అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్వా లాక్షమాలాది ధరా రుధిర సంస్థితా ||
శ్లోకం వివరణ :
అనాహతాబ్జ నిలయా - అనాహత పద్మములో వసించునది.
శ్యామభా - శ్యామల వర్ణములో వెలుగొందునది.
వదనద్వయా - రెండు వదనములు కలది.
దంష్ట్రోజ్వలా - కోరలతో ప్రకాశించునది.
అక్ష్మమాలాదిధరా - అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
రుధిర సంస్థితా - రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.
Leave a comment