ఆదివారం పారాయణ ప్రారంభం
అధ్యాయం - 30
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడు, స్వామి! నాకెన్నో శ్రీ గురుని అపురూపమైన అంశాలు తెలుపుతారు. ఇట్టి నీ బుణం ఎన్నటికైనా తీర్చకోగలను, అటు తర్వాత! ఏమి జరిగిందో తెలుపమని అని ప్రార్ధించాడు!
“నామధారకా! శ్రీ గురు లీలల అన్ని చెప్పడం ఎవరి తరం కాదు , నాకు చేతనైనంత వరకు చెబుతాను, విను. శ్రీ గురుడు చూడటానికి మానవుని వల్లే కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమ బట్టి త్రిమూర్తులువతారమన్న కీర్తనలు అన్ని దిక్కుల వ్యాపించినది, భక్తులు నీ ఎంతో దూర ప్రాంతాల్లో నుంచి వచ్చి, దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారికి సంతానం, రోగులకు ఆరోగ్యం. అని పొందుతారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతం చెబుతాను విను అన్నారు.
మహురపురం లో గోడేనాధుడు (ఉరఫ్ గోపీనాథ్ నాయుడు) సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుని పేరు పెట్టుకున్నారు. అల్లరి ముద్దుగా పెరిగి ఐదవ ఏటా ఉపనయనం, పన్నెండవ సంవత్సరంలో రూపవతి,సుగుణాలరాసి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ, సౌందర్యంలోనూ సమానులై రతి మన్మదులవలె సుఖిస్తూ, ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్త జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా పిల్లవాడికి 16, సంవత్సరం లోనే తీవ్రంగా జబ్బు చేసింది. అది మూడు సంవత్సరాల్లోనే క్షయ వ్యాధిగా పరిణమించింది . భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అలంకారమే చేసుకొనగా, పాత చీర ధరించేది. జుట్టుడువ్వుకొని పోయే సరికి జుట్టు జడల కట్టింది. అత్తామామలు ఎంత వారించినా వినకుండా. భర్త ప్రత్యక్ష దైవమని సేవిస్తూ ఉండేది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి, కానీ దత్తుని పరిస్థితి కొంచెం కూడా మెరుగు కాలేదు సరిగా అందరూ ఆశలు వదులుకున్నారు.
దత్తుడు తల్లిదండ్రుల దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి “స్వామి! దత్తాత్రేయ! నిన్ను సేవించి కొడుకును పొంది వెనకటి దుఃఖం మరిచాము, ఇప్పుడు ఇతను దక్కకుంటే ఏమి చూచుకొని బతకాలి? దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని “ఊరడిస్తూ” మనకు ఎంత ఋణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తముంటుంది కానీ , అంతకుమించి ఆశ పెట్టుకుంటే దక్కదని? కనుక నా కోసం దుఃక్కించవద్దు అని చెప్పి, తన తల్లితో నీవు నాకొక్క గడియ సేపు పాలిచ్చిన రుణమైన తీర్చుకోలేక పోయాను,నేను కష్టాలే తెచ్చి పెట్టాను, అంటుండేవాడు.
దత్తుడు తన భార్యతో “ప్రేయసి , నాకు ఇంకా కాలం తీరుపోతున్నది, నీవు నాకు చేసిన సేవకు, నాకోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువుని కాబోలు , నేను ఇలా బాధిస్తున్నాను! ఇకముందు నీకు భయపడకు నా తల్లిదండ్రులు నిన్ను కూతురిల్లా చూసుకుంటారు, నీకు ఇష్టం లేకపోతే నీవు ఇంటికి వెళ్ళవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు లేదు. నన్ను కట్టుకున్న క్షణంలోనే ని సౌభాగ్యం మంటగలిసింది, అని బాధపడుతుండగా , సావిత్రి ఆ మాటలు భరించలేక స్వామి నేను మీ అర్ధ భాగాన్ని మీరు లేకుంటే నా శరీరం లో ప్రాణం ఉండదు , మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే వుంటాను , అంటుండేది.మీకు ఏ భయంలేదు , అందరం కలిసి భగవంతుని ప్రార్దిధ్ధాము అని తల్లితండ్రులకు ధైర్యమ్ చెబుతుండేది సావిత్రి ఒకసారి గాలిమార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలి అనుకున్నది. అప్పుడొక గ్రామస్తుడు మీరు దత్త భక్తులు, కదా! దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి , మంచి జరుగుతుంది అని చెప్పారు.
సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో పడక ఏర్పాటు చేసి, మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడ పల్లకి దించి శ్రీ గురుని గురించి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేయడం వల్ల రోగ బాధ తీవ్రమైన అవసాన దశ వచ్చిందా అన్నట్లు గిలగిలా లాడుతున్నాడు. గంధర్వపురంలో పల్లకి ఒక చోట దించి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీ గురుడు ఎక్కడ ఉంటారని విచారించగా అనుష్టానానికి సంగమం వదిలి వెళ్లారు అని చెప్పారు. అతనిని అక్కడికి తీసుకు వెళ్దామని పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం! ఆమె గుండెలు బాదుకుంటూ, బాధ భరించలేక ఆమె కత్తితో పొడుచుకోపోతే అక్కడి వారందరూ వచ్చి అడ్డు వచ్చి ఆపారు. “ఓ గురు మూర్తి! రక్షకుడు అని తలచి గంపెడుఆశతో ఇంతదూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను, కానీ దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడినట్లు, నీడను చేరబోయి న వాణి మీద చెట్టు విరిగి పడినట్లు, ఎక్కడికే మంచినీటికి పోయిన వాడు ముసలి నోట పడ్డట్టు, నా భర్తను బతికించుకోవాలని వచ్చి నేను అతనిని పోగొట్టుకున్నాను. ,తల్లిదండ్రులకు దూరంగా దేశం గాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేస్తాను. చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహం అయ్యాక భవాని పూజలు, అఖండ సౌభాగ్యం వ్రతం అని ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమయింది? నా మాంగల్యం రక్షణ కోసం నా నగలు అన్ని వదులుకున్నాను, అందుకే చివరికి నాకే పసుపుతాడు అయిన దక్కలేదు? అని దుఃఖిస్తూ శవం మీద పడి లేకుండా నేను ఎలా బతకాలని? నేను కూడా మీతో వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది.
అసలు నువ్వు ఎవరు? ఎక్కడనుండి వచ్చావు చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండి వచ్చి కలుసుకున్న కట్టెల లాగా భూమిపై జీవులు లో కలుసుకుంటారు . కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పుట్టినవాడ, చనిపోయినవాడు వాటిలో ఎక్కడ ఉన్నారు? అతడు ఎవరు?మాయావశులై ,అలాంటి జీవులను “నావి నా వాళ్లు” అనుకోవడం భ్రాంతి. ఈ శరీరమే నీ భర్త అనుకొని , “నేను, నాది అనుకోవడం సరియేన? ఇంతకూ నీవు శోకించేది, ఇటువంటి తోలు బొమ్మలు కోసమే కదా? ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని ఈ జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో! అని పలు విధాలుగా హితబోధ చేశారు. “ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని , ఆ ముని పాదాలకు నమస్కరించి ,స్వామి! నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి, మీరు చెప్పినట్లు చేస్తాను. దయ సాగరా ! నాకు నీవే తల్లివి, తండ్రివి నేను సంసారం నుంచి తరించే మార్గం ఉపదేశించండి” అని వేడుకున్నది .
అధ్యాయం - 31
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
ఆ యోగీశ్వరుడు సావిత్రి తో ఇలా చెప్పాడు, సాధ్వి! స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను. పూర్వం కాశీలో ఒక అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవాడు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె ప్రాతివత్యనికి మెచ్చి వింద్యాచలుడు వారిని గొడుగు వల్లే నిలిచి ఉండే వాడు. ఒకరోజు త్రిలోక సంచారియైన నారదుడు వింధ్యునితో “ఓ పర్వత రాజా ! నీకు సాటి అయినా పర్వతఇంకోటిలేదు. అయితే నేమి నీవు మేరునితో మాత్రం సమానం కాలేవు” అన్నాడు. వింధ్యుడు రోషంతో మీరు పర్వతాన్ని మించిపోవాలని పెరగ సాగాడు , ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతం చీకటి మయమైంది సూర్య దర్శన లేమి వలన ఆ ప్రాంతంలో ప్రజలు నిత్యకార్మాచరణ తారుమారు అయింది. అప్పుడే బ్రహ్మకు ఈ విషయం విన్నవించగా, బ్రహ్మదేవుడు అగస్యమహర్షి ని దక్షిణ దేశానికి వెళ్లేలా చేయమని ఉపాయం చెప్పాడు. అప్పుడే ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ బుషీ దంపతులును దర్శించి పూజించారు. అప్పుడుమహా పతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆ మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను బృహస్పతి ఇలా చెప్పాడు.
“స్త్రీలు ఎల్లపుడు తమ పతిని శ్రీహరి గా భావించి సేవ చేయాలి, విసుగు అన్నది లేకుండా అతిథులను ఆదరించాలి, భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంతవరకు పొరుగు ఇళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తలవంచుకుని వెళ్లాలి. దుస్సిలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు, ఉత్సవాలకి, యాత్రలకి ఒంటరిగా వెళ్లకూడదు. భర్త లేనప్పుడు స్త్రీ అలంకరించుకో కూడదు, బయటనుంచి వచ్చిన భర్తకు సంతోషంగా ఎదురేగి కాళ్లు కడిగి, తుడిచి, విసిన కర్రతో వీచి సేద తీర్చాలి. భర్తకు హిత కరమైన భోజనం పెట్టి, అతని ఉచ్చిష్టనాన్నే ప్రసాదంగా భుజించాలి. భర్త నిద్రించాక నిద్రపోయి , అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు విచారంగా నూ, భర్త విచారంగా ఉన్నప్పుడు సంతోషంగా ను ఉండకూడదు. భర్త కోపించిన అప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ,ఉపవాసాలు చేయకూడదు. భర్త ఆయుషా భివృద్ధికి పసుపు, కుంకుమ, మంగళసూత్రం భక్తితో ధరించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైన అతనిని పరమేశ్వరుడు గా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు.
ఇలాచేయక యదేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యం అంతా నశించింది నరకానికి పోతుంది. పతివ్రతల పాద ధూళితో గాని వారి పాపం నశించదు. ప్రతివతలు వల్లనే వంశమంతా ఉద్దరించే పడుతుంది.7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమె సాంగత్యంతోనే అన్ని పురుషార్దలు సిద్ధిస్తాయి.అటువంటి భార్య లేకుంటే యజ్ఞంమొదలైన ధర్మాలు సఫలం కావు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు . ఆమె లేని భవనం అయిన అడవి తో సమానం. ఆమె సహచర్యం వల్ల ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతలను దర్శించడం వల్ల కలుగుతుంది” అన్నారు.
అధ్యాయం - 32
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు. “దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు. భర్తతో సహగమనం చేయటం ఉత్తమం, కానీ భర్త దూరదేశంలో ఉన్న, ఆమె గర్భవతి అయిన లేక ఆమెకు పాలు తాగి బిడ్డ ఉన్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు, అటువంటి స్త్రీ యావజ్జివితము విధవా ధర్మం పాటించిన కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విదవా ధర్మాలు ఎంత పుణ్య ప్రధానమైనవే. ఆమె జట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం, లేకుంటే జట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. ఆమె ప్రతినిత్యం తలస్నానం, ఒక పూట భోజనం చేస్తూ ఉండాలి లేకుంటే చంద్రాయనవ్రతం ఆచరించడం శ్రేయస్కరం. మూడు రోజులకో, వారానికో, పక్షానికో ఉపవాసం ఉండాలి. ముసలితనం, రోగం వల్ల ఇలా చేయకపోతే రెండో పూట, పాలు పండ్లు యావజ్జివితం సేవించవచ్చు. మంచం మీద నిదురించిన పతితో కలిసి నరకానికి పోతుంది. తనకున్న పరుపు మంచం పేదలకు దానం ఇవ్వాలి, రంగు చీరలు ధరించక, తెల్లని వస్త్రం మాత్రమే ధరించాలి.
వైశాఖ మాసంలో జలదానం, కార్తీకమాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి, నువ్వుల దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవిలో చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె, నేతితో నింపిన కంచు పాత్ర బాగా పాలిచ్చే కపిల గోవు, యధా శక్తి బంగారం, దీప మాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
వేద విధులకు పాద్యమిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పళ్ళు దానమిచ్చి తన భర్త పేరిట కి వారికి ఆపోసన ఇవ్వాలి. ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతి సహగమనంతో సమానం అవుతుంది.
బృహస్పతి చెప్పిన ధర్మాలతో స్త్రీలకు రెండు మార్గాలు ఉన్నాయి. ధైర్యం గలవారు సహసహానం చేయవచ్చు. కనుక అమ్మాయి! నీవు శ్లోకం వీడికి, నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు ఆమె యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరు ఎవరు లేరు, ఇంత దూర ప్రాంతంలో ఒంటరి అయినప్పుడు మీరు తారసిల్లారు , యుక్త వయసులో ఉన్నప్పుడే నాకు వైద్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడకవంటిది యవ్వనం, సౌందర్యం గల వారికి లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనం మంచిది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి” అని నమస్కరించింది. ఆయన త్వరలో నీ భర్తను కలుస్తాం అని ఆశీర్వదించెను, నీవు ఎంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగరానిది జరిగింది, నీవు ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని దర్శించి, తర్వాత కర్తవ్యం అని చెప్పి, యోగీశ్వరుడు శవం తల మీద బస్మముంచి, ఆమెకు 4 రుద్రాక్ష ఇచ్చి, వీటిలో 2 అతని మెడలో, చెవుల కొకటి కట్టి, రుద్ర సూక్తాలతో గురు పాదాలు అభిషేకం ఇచ్చిన జలం తెచ్చి ,ఈ శవం మీదా చెల్లి తరవాత సహగమనం చెయ్యవచ్చు. అని చెప్పి వెళ్ళిపోయారు.
అప్పుడు ఆమె పసుపు, కుంకుమ అలంకరించుకుని, అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్లింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మి లా అలంకరించుకుని సహగమనానికి వెళుతుందని తెలిసి ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్లి “ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించ రాధా?అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోయింది.
అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి వచ్చిన వారికి వాయనాలు,సద్బ్రాహామానులకి దండిగా దక్షిణలు సమర్పించి నమస్కరించి, “తల్లులారా! విప్రోత్తములారా! మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుని దర్శనం కోసం వచ్చాను, కనుక వారిని దర్శించి వచ్చి సహనం చేయడం ధర్మమని తోస్తున్నది, నేను వెళ్లి రానా? అన్నది. అప్పుడు వారు “అమ్మ!, సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో!” అన్నారు.
ఆమె శ్రీగురుని దర్శనానికి మెల్లగా నడుస్తూ మనసులో “స్వామి! మీరు సర్వేస్వరులు. మీరు భక్తుల పాలిట కల్పవృక్షం అని విని, నా భర్తను బతికించుకొని సంతాన పొందాలని ఇంత దూరం నడిచి నీ వద్దకు వచ్చాను. నేను ఏమన్నా పాపం చేశానో కానీ, అందరికీ అబ్బిన సౌభాగ్యం, సంతానం మాత్రం నాకు కరువవడమే కాక ఈ దుస్థితి కలిగింది. ఇంత ఆశపెట్టుకొని వచ్చినందుకు అన్ని బాగా జరిగాయి, మిమ్మల్నిఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది, ఈ కీర్తి పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతాను.
ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్లి దేదీప్యమానమైన, శ్రీ గురుని మూర్తి కనిపించగానే అపారమైన భక్తితో ఆయనకు సాష్టంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీ గురుడు ఆమెనా “నిత్య సౌభాగ్యవతి బావ! అని ఆశీర్వదించారు!! అచ్చటి వాళ్ళు అందరూ తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకరు సాహసించి “ స్వామి ! ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించారు. అతని శవం కూడా స్మశానం లో ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది? అన్నాడు. అది విని ఏమి తెలియనట్టు “అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే, ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము చూస్తాం! అగ్ని సంస్కారం నిలిపివేసి, ఇక్కడికి తీసుకు రండి, మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు" అన్నారు. అందరూ ఆశ్చర్యపడి శవాన్ని అందరు అక్కడికి తీసుకు వచ్చారు. వెంటనే శ్రీ గురుడు శవానికి కట్లు విప్పించి ఆయన పాదోదకం ఆ శవంపైచల్లి తమ అమృతదృష్టితో శవం కేసి చూశారు. అందరూ చూస్తూ ఉండగానే శవంలో కదలిక వచ్చి , మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు! అతడు సావిత్రితో, ప్రేయసి! నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పడితే లేపనన్న లేపలేదు ఏంటి అన్నాడు.
సావిత్రి ఆనందభాష్పాలు రాలుస్తూ జరిగింది చెప్పి “మన పాలిట పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీ గురు డే”! అని చెప్పి, ఆ దంపతులు ఆయనకు సాష్టంగం పడి ఆయన పాదాలు అభిషేకించారు.చనిపోయిన దత్తునికి ప్రాణం పోసి సావిత్రికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించిన శ్రీ గురుని కీర్తిని అచ్చటి వారు అందరు ఇలా జయ జయ ద్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు.
కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామిముందుకు వచ్చి' నాకు ఒక సందేహం ఉన్నది, నొసటి వ్రాత మార్చడంఎవరి తరం కాదని వేద శాస్త్రాలు, చెబుతున్నాయి. బ్రహ్మ వ్రాత నిజమే అయితే చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికారు “అన్నాడు. స్వామి నవ్వి బ్రహ్మ అనుమతి తోనే మరు జన్మ లోనే కొంత జీవిత కాలాన్ని ఈ జన్న్మకు మార్చాము . అంతగానే, విధివ్రత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్యదృష్టి ప్రసాదించి ఆ సత్యం దర్శింప చేస్తారు. సూర్యాస్తమయానికి శ్రీగురుడు ఆ దంపతులను వెంటనే తీసుకొని సంగమానికి చేరుకున్నారు..,
అధ్యాయం - 33
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడి తో సిద్ధుడు ఇంకా ఎలా చెప్పారు, “దత్తుడు, సావిత్రి ఆరోజు అక్కడ నిద్ర చేసి , ఈరోజు తెల్లవారు జామున స్నానం చేసి శ్రీగురుని దర్శించారు. అప్పుడే సావిత్రి “స్వామి! నేను దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోబోయినపుడు ఒక యోగీశ్వరుడు వచ్చి ఈ ధర్మం ఉపదేశించి, రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయనవల్లే మాకంతటి మహా భాగ్యం కలిగింది. మరల వారి దర్శనం ఎక్కడ లభిస్తుంది అనగా శ్రీ గురుడు నవ్వులు చిందిస్తూ “అమ్మాయి! నీ పతి భక్తుని చూడదల చి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చి మీకు మహిమ గల రుద్రాక్షలు ప్రసాదించాను. వాటివల్ల నీ కిట్టి అభయం లభించింది. మీరు నాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాను.
పూర్వం కాశ్మీర దేశంలో భద్ర సేనుడు అనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సద్గురుడికి కొడుకు ఉండేవాడు. వారంతో ప్రేమతో మసులు కుంటూ, ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసిన వారు కాదు, ఒకనాడు పరాశరమహర్షి రాగా రాజు ఆయనను పూజించి, వారిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమి చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని “రాజా! పూర్వజన్మలో వీరు మహానంద అనే వైశ్య ఇంటిలో కోతిగా, కోడిగా పుట్టారు. ఆమె గుణవంతురాలు, స్వేచ్చాచారినిగా జీవించక పెద్దల వలన , సకల ధర్మాలు తెలుసుకుని దానధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. తమ నిత్యం అలంకరించుకుని మంటపంలో నాట్యం చేసేది, ఆమె వినోదం కోసం కోతికి, కోడికి రుద్రాక్షలతో అలంకరించేది.
ఒకనాడు మహాధనికుడు, శివ వ్రత దీక్షితుడు అయినా ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆయన విభూతి, రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్న లింగము ఉన్నాయి. దానిని చూసి ఆశ పడగా, వైశ్యుడు ఆ వేశ్యాతనను సంతోషపెట్ట కలిగితే ఆ లింగం ఇస్తానన్నారు. ఆవేశం అందుకు ఆమె సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మమును అనుసరించి అతనిని చేయించ గలను అని చెప్పి ఆ లింగం పై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి , “ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరి పోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజించింది.
ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురానికి వెళ్లే సరికి, అదేమి చిత్రమో గాని, నాట్య మండపం క్షణంలో బస్మంమై , ఆ కోడి, కోతి కూడా బూడిద అయిపోయింది. తెల్లవారిక అది తెలిసిన వైశ్యుడు “అయ్యే ! నా ప్రాణం లింగమే పోయింది! నేను ఇంకా బతకను అని ఏడుస్తూ, ఎంత వెతికిన లింగమే దొరకలేదు, అప్పుడు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వైశ్య కూడా “నాధా ! అని కేకలు వేస్తూ సహగమనం చేయడానికి సిద్ధమయింది. ఆమె బంధువులు వారించి, వైశ్య వైనా నీకు ఇదేమి వెర్రి? అనగా సూర్య చంద్రులు సాక్షిగా ప్రాతివత్యం అవలంబిస్తానని ప్రమాణం చేశాను, నాకు ఇదే ధర్మం, నేను సహగమనం చేయకుంటే, నాతోపాటు నా 21 తరాలు వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తాను అని దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి , నీ ధర్మ గుణాన్ని, ప్రాతివత్య గుణాన్ని పరీక్షించడానికి నేను ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకు ఇచ్చినది నా ఆత్మ లింగం, ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి పరీక్షించాను. నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకో! అన్నారు' స్వామి, నాకి ముల్లోకాలలో ఎట్టి భోగం అక్కర్లేదు. శాశ్వతమైన శివసామ్రాజ్యం ప్రసాదించు ” అని ప్రార్థించగా, శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మల సంస్కారం వల్ల శివభక్తులై రుద్రాక్షలు , భస్మం ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలవి కానిది”, కనుక సాద్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది ” అని శ్రీ గురు చెప్పారు.
అధ్యాయం - 34
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, “స్వామి! ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజు పుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు ఇంత శ్రద్దా భక్తితో ధరిస్తున్నందుకు ఎంత ఫలితం ఉండబోతుంది? అనగా మహర్షి ఆలోచించి నిట్టూర్చి” రాజా! వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది, ఈ రోజు నుండి ఎనిమిదవ రోజు వారు మరణించి వలసిన ఉన్నది అన్నారు. అది విని ఎంతగానే దుఃఖిస్తూ, దానికి నివారణోపాయాలు చెప్పమనగా ఆ మహర్షి ఇలా చెప్పారు. భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి, అతనికి ప్రసాదించిన వేదంయొక్క సారమే రుద్ర మంత్రం.
ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఏ పాపాలు ప్రసాదించే లేవు. పూర్వం రుద్ర మంత్రం వలన పాపులు కూడా పరిశుద్ధులు అవుతున్నారని యమధర్మరాజు బ్రాహ్మకి వినిపించుకొన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మ, “యమధర్మరాజా! మధాందులు , తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్ర జపం జపించే వారి దగ్గరికి వెళ్ళనే కూడదు. అల్పాయువు గల వారు దీని వలన దీర్ఘాయువు పొందగలరు. కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి , 7 రోజులు నిరంతరం రుద్రాభిషేకం చేయించు . అప్పుడు వారు దీర్ఘాయువు సరిసంపదలతో జీవించగలరు అని చెప్పారు.
ఆ రాజు వందమంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్ర మంత్ర గానంలో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యం ఆ అభిషేక జలంతోనే రాజు కుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డల ఇద్దరు సృహతప్పిపడిపోయారు. అప్పుడే పరాశర మహర్షి రుద్ర మంత్రజలం వారి మీద చల్లగానే వారు లేచి కూర్చున్నాడు. బిడ్డల ప్రాణాలు అర్పించడానికి వచ్చినాయి యమదూతలు శివదూతలు వచ్చి తరిమివేసి, ఆ రాజకుమారుని బతికించారు అని చెప్పారు. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యానమంటే అంత ప్రీతి. కనుక నామధారకా, నీవు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీ గురుని పూజించు! అని సిద్ధుడు చెప్పాడు.
అధ్యాయం - 35
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
సిద్ధ యోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. “సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి "స్వామి! నిరంతరం మీ పాదాలను స్మరించేoదుకు సాధనంగా నాకొక మంత్రముపదేశించి అనుగ్రహించండి. అని వేడుకొన్నది. శ్రీ గురుడు, “అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడంకుంటే మోక్షానికి మరొక మార్గం లేదు. స్త్రీలకు మంతోప్రదేశం చేయకూడదు.
పూర్వం శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందరిని మృతసంజీవనీ మంత్రంతో బతికించి దేవాసుర యుద్ధానికి పంపుతున్నాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశంఇస్తే నిర్వీర్యమవుతుందని , అందులో మృతసంజీవనీ మంత్రం మూడవ వానికి ఉపదేశించగానే పోతుందన్న విషయం శివుడు బృహస్పతికి చెప్పి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి కొడుకు కచుడు శుక్రాచార్యుల వద్ద శిష్యునిగా చేరాడు. శుక్రాచార్యుల కుమార్తె దేవయాని కచుని మోహించింది, కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకుని రాక్షసులు కచుని చంపగా దేవయాని కోరికమేరకు శుక్రాచార్యుడు రెండు మూడు సార్లు మృత సంజీవని మంత్రం ద్వారా బ్రతికించారు. ఈ రాక్షసుల అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి, నీటిలో కలిపి శుక్రుని చేత తాగ్గించారు. దేవయాని మొరపెట్టు ఎలాగైనా బ్రతికించమంటే , కచుడుని బతికిస్తే, నేను చనిపోవాల్సిన వస్తుంది అంటే ఆమె అప్పుడు నేను అతనిని వివాహమాడాలనుకున్నాను. అతడు లేక నేను బ్రతక లేను అన్నది. ఆ రాక్షస గురువు ఈ మంత్రం నా ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె "తండ్రీ నీ కూతురు అయినా నాకు ఆ మంత్రం చెప్పు, కచుడు బతికి బయటకు రాగానే నిన్ను కూడా బతికి ఇస్తాను అన్నది. “అమ్మ! స్త్రీలకు మంత్రజపం తగ్గదు, స్త్రీ కి మంత్రం ఉపదేశిస్తే మంత్రం శక్తిహీనమఅవుతుంది” అన్నారు. దేవయాని మీ మంత్రంతో మీరే సుఖంగా ఉండండి, కచుని విడిచి జీవించలేక నేనే మరణిస్తాను అని మూర్ఛపోయింది. ఆమెను మేలుకొలిపి మంత్రం ఉపదేశించి, తర్వాత కచుని బ్రతికించాడు. కచుడు శుక్రాచార్యుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికించుకున్నది, కచుడు కూడా ఆ మంత్రమే వినిన కారణంగా మంత్రం నష్ట మైంది. ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు . కనుక సావిత్రి నీకు ఏదైనా వ్రతం చెబుతారు చేసుకో అన్నారు, “అందరూ ఆచరించటానికి ఉత్తమమయినది సోమవార వ్రతం. సోమవారం రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిఘాహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే కథ ని ఇలా చెప్పారు.
సీమంతిని ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో ఆ వ్రతమాచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే కుమారుడైన చంద్రాంగదుడుకి ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడ కని వెళ్లి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరోఈతగాళ్లు వెతికిన దొరకలేదు. అది తెలిసిన 14 సంవత్సరాలునిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమయ్యింది. సీమంతిని తను వ్రతంఆచరించిన కూడా తన భర్తను రక్షించేందుకు శివపార్వతులు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధపడింది.
కానీ శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు, అసలు మరణించాడు లేదో ఎలా నిర్ణయించ గలవు. కనుక నీవు వేచి ఉండాలి. అని చెప్పారు. దాయాదులు అతని రాజ్యం హరించి, ఆ రాజదంపతులను చెరసాల లో పెట్టారు. సీమంతిని అంత దుఃఖంలో కూడా ఎంతో దీక్షతో ఆ వ్రాతఆచరిస్తూనే ఉన్నది.
నీట మునిగి పోయిన చంద్రాగదుడుని నాగ కన్యలు అమృతం పోసి బ్రతికించి, పడగలు గల తమ రాజు అయినా తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు. తక్షకుడు అతని వృత్తాంతం మెఱిగి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపొమ్మని ఆహ్వానించారు. చంద్రాగదుడు అందుకు సంతోషించి, తన తల్లిదండ్రులు, భార్య తన కోసం దుక్కిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లాలి అని చెప్పాడు. తక్షకుడు తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించ గలనని చెప్పి పంపాడు. నీటి నుంచి గుర్రం మీద పైకి వచ్చిన చంద్రగదుడుని చూసి సీమంతి ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం, సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళ సూత్రం , నొసట కుంకుం కనిపించకపోయేసరికి, ఆమెను గుర్తు పట్టలేదు. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లి , రాజ్య మపహరించిన దయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించకపోతే యుద్ధంలో శిక్షిస్తానని తెలపగా ఆ దాయాదులు భయపడి రాజ్యం అప్పగించి క్షమాపణ కోరారు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి ఇదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకు వచ్చి వైభవంగా చంద్రంగదడుకి పట్టాభిషేకం చేశారు.
శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, “స్వామి, పరమ పవిత్రము అయిన మీ పాద సేవా మాకు చాలధా? వేరొక వ్రత మెందుకు అన్నాడు? శ్రీ గురుడు "ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకుఅందదు కనుక ఈ వ్రతం చేసుకోండి! అని ఆశీర్వదించి పంపివేశారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నాలుగు దిక్కులు గా పాకి పోయింది
ఆదివారం పారాయణ సమాప్తం!
Leave a comment