దరాంతోళిత దీరాక్షీ దరహాసోజ్వల న్ముఖీ |
గురుమూర్తి ర్గుణనిధీ ర్గోమాతా గుహజన్మభూ ||
శ్లోకం వివరణ :
దరాందోళితదీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది.
గుణనిధిః - గుణములకు గని వంటిది.
గోమాతా - గోవులకు తల్లి వంటిది.
గుహజన్మభూః - కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.
Leave a comment