చిచ్చక్తి శ్చేతనారూపా జడశక్తి జడశక్తి ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిధేవితా ||
శ్లోకం వివరణ :
చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.
Leave a comment