క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయినీ |
త్రిపురా త్రిజగద్వందా త్రిమూర్తి స్తిదశేశ్వరీ ||
శ్లోకం వివరణ :
క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.
Leave a comment