రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీథ నివేశితనిజాశ్రితా 

శ్లోకం వివరణ :

రాజరాజేశ్వరీ : ఈశ్వరుని హృదయేశ్వరీ
రాజ్యదాయినీ : రాజ్యములను ఇచ్చునది
రాజ్యవల్లభా : రాజ్యమునకు అధికారిణీ
రాజత్కృపా : అధికమైన కరుణ కలది
రాజపీఠనిశేవితనిజాశ్రితా : తనను ఆశ్రయించినవారిని సిం హాసనము పైన కూర్చొండపెట్టునది

భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతి:

శ్లోకం వివరణ : 

భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
బృహత్సేనా : గొప్ప సైన్యము కలిగినది
భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
సుఖారాధ్యా : సుఖులైనవారిచే(నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
శుభంకరీ : శుభములను కలిగినది
శోభనా : వైభవములను కలిగినది
సులభాగతి: : తేలికగా చేరతగినది

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణీ
బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా 

శ్లోకం వివరణ :

అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
వసుదా : సంపదలిచ్చునది
వృద్ధా : ప్రాచీనమైనది
బ్రహ్మత్మైక్యస్వరుపినీ : ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
బృహతీ : అన్నిటికన్న పెద్దది
బ్రాహ్మణీ : బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
బ్రాహ్మీ : సరస్వతీ
బ్రహ్మానందా : బ్రహ్మానందస్వరూపిణీ
బలిప్రియా : బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైత వర్జితా 

శ్లోకం వివరణ :

అష్టమూర్తి: : 8రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
అజా : పుట్టుకలేనిది
జైత్రీ : సర్వమును జయించినది
లోకయాత్రావిధాయినీ : లోకములను నియమించునది
ఏకాకినీ : ఏకస్వరూపిణీ
భూమరూపా : భూదేవిరూపము ధరించునది
నిర్ద్వైతా : అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
ద్వైత వర్జితా : ద్వైతభావము లేనిది

ఇచ్చాశక్తి జ్నానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |
సర్వధారా సుప్రదిష్ఠా సదసద్రూపదారిణీ ||

శ్లోకం వివరణ :

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
సదసద్రూపధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.

అదృశ్యా దృశ్యరహితా విజ్నాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ||

శ్లోకం వివరణ :

అదృశ్యా - చూడబడనిది.
దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
యోగినీ - యోగముతో కూడి ఉంది.
యోగదా - యోగమును ఇచ్చునది.
యోగ్యా - యోగ్యమైనది.
యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
యుగంధరా - జంటను ధరించునది.

సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా ||

 శ్లోకం వివరణ :

సర్వవేదాంత సంవేద్యా - అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
సత్యానంద స్వరూపిణీ - నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
లోపాముద్రార్చితా - లోపాముద్రచే అర్చింపబడింది.
లీలాక్లుప్త బ్రహ్మాండమండలా - క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగదీశ్వరీ |
ధ్యానగమ్యా పరిచ్చేద్యా జ్నానదా జ్నానవిగ్రహా ||

శ్లోకం వివరణ :

విశ్వగర్భా - విశ్వమును గర్భమునందు ధరించునది.
స్వర్ణగర్భా - బంగారు గర్భము గలది.
అవరదా - తనకు మించిన వరదాతలు లేనిది.
వాగధీశ్వరీ - వాక్కునకు అధిదేవత.
ధ్యానగమ్యా - ధ్యానము చేత పొందబడునది.
అపరిచ్ఛేద్యా - విభజింప వీలులేనిది.
జ్ఞానదా - జ్ఞానమును ఇచ్చునది.
జ్ఞానవిగ్రహా - జ్ఞానమును మూర్తిగా దాల్చింది.

త్ర్యక్షరీ దివ్యగంధాడ్యా సింధూర తిలకాంచితా |
ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర

శ్లోకం వివరణ :

త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయినీ |
త్రిపురా త్రిజగద్వందా త్రిమూర్తి స్తిదశేశ్వరీ ||

శ్లోకం వివరణ :

క్లీంకారీ
- ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.

Pages