నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా |
నిరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ | |
శ్లోకం వివరణ :
నిష్కారణా - ఏ కారణము లేనిది.
నిష్కళంకా - ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
నిరుపాధిః - ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
నిరీశ్వరా - ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
నిరాగా - రాగము అనగా కోరికలు లేనిది.
రాగమథనీ - రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
నిర్మదా - మదము లేనిది.
మదనాశినీ - మదమును పోగొట్టునది