సుముఖీ నళినీ సుభ్రూ శ్శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ||

శ్లోకం వివరణ :

సుముఖీ - మంగళకరమైన ముఖము కలది.
నళినీ - నాళము గలిగినది.
సుభ్రూః - శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
శోభనా - సౌందర్యశోభ కలిగినది.
సురనాయికా - దేవతలకు నాయకురాలు.
కాలకంఠీ - నల్లని కంఠము గలది.
కాంతిమతీ - ప్రకాశవంతమైన శరీరము కలది.
క్షోభిణీ - క్షోభింపచేయునది అనగా మథించునది.
సూక్ష్మరూపిణీ - సూక్ష్మశక్తి స్వరూపిణి.

తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచల నివాసినీ ||

శ్లోకం వివరణ :

తేజోవతీ - తేజస్సు కలది.
త్రినయనా - మూడు కన్నులు కలది.
లోకాక్షీ కామరూపిణీ - స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
మాలినీ - మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
హంసినీ - హంసను (శ్వాసను) గలిగినది.
మాతా - తల్లి.
మలయాచలవాసినీ - మలయపర్వమున వసించునది.

కుమార గణనాథాంబా తుష్టిః పుష్టి ర్మతి ర్ధృతిః |
శాంతి స్వస్తి మతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ ||

శ్లోకం వివరణ :


కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.
తుష్టిః - తృప్తి, సంతోషముల రూపము.
పుష్టిః - సమృద్ధి స్వరూపము.
మతిః - బుద్ధి
ధృతిః - ధైర్యము.
శాంతిః - తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
స్వస్తిమతీ - మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
కాంతిః - కోరదగినది.
నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
విఘ్ననాశినీ - విఘ్నములను నాశము చేయునది

కుశలాకోమలాకారా కుకుళ్ళా కుళేశ్వరీ |
కుళకుండలయా కౌలమార్గ తత్పర సేవితా ||
శ్లోకం వివరణ :

కుశలా - క్షేమము, కౌశల్యమును గలది.
కోమలాకారా - సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
కురుకుల్లా -
కులేశ్వరీ - కులమార్గమునకు ఈశ్వరి.
కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.
కులమార్గతత్పరసేవితా - కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.

మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటల గండభూ |
చందన ద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా ||


శ్లోకం వివరణ :

మదఘూర్ణితరక్తాక్షీ - పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
మదపాటల గండభూః - ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
చందనద్రవదిగ్ధాంగీ - మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
చంపేయకుసుమప్రియా - సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.

తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలినీ ||

శ్లోకం వివరణ :

తత్త్వాసనా - తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
తత్ - పరమాత్మను సూచించు పదము.
త్వమ్‌ - నీవు.
అయీ - అమ్మవారిని సంబోధించు పదము.
పంచకోశాంతరస్థితా - ఐదు కోశముల మధ్యన ఉండునది.
నిస్సీమ మహిమా - హద్దులు లేని మహిమ గలది.
నిత్యయౌవనా - సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.
మదశాలినీ - పరవశత్వముతో కూడిన శీలము కలది.

చిచ్చక్తి శ్చేతనారూపా జడశక్తి జడశక్తి ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిధేవితా ||

శ్లోకం వివరణ :

చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా ||

శ్లోకం వివరణ :

శివప్రియా - శివునికి ఇష్టమైనది.
శివపరా - శివుని పరమావధిగా కలిగినది.
శిష్టేష్టా - శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
శిష్టపూజితా - శిష్టజనుల చేత పూజింపబడునది.
అప్రమేయా - ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
స్వప్రకాశా - తనంతట తానే ప్రకాశించునది.
మనోవాచామగోచరా - మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

భక్తహార్ధతమోబేధ భానుమద్భాను సంతతిః|
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ ||

శ్లోకం వివరణ :

భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
శివదూతీ - శివుని వద్దకు పంపిన దూతిక.
శివారాధ్యా - శివునిచే ఆరాధింపబడునది.
శివమూర్తిః - శివునియొక్క స్వరూపము.
శివంకరీ - శుభములు చేకూర్చునది.

వ్యాపినీ వివిధాకారా విద్యా విద్యా స్వరూపిణీ |
మహా కామేశనయనా కుముదాహ్లాద కౌముదీ ||

శ్లోకం వివరణ :

వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.

Pages