మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా || 

శ్లోకం వివరణ :

మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి.
మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి.
మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి.
మహాసనా - గొప్పదైన ఆసనము గలది.
మహాయోగ క్రమారాధ్యా - గొప్పదైన యోగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.
మహాభైరవ పూజితా - ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
మహాబుద్ధి-ర్మహాసిద్ధి-ర్మహాయోగీశ్వరేశ్వరీ ||

శ్లోకం వివరణ :

మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.
మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.
మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు.
మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.
మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది.
మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |
మహామాయా మహాసత్త్వా మహాశక్తి-ర్మహారతిః || 

శ్లోకం వివరణ :


మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.
మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది.
మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.
మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.
మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.
మహారతిః - గొప్ప ఆసక్తి గలది

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ-ర్మృడప్రియా ||

శ్లోకం వివరణ :

సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.
సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది.
మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.
మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.
మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.
మృడప్రియా - శివుని ప్రియురాలు.

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ || 

శ్లోకం వివరణ :

సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.
సద్గతి ప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

దుష్టదూరా, దురాచారశమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాన్ద్రకరుణా, సమానాధిక వర్జితా | |

శ్లోకం వివరణ :

దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.
దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.
దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.
సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.
సాంద్రకరుణా - గొప్ప దయ గలది.
సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహన్త్రీ, సుఖప్రదా | |

శ్లోకం వివరణ :

నిస్తులా - సాటి లేనిది.
నీలచికురా - చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది.
నిరపాయా - అపాయములు లేనిది.
నిరత్యయా - అతిక్రమింప వీలులేనిది.
దుర్లభా - పొందశక్యము కానిది.
దుర్గమా - గమింప శక్యము గానిది.
దుర్గా - దుర్గాదేవి.
దుఃఖహంత్రీ - దుఃఖములను తొలగించునది.
సుఖప్రదా - సుఖములను ఇచ్చునది

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా నిష్పరిగ్రహా | |

శ్లోకం వివరణ : 

నిర్వికల్పా - వికల్పములు లేనిది.
నిరాబాధా - బాధలు, వేధలు లేనిది.
నిర్భేదా - భేదములు లేనిది.భేదనాశినీ - భేదములను పోగొట్టునది.
నిర్నాశా - నాశము లేనిది.
మృత్యుమథనీ - మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.
నిష్క్రియా - క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.
నిష్పరిగ్రహా - స్వీకరణ, పరిజనాదులు లేనిది.

నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ | |

శ్లోకం వివరణ : 

నిష్క్రోధా - క్రోధము లేనిది.
క్రోధశమనీ - క్రోధమును పోగొట్టునది.
నిర్లోభా - లోభము లేనిది.లోభనాశినీ - లోభమును పోగొట్టునది.
నిస్సంశయా - సందేహములు, సంశయములు లేనిది.
సంశయఘ్నీ - సంశయములను పోగొట్టునది.నిర్భవా - పుట్టుక లేనిది.
భవనాశినీ - పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది

నిశ్చిన్తా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహన్త్రీ, నిష్పాపా, పాపనాశినీ | | 

శ్లోకం వివరణ :

నిశ్చింతా - చింతలూ లేనిది.
నిరహంకారా - విధమైన అహంకారము లేనిది.
నిర్మోహా - అవగాహనలో పొరపాటు లేనిది.
మోహనాశినీ - మోహమును పోగొట్టునది.
నిర్మమా - మమకారము లేనిది.
మమతాహంత్రీ - మమకారమును పోగొట్టునది.
నిష్పాపా - పాపము లేనిది.పాపనాశినీ - పాపములను పోగొట్టునది

Pages