారు. ఆ రాజు నాకు ఇంకా నిరంతర గురు పాదసేవ తప్ప వేరే ఏమీ అక్కర్లేదు నిశ్చయంగా చెప్పాడు . అలా అయితే ఈ రాజ్యభారం నీ కుమారులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము. నీకు అక్కడ మరల మా దర్శనమవుతుంది, అని ఆదేశించారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి మీ మామ బీమా అమరజ చేరుకున్నారు .
గంధర్వ ప్రవాసులు అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి తీసుకుని ఎదురేగి, “స్వామి! మీరు ఇక్కడ నుంచి వెళ్లినప్పటి నుంచి ఊరంతా అచేతన మయిపోయింది. తిరిగి మీ రాక వలన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.” అని స్తుతించి పూజించారు.” అప్పుడు స్వామి” బిడ్డలారా! మేము ఎక్కడికో వెళ్లి పోతాము అని అనుకోవద్దు!! నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ము ముందు ముందు లోకమంతా కలియుగ దోషాలు అన్నిటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్లాలి అనుకుంటున్నాము.
ఆనాటి వరకు మానవా కారం తో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం, అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరచిన అప్పటికీ, ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమ! అందుకు నేనే సాక్షిని !. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనిపించని ఈ దత్తమూర్తి, ఇప్పుడు భక్తులపాలిట ఇక్కడ నిలిచారు'' భుక్తి ముక్తి లను ప్రసాదించడానికి ఈ భూమ్మీద మించినది ఏమున్నది.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 51
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామ ధరకు డు, “స్వామి! శ్రీ గురుడు వైడూర్య నగరం నుంచి బయలుదేరి వెళ్లి గౌతమీ పుష్కర యాత్ర పూర్తిచేసుకుని, ఏమి చేశారు సెలవియ్యండి అన్నాడు” అన్నాడు.శ్రీ గురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వర నామ సంవత్సరం బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. గంధర్వ పుర వాసులు శ్రీ గురు నీతో ఇలా అన్నారు. స్వామి! మీరు ఇప్పుడు శ్రీశైల యాత్ర కు వెళ్లవలసిన అవసరం ఏమున్నది , మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వ పురం భూలోక వైకుంఠ మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. మమ్మల్ని విడిచి పెట్టి పోవడం నీకు న్యాయమేనా? అన్నారు.
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి, ప్రేమగా ఇలా అన్నారు. “బిడ్డలారా! మాపై ఎంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పో గలమా? నిజానికి మేము ఎప్పుడు ఈ గంధర్వ పురంలోనే ఉంటాము. నిత్యం ఈ సంగమంలో స్నానం , నిత్యకృత్యములు, మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో బిక్ష చేసుకుంటూ ఈ మఠం లోని సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. లౌకిక లకు మాత్రమే శ్రీశైలం వెళ్లినట్లు, ఇక్కడ లేనట్లు కనిపిస్తుంది గానీ మా ప్రతిరూపాలుగా ప్రతిష్టస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికీ నిజం, ఎట్టి సందేహం లేదు. వెంటనే అయినా మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుని, నంది శర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. మా ఐదుగురు ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి, చేతులు జోడించి శ్రీ వారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ, అటు తర్వాత తిరిగి వెళ్లిపోయారు.
వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు, వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళినా శిష్యులు, యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి, వారికోసం ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీ గురుడు శిష్యుల మైన మా నలుగురితో శ్రీశైలం వద్ద నున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి పుష్పాసనం సిద్ధం చేయమనగా మేము త్వరత్వరగా పూలు సేకరించి, వాటిని అరటి ఆకులు పై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము . అప్పుడు శ్రీ గురుడు దానిని నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేమూ అలానే చేసాము. అప్పుడాయన, “మేము ఈ పూల నావలో ఈ పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జున్ నీతో ఐక్యం చెందుతాము. మీరందరూవెనక్కి తిరిగి పురం వెళ్లిపోండి , అని చెప్పారు. కానీ మేము నిద్ర పోయాము.
శిష్యులారా! మీరు ఇలా దిగులు పడకూడదు. మీరు గంధర్వ పురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం అవుతుంది. భక్తి లేని వారికి కనిపించక, భక్తులకు మాత్రమే దర్శనమిస్తూ గుత్తి రూపంలో ఉంటాము. శ్రీ గురుడు ఆ పూల నావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరిమాటగా ఇలా చెప్పారు.
“నాయనలారా! మీకు సర్వ సుఖాలు ప్రాప్తించుగాక! నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు, అందులోని సూత్రాలు పాటించే వారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారు ఇంట్లో నాలుగు పురుషార్థాలు, సిద్ధులు నిత్యనివాసం చేస్తాయి, జీవితాంతం అష్టఐశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము అనంత నిలయానికి వెళ్తున్నాము. మేము అచటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకు వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి, మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనదిగా భద్రపరచుకుని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావా ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. వారి దివ్యరూపం తేజస్సులతో మా హృదయాలలో ఇలా నిలిచిపోయింది.
ఇలా శ్రీ గురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పుష్ప నావలలో కొంత దూరం వెళ్లి, అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. అంతలోనే పుష్పాసనం గానీ, స్వామి గానీ కనిపించకపోయేసరికి “మేమందరం కన్నీరు కారుస్తూ శూన్యం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుంచి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్త వాళ్ళు మా వద్దకు వచ్చి,' అయ్యా! ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము. వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి, వారు కాషాయవస్త్రం, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, “ మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి, 4 పువ్వులు నదీజలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి. అవి వారికి తీసి ఇవ్వండి. మా పేరు నృసింహ సరస్వతి, మేము స్థూలరూపంలో కదలీవనం వెళుతున్నాం కానీ ఎప్పటికీ గాణ్గాపురం లోనే ఉంటాము. మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి” అని చెప్పారట. వాళ్లు ఆ విషయం చెబుతుండగా నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వచ్చాయి. వాటిని చూడగానే నదిలో పోయి నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పువ్వులను అందుకుని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము.
శ్రీ గురుడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు, మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా శ్రీగురుని గురించి మాట్లాడుతూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తన స్థానంలో కూర్చుని కనిపించారు! ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచే సరికి వారి రూపం అదృశ్యమయింది. అంతటితో అందరి సంశయాలన్ని మటుమాయమై, ఆ అవతారమూర్తి సామాన్య మానవులనుకోవడం ఎంతటి అపచారమో వారికి అర్థం అయింది. అందరూ నమస్కారం చేసి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
అప్పుడు నామదారకుడు , “స్వామి! ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములు ” ఎవరు? అని అడిగాడు. సిద్ధ యోగి, “ స్వామికి శిష్యులు ఎందరో ఉండేవారు . వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు, కానీ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. మనస్సును గురు పాదాలపై నిలుపుకుని ఈ “గురు చరిత్ర” కూర్చాను. దీని పారాయణ వలన సుఖం, పవిత్రత, శాంతి కలుగుతాయి, పాపాలు, రోగాలు నశిస్తాయి” అన్నారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!
అధ్యాయం - 52
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురు నీ లీలలు కోరి కోరి చెప్పించు కుంటున్న నామదారకుడు , సిద్ధ ముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తయినా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని కన్నుల నుండి సంతత ధారగా పుష్పాలు ఆనంద భాష్పాలు కారుతున్నాయి. అతని ముఖంలోని బావమంతా పూర్తిగా మారిపోయి, శరీరం కంపించి పోతున్నది. సమాధి స్థితిలోఉన్నాడని అని గ్రహించిన సిద్ధ ముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని “శిష్యోత్తమా ! నామ దార కా! లే నాయనా! నీవిప్పుడు దాన్ని దాటి పరమానందం లో నిమగ్నుడయ్యాడు”.
శ్రీ గురు లీలామృతం పానం చేసి సహజ సమాధిలో నిలిచిన నామ దారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుని ఇలా స్తుతించాడు. “స్వామి! అచింత్య లైన మిమ్మేలా ధ్యానించేది? సర్వగతమైన మేము ఎక్కడ నీ ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేలా? తీర్థ క్షేత్రాల కే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మములను దేనితో కడిగేది? విశ్వ కర్తవు, సర్వ కర్తవు అయినా నీకు ఆర్గ్యం సమర్పించేది ఎలా ? సప్త సముద్రాల కే కాక ఈ విశ్వం అంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను? మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే, మీకేమీ స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించ దగిన వస్త్రమేమున్నది? బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభం ఏమున్నది? సర్వ జీవుల తాపాన్ని హరించగల మీకు లేపనం ఏమి చేయగలదు? మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మేలా స్తుతించ లో నాకు తెలియడం లేదు. సర్వగతమైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడ ని నమస్కరించే ది? నా లోపల, వెలుపల నిండియున్న మీకు యచ్చటి కని ఉద్వాసన చెప్పేది? అంటున్నాడు.
అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని“నాయనా! నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధి లో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదేలా ? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీ గురుని సంకల్పం. ఆయన అభిష్టం నెరవేర్చడమే మనందరి కర్తవ్యం. నీవిలా కూర్చుండి పోతే అదెలా సాధ్యం? అది చెప్పి చివరకు అతని మేల్కొలిపారు. నామదారకుడు కనులు తెరిచి సిద్ధముని ని చూసి “ స్వామి! దయామయా! విశ్వ దారా! నా పాలిట శ్రీ గురుడు మీరే! అని ఆయనకు నమస్కరించాడు.' నాయనా! ఈ “గురు చరిత్ర” నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి, రంగవల్లులతో అలంకరించి, అక్కడ కూర్చొని మొదట కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింప చేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు, పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తరదిక్కుగానో లేక తూర్పు దిక్కుగానో కూర్చుని మొదటి రోజు 9వ అధ్యాయం వరకు, రెండవ రోజు పదవ అధ్యాయం నుండి 21 వ అధ్యాయం చివరి వరకు, మూడవరోజు 29 వ అధ్యాయం చివర వరకు, నాల్గవ రోజు 35 వ అధ్యాయం చివరి వరకు, ఐదవ రోజు 38 వ అధ్యాయం చివర వరకు, ఆరవరోజు 43వ అధ్యాయం చివరివరకు, చివరి రోజు గ్రంథంతం వరకు విద్యక్తంగా నీవు గురు చరిత్ర పారాయణ చేయాలి. తరువాత నైవేద్యం పెట్టి, అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది . ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతున్ని సేవించుకో గలుగుతారు.
బుధవారం పారాయణ సమాప్తం!
శ్రీ దత్తాయ గురవే నమః
శ్రీ శ్రీపాద శ్రీవల్లభయ నమః శ్రీ నృసింహ సరస్వతె నమః
Leave a comment