తటిల్లతాసమరుచిః, షట్చక్రోపరిసంస్థితా |
మహాసక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ | |
శ్లోకం వివరణ :
తటిల్లతా సమరుచిః - మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
షట్చక్రోపరి సంస్థితా - ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.
మహాసక్తిః - బ్రహ్మమునందు ఆసక్తి గలది.కుండలినీ - పాము వంటి ఆకారము గలది.
బిసతంతు తనీయసీ - తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.
Leave a comment