కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా |
శిరస్థితా చంద్రనిభా పాలస్థేంద్రా ధనుఃప్రభా ||
శ్లోకం వివరణ :
కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా - అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.
శిరఃస్థితా - తలమిద పెట్టుకోవలసినది.
చంద్రనిభా - చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.
ఫాలస్థా - ఫాల భాగమునందు ఉండునది.
ఇంద్రధనుఃప్రభా - ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.
Leave a comment