ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | |
శ్లోకం వివరణ :
శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.
శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.
Leave a comment