హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా |
దాక్షాయిణీ దైత్యహంత్రీ దక్షయజ్న నివాసినీ ||
శ్లోకం వివరణ :
హృదయస్థా - హృదయమునందు ఉండునది.
రవిప్రఖ్యా - సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.
త్రికోణాంతర దీపికా - మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మద్యమున వెలుగుచుండునది.
దాక్షాయణీ - దక్షుని కుమార్తె.
దైత్యహంత్రీ - రాక్షసులను సంహరించింది.
దక్షయజ్ఞవినాశినీ - దక్షయజ్ఞమును నాశము చేసినది.
Leave a comment