ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | |
శ్లోకం వివరణ :
ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది
Leave a comment