భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ | |
శ్లోకం వివరణ :
భవానీ - భవుని భార్య.
భావనాగమ్యా - భావన చేత పొంద శక్యము గానిది.
భవారణ్య కుఠారికా - సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.
భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.
భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.
Leave a comment