వ్యోమకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ!

పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ!!

శ్లోకం వివరణ :

వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది
విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి
పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
పంచప్రేతమంచాధిశాయినీ : పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది

విశ్వమాతా జద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ

శ్లోకం వివరణ :

విశ్వమాతా : విశ్వమునకు తల్లి
జద్ధాత్రీ : జగత్తును రక్షించునది
విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
ప్రగల్భా : సర్వసమర్ధురాలు
పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
మరామోదా : పరమానందము కలిగినది
మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది

స్తోత్రప్రియా స్తుతిమతే శ్రుతిసంస్తుతవైభవా
మనస్వినీ మానవతీ మహేశే మంగాళాకృతి:

శ్లోకం వివరణ :

స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
మనస్వినీ : మనస్సు కలిగినది
మానవతీ : అభిమానము కలిగినది
మహేశే : మహేశ్వర శక్తి
మంగాళాకృతి: : మంగలప్రదమైన రూపము కలిగినది

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేర ముఖాంబుజా
కౌలినీ కేవలానర్ఘ్య కైవల్యపద దాయినీ 

శ్లోకం వివరణ :

దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
దక్షిణారాధ్యా : దక్షిణాచారముచే పొజింపబదుచున్నది
దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్నది
కేవలా : సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
అనర్ఘ్య కైవల్యపదదాయినీ : అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును

చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా
సదొదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా 

శ్లోకం వివరణ :

చైతన్యార్ఘ్య సమారాధ్యా : ఙ్ఞానులచే పూజింపబడునది
చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది
సదొదితా : సత్యస్వరూపిణీ
సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది
తరుణాదిత్యపాటలా : ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా

శ్లోకం వివరణ :

సవ్యాపసవ్యమార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది
స్వస్థా : మార్పులేకుండా ఉండునది
స్వభావమధురా : సహజమైన మధురస్వభావము కలది
ధీరా : ధైర్యము కలది
ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది

తత్త్వాధికా తత్త్వమైయీ తత్త్వమర్ధస్వరూపిణీ
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ

శ్లోకం వివరణ :

తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి
తత్త్వమైయీ : తత్వస్వరూపిణి
తత్త్వమర్ధస్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది
సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది
సౌమ్యా : సౌమ్యస్వభావము కలిగినది
సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి

వీరగోష్టేప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ
విఙ్ఞాన కలానా కల్యా విదగ్ధా బైందవాసనా 

శ్లోకం వివరణ :

వీరగోష్టేప్రియా : వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
వీరా : వీరత్వము కలిగినది
నైష్కర్మ్యా : కర్మబంధము లేనిది
నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి
కల్యా : మూలకారణము
విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ 

శ్లోకం వివరణ :

విశ్వగ్రాసా : విశ్వమే ఆహారముగా కలిగినది
విద్రుమాభా : పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
వైష్ణవీ : వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
విష్ణురూపిణీ : విష్ణురూపమున జగత్తును రక్షించునది
అయోని: : పుట్టుక లేనిది
యోనినిలయా : సమస్త సృష్టి కి జన్మస్థానము
కూటస్థా : మూలకారణ శక్తి
కులరూపిణీ : కుండలినీ రూపిణి

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ
విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణీ

శ్లోకం వివరణ :

ధర్మాధారా : ధర్మమునకు ఆధారభూతమైనది
ధనాధ్యక్షా : సర్వసంపదలకు అధికారిణి
ధనధాన్యవివర్ధినీ : ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది
విప్రప్రియా : వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది
విప్రరూప : వేదవిదులైనవారి యెందు ఉండునది
విశ్వభ్రమణకారిణీ : విశ్వమును నడిపించునది

Pages