As per popular belief, the daughters of Prajapati Daksha married the Devas. However, the younger out of the daughters named Sati decided to marry Lord Shiva even though she did not have her father’s consent. The relationship of Daksha and his son-in-law Lord Shiva were always strained. When Prajapati Daksha performed a Yajna, he invited all the gods and goddesses but did not invite his son-in-law Lord Shiva to be a part of the proceedings.
When she got the knowledge about the Yajna, Sati decided to go to her father’s house, even though she was previously prohibited from doing this. She was scolded here, and she decided to immolate herself in the fire. When Shiva got news of this, he got very angry and ordered Veerbhadra to stop the Yajna. Veerbhadra did as instructed and, along with the help of Kaali and other Gods, ended the Yajna and killed Prajapati Daksha. Lord Shiva performed penance on himself at the hill, which we now know as Maheshwara Sikhara, to get peace of mind.
Thereafter, to make sure that Lord Shiva is back where he belonged, the Kailash. Lord Vishnu, and Lord Brahma did penance on 2 other hills. The wish was granted by Lord Shiva. Following this, Lord Vishnu suggested performing Abhishekam, and to do this, Lord Shiva pierced the mountain with the help of his Trishul and gave rise to a pool. This became holy Tirtha, and Lord Vishnu took a holy bath in this water. It is now believed that if one takes a bath in this holy water, one is free from all his sins.
There is another legend that people have been known to believe. Anandavalli was a devotee of Lord Shiva who used to perform Abhishekam on the Shiva Linga on the hill. It is believed that at a time when it got difficult for Anandavalli to walk long distances, she prayed to Lord Shiva to reside at her home. Lord Shiva accepted her prayers upon one condition, that if she turns, Shiva will manifest at that location. When Shiva set foot on the Brahma Sikhara, he made a huge sound, which got Anandavalli to worry and she turned. Lord Shiva manifested right there and Anandavalli also turned into a statue.
1. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
2. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమిందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు.
3. భక్తులైన సాలంకులు, అతని ముగ్గురు తమ్ముళ్లు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగస్వరూపులు కావటం ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధానమవడం ఈ క్షేత్ర వైశిష్ట్యం.
4. బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా..: దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా, మేధాదక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు స్థల పురాణం.
5. దేవతలకు, మహర్షులకు, భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ.
6. గర్భాలయ దక్షిణద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప, శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి.
7. క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం, ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి.
8. ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి. దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.
విష్ణు శిఖరం మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్ రోడ్డు నిర్మాణం చేయించారు. ఘాట్ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు.
బ్రహ్మ శిఖరం దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు కోటప్పకొండలో ధ్యానశంకరునిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం. ఆయన వద్ద బ్రహ్మ, విష్ణువులు అనేక మంది దేవతలకు ఇక్కడ బ్రహ్మోపదేశం చేశారు. అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది.
కొండపైకి మార్గాలు
1. దివ్య మహిమ కలిగిన త్రికూటా చలంపైకి చేరడానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి.
2. పాపవినాశన స్వామి దేవస్థానం పడమరగా మెట్ల మార్గం ఒకటి, వాహనాలతో పైకి వెళ్లడానికి వీలుగా ఘాట్ రోడ్డు మార్గం మరోటి.
ఘాట్ రోడ్డులో పర్యాటకం
1. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు.
2. భారీస్థాయి ఆక్వేరియం ఉంది.నెమళ్లు, కొంగలు, దుప్పులు, జింకలు ఇలా అనేక వన్యప్రాణులు పర్యాటక క్షేత్రంలో ఉన్నాయి.
3. టాయ్‌ట్రైన్ ఇది కొండ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల దూరం తిరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం నిండా రంగుల రాట్నాలు, రోప్‌వే ఆకర్షిస్తుంటాయి. కాళింది మడుగులో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేకం.
మూడు కొండలపై వెలసిన ముక్కంటి :
1. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియో గంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుం డగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు.
2. అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజ స్తంభం కూడా ఉండదు.
3. ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కన్పిస్తుంది. అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది.
4. ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అని పిలుస్తారు. బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి.
5. జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు.
6. ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వర లింగం.
జంగం దేవర రూపంలో..
1. కోటప్పకొండ వద్ద ఉన్న కొండకావూరులోని గొల్లభామ ఆనందవల్లి త్రికోటేశ్వరునికి పూజలు చేయగా ఈశ్వరుడు జంగం దేవ రరూపంలో ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెపుతోంది.
2. ఆనందవల్లి పాప వినాచన దూన వద్దకు వెళ్లి తీర్ధం రుద్ర శిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాధిపూజలు చేసింది.
3. ఆమెను పరీక్షించేం దుకు ఎన్ని విధాలా కష్ట పెడుతున్నప్పటికీ పూజలు మాననం దునే ఆనందవల్లి ఇంటికి వస్తాను, అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమె వెనుకనే బయలుదేరాడు. ఎలాంటి పరిస్థితు ల్లోను వెను దిరిగి చూడవద్దని చెప్పగా ప్రళయ ధ్వనులకు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద వెను దిరిగి చూసింది.
4. జంగమయ్య అక్కడే శిలగా మారాడు. ఆ చోటనే కోటేశ్వరాలయం నిర్మించ బడింది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది.
5. రుద్రశిఖరంపై స్వామి వారు తపమాచరించారు. ఇక్కడే పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భంగా కర్పూర జ్యోతి దర్శనం జరుగుతుంది. విష్ణుశిఖరంలో దక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలు, రుషులు పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో పాప విమోచనేశ్వర స్వామి ఆలయం ఉంది.
6. ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి దేవాల యం ఉంది. ఘాట్ రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగు తోంది.
స్థలపురాణం
పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు.లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది.ఈ గుడి ఉన్న శిఖరంను రుద్ర శిఖరంఅనబడుచుంది.విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు వున్నాయి. రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగంను ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిమంద, ఎల్లమంద అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు.
ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు, భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి (గొల్లభామ) అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి, ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజూ రుద్ర కొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ దేవర లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశకలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు.ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి, పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్ధానం చేసి, ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్ర కొండ నుండి, ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తరువాత, ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం,ఆమెకు ఇచ్చిన వాగ్ధానాన్ని వీడి, జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ది చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి, తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు.ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది.