పాయసాన్నా ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ |
అమృతాడి మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ ||
శ్లోకం వివరణ :
పాయసాన్న ప్రియా - పాయసాన్నములో ప్రీతి గలది.
త్వక్ స్థా - చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
పశులోక భయంకరీ - పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
అమృతాది మహాశక్తి సంవృతా - అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
ఢాకినీశ్వరీ - ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.
Leave a comment