సోమవారం పారాయణ ప్రారంభం
అధ్యాయం - 36
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
సిద్ధ యోగిని నామధారకుడు శ్రీ గురుని గురించి చెప్పమనగా, నాయనా! శ్రీ గురు లీలలు ఎన్నని చెప్పగలను? కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వ పురంలో సత్యవంతుడు అయినా ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో జీవిస్తూ ఉండేవాడు, ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. నిష్ఠతో వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ, తనకున్న దాంట్లో అతిధులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహామకి ఆకర్షించబడిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం ఒక శ్రీమంతుడు గ్రామస్తులు అందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. అతని భార్యకు మంత్రం అటువంటి సమారాధన లకు వెళ్లి, భోజనము దక్షిణాలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడి ఎప్పుడు వల్లే ఈ సారి కూడా ఒప్పుకోలేదు. అతడు” నేను రాను, నీకింత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడేమి శ్రీమంతుడు నీతో “నేనొక్కడే అయినా రావచ్చు? అడిగితే దంపతులే రావాలన్నారు. భర్త పై కోపం శ్రీ గురుని వద్దకు వెళ్లి తన బాధను వెల్లబోసుకుంది, తన భర్త కూడా ఆ రోజు సమారాధన కు వెళ్లేలా ఆదేశించామని కోరింది. శ్రీ గురుడు నవ్వి ఆమె భర్త ని పిలిపించి “ఈరోజు నీవు సమారాధన కు వెళ్ళు, భార్య కోరిక తీర్చడం భర్తయొక్క ధర్మం”, అని చెప్పగా అతడు ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.
ఆనాడు అతడు మొదటిసారిగా సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికి అక్కడ విస్తళ్లలోను, మరికొందరు విస్తళ్లలోను ఉన్న అన్నాన్ని ఒక్క కుక్క, పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనం అయింది. ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా దడిలోంచి ఒక కుక్క వచ్చి అన్నపురాశిని ముట్టుకొన్నది, వెంటనే ఒకరు తరిమివేసి వడ్డన కొనసాగించారు. ఆమె భర్త తలబాదుకుని “ బుద్ధిలేనిదాన! నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది! అని విస్తరి ముందు నుంచి లేచిపోయాడు. అతడు బాధపడుతుంటే శ్రీ గురుడు పితృకార్యముల భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానానికి భోక్తగా వెళ్లినందువల్ల ఎట్టి దోషం ఉండదు అని చెప్పారు. అప్పుడా విప్రుడు, “స్వామి! , ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదు దయతో వివరించండి అని కోరాడు.
గురువులు మేనమామలు, ఆచార్యవంతులై వేదవిధులు, అత్తామామలు తోబుట్టువులు, పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవా చేయించుకునేవాడు భార్యబిడ్డలను ఏడిపించి, పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాలు కోరు, క్రోధ వంతుడు, భార్యని విడిచి పెట్టిన వాడు, క్రూరుడు , పిసినారి, దురాచారి, స్నానం చేయకుండా భోజనం చేసేవాడు, కనీసం సంధ్యావందనం అయినా చెయ్యనివాడు మొదలైనవి - ఇలాంటి వారిని భోజనం తిన్నవారు పతితులౌతారు. ఇలా చేయుట స్వధర్మమాచరించేవారికి దేవతలు, సిద్ధులు కామధేనువు గూడా సేవిస్తూ ఉంటాయి. అని శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా!!
అధ్యాయం - 37
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
సిద్ధ యోగి ఇలా చెప్పారు, “నామధారకా ! శ్రీ గురుడు ఆ సబ్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు . మానవులు మూడు కాలాలలో ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకు అవకాశం లేకుంటే ఉదయం షోడశోపచార పూజ ,మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనం అయినా సమర్పించాలి మానవ జన్మ లభించి గూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తరవాత మానవజన్మ రావటం కష్టం.అన్నిటిలోకి గురుపూజ శ్రేష్టం, భక్తితో పూజించగలిగితేచాలు రాయి, చెక్క గూడా దేవుడైఅభిష్టాలు ప్రసాదించగలవు.
పేట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయమము చేసి, పూజ ద్రవ్యాలు సిద్ధం చేసి వాటిని ప్రోక్షించాలి. ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహంముంచి, కుడివైపు శంఖం, ఎడమవైపు గంట ఉంచి, దేవుని మీద నిర్లక్ష్యం తొలగించి, దీపమెలిగించాలి. మొదటి గణపతిని పూజించి, గురువును ,తర్వాత పీఠాన్ని ,ద్వారపాలకులను పూజించాలి. సాక్షాత్తు భగవంతుడే ఎదుటనుండి మన పూజలు గమనిస్తున్నాడని గుర్తించుకోవాలి. తల్లిదండ్రులు, పూజలు పెద్దలకు చూచినప్పుడు వారి పాదాలకు నమస్కరించి, గురువు యొక్క కుడి పాదాన్ని కుడి చేతితో, ఎడమ పాదాన్ని ఎడమచేతితో స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒక్క చేత్తో ఎవరికి, ఎప్పుడు నమస్కరించకూడదు.
గృహస్థుల ఇండ్లలో - కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు , పితురులకు మొదలగు వారికి అర్పించి మిగిలినది మహా ప్రసాదం అన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్యదేవం అంటారు. మొదట కుడి ప్రక్కన చిత్రగుప్తుని కి బలిగా కొంచెం అన్న ముంచి తరువాత భోజనం చేయాలి. సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనం, హోమముచేసి, గురువుకు నమస్కరించాలి, రాత్రి తేలిక గా భోజనం చేసి, కొంతసేపు సద్గ్రంధాలు చదువుకుని, తర్వాత తాను ఆ రోజు చేసినవి స్మరించుకుని, భగవంతునికి నమస్కరించాలి. ఇటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడు భోజనం చేయకూడదు. భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువల్ల ఇహంలోనూ, పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది. అని శ్రీ గురుడు ఆ బ్రాహ్మణుడితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా !!
అధ్యాయం - 38
శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః
నామధారకుడు, “స్వామి, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్టాన రహస్యం మీనుండి విని ధన్యుడనయ్యాను, ఇక అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి” అని వేడుకున్నాడు. సిద్ధ యోగి ఇలా చెప్పారు నాయనా! నీవంటి గురుభక్తుడు, శ్రోత లభించిన అందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివితీర స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది.
శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ నగరం వచ్చేవారికి బిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒక్కసారి కాశ్యపస గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి సరిపడే ధాన్యం మొదలగునవి మాటకట్టుకుని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు, కానీ ఆరోజు అందరితోపాటు అతని కూడా ఎవరో భక్తులు సంతర్పణ ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠం లో ఉంచి, భోజనానికి వెళ్లాడు. రోజు ఇలానే జరుగుతుండడం వల్ల మూడు మాసాలు అలాగే గడిచింది. అతనిని చూసిన బ్రాహ్మణులు“ఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చినాదెందుకు ? చేస్తున్నదేమిటి? నీవు బిక్ష ఇవ్వడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు? పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి లావేక్కావు, సిగ్గు వేయడం లేదా? అని ఎగతాళి చేశారు.
కొంతకాలం భాస్కర శర్మ తనని కాదానట్టు కాలక్షేపం చేస్తున్నాడు. వారి నోట, వీరి నోట ఈ విషయం శ్రీ గురునికి తెలిసి, భాస్కరశర్మన పిలిపించి“నాయనా, నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు బిక్ష సమర్పించు” అని ఆదేశించారు. అతడు మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి నెయ్య ,పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్టానాలు పూర్తిచేసుకుని, తను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తుండగా, వేరొక భక్తుడోచ్చి తానారోజు స్వామికి భిక్ష సమర్పించాలనగా, శ్రీ గురుడు తాము ఈరోజు భాస్కరశర్మ ఇచ్చిన బిక్ష తీసుకుంటామని, అతడు మరొక రోజు బిక్ష చేయవచ్చని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యా! ఇప్పుడి ఈ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈరోజు ఎవరి కొంపకి వాళ్ళు వెళ్లి భోజనం చేయవలసిందే! అనుకుంటూ వెనక్కి తిరుగగా, శ్రీ గురుడు ఆ మాటలు విని “నాయనలారా! ఈరోజు మీరెవరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు, మీరందరూ భార్య బిడ్డలతోను, స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి” అని అన్నారు. అందరూ వారి ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యం కదా! ఎవరికి తెలియదు. కనీసం శ్రీ గురున్నికైన కడుపునిండా పెట్టగలిగితే అంతే చాలు, పో పో అన్నారు. అప్పుడు శ్రీ గురుడు ఈరోజు ఇక్కడ నాలుగు వేల మందికి సమారాధన చేయాలి, అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి. మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని సంతర్పణకు రావాలి, అని భాస్కరశర్మతో ఏమయ్యా, చూస్తావేమిటి? నమస్కరించి అందరిని ఆహ్వానించుఅన్నారు. అతడు లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతోకలిసి తాను చెయ్యనున్న సమారాధనకు విచ్చేసి, తనను కృతార్ధుడను చెయ్యమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, “ఓరి వెరీ బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగదునుకుని, నీవుపిలిస్తే వచ్చామట్టయ్య? నీవు చేసినది ఒకరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా? అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి, “తప్పు, అతనిని నిందించవద్దు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు' అని మందలించాడు. భాస్కరుడు శ్రీ గురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు . అప్పుడు శ్రీగురుని ఆజ్ఞాకోరగా, శ్రీ గురుడు వస్త్రంమీచ్చి, దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. భాస్కరశర్మ, మరికొందరు తిరిగి తిరిగి తిరిగి వడ్డీస్తున్నారు, నెయ్యి కూడా దారలుగా వడ్డిస్తున్నారు. చివరికి ఊర్లో విచారించి భోజనం చేయని వారు ఎవరు లేరని నిర్ధారణ చేసుకున్నాక, శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం సేకరించారు. అప్పుడతడు వెళ్లి చూడగా అతడు వండిన వంటకంఅంతా అలాగే ఉన్నదని స్వామికి చెప్పగా, దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికి తెలిసింది . అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారు మ్రోగింది.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా!!
సోమవారం పారాయణ సమాప్తం !
Leave a comment