అదృశ్యా దృశ్యరహితా విజ్నాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ||
శ్లోకం వివరణ :
అదృశ్యా - చూడబడనిది.
దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
యోగినీ - యోగముతో కూడి ఉంది.
యోగదా - యోగమును ఇచ్చునది.
యోగ్యా - యోగ్యమైనది.
యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
యుగంధరా - జంటను ధరించునది.
Leave a comment