నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాన్తా, నిష్కామా, నిరుపప్లవా | |
శ్లోకం వివరణ :
నిర్లేపా - కర్మ బంధములు అంటనిది.
నిర్మలా - ఏ విధమైన మలినము లేనిది.
నిత్యా - నిత్య సత్య స్వరూపిణి.
నిరాకారా - ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.
నిరాకులా - భావ వికారములు లేనిది.
నిర్గుణా - గుణములు అంటనిది.
నిష్కలా - విభాగములు లేనిది.శాంతా - ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.
నిష్కామా - కామము, అనగా ఏ కోరికలు లేనిది.
నిరుపప్లవా - హద్దులు ఉల్లంఘించుట లేనిది.
Leave a comment