మంగళవారం పారాయణ ప్రారంభం

అధ్యాయం  - 39

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి ఇంకా ఇలా చెప్పారు, “గంధర్వపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక  గోత్రం. అతని భార్యకు 60 ఏళ్లు నిండిన సంతతి కలుగ లేదు. ఆమె నిత్యం శ్రీగురుని దర్శించి , వారి పాదాలను పూజించి నమస్కరిస్తూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు తదేకదీక్షతో చేస్తుండేది. ఒక నాడు ఆ మహా ఇల్లాలితో,' అమ్మ! ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తునావు , నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీ నాధుని కృపవలన తీరుస్తాను అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి ఒగ్గి కన్నీరు కారుస్తూస్వామి! కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా! నా చంక బిడ్డను ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి, మాకు, పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదేమో? స్వామి! అయ్యిందేదో అయ్యింది రు జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ, “ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు నేను ఇచ్చిన వరం వలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది. నీవు నిత్యం ఇంత శ్రద్ధగా సేవిస్తున్నారు కనుక నీవు కోరినది జన్మలోనే ప్రసాదిస్తాము. కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు ,కొడుకు కలుగుతారు అని వరం ఇచ్చారు.

అప్పుడు గంగాబ తన కొంగున ముడి వేసుకుని స్వామికి నమస్కరించి, “స్వామి! ఒక సందేహం, నాపై కోపగించుకోవద్దు. నేను బిడ్డలకోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పగా నమ్మి, కనిపించిన రావిచెట్టుకు ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి అలిసిపోయాను అలాగే నా వయస్సు అంతా చెల్లిపోయింది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే జన్మలోనే ప్రసాదించారు అయితే ఇప్పుడు వరకు నేను రావిచెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల ప్రయోజనం ఏమున్నది ? అనగానేఅమ్మాయి! నీవు చేసిన అశ్వద్ద పూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది, ఇప్పుడు అవివేకంతో కాస్త పుణ్యం పోగొట్టుకోకుఇకనుండి సంగమంలో  ఉన్న రావిచెట్టుకు, మాకు కలిపి నిత్యం ప్రదక్షిణ, పూజ చేస్తుండు. మేము ఎప్పుడూ అశ్వత్థ వృక్షం లో ఉంటాము, అందుకే పురాణాలన్నీ దానినిఅశ్వద్ధ నారాయణుడని”  కీర్తించాయి.

అశ్వత్థ వృక్షం లో సర్వ దేవతలు ఉంటారు, వృక్షం యొక్క మూలమే బ్రహ్మ , దాని మధ్య భాగమే   విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అశ్వత్థ ప్రదక్షిణం, చైత్ర, ఆషాడ, పుణ్య మాసాల లోనూ, గురు, శుక్ర మౌఢ్యాలలోను, కృష్ణ పక్షంలోనూ ప్రారంభించకూడదు. ఆది, సోమ, శుక్ర వారాలలోనూసంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ, రాత్రి భోజనం అయ్యాక వృక్షాన్ని సేవించకూడదు. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డల తోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలను ధరించి గణపతిని పూజించి , అప్పుడు సంకల్పం చెప్పి అశ్వద్ద వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి. మరలా స్నానం చేసి పీతాంబరం ధరించిన  నారాయణుని  8 బాహువులు గల వానిగా ధ్యానించి , తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గానీ, ఎంతో నెమ్మదిగా ప్రదక్షణాలు చేయాలి. ఇది ప్రదక్షిణానికి మొదట, చివర నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వ పాపాలు నశించి, నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి.

అమ్మ! “అశ్వర్థ మహత్యం తెలిసింది కనుక నీవు ఎట్టి  సంశయము పెట్టుకోకుండా అలా చేయి, మీ అభీష్టం నెరవేరుతుంది అన్నారు. ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి, మూడు పూటలు షాట్కుల తీర్థంలో స్నానం చేసి, గురువు చెప్పినట్లు అశ్వర్ధని సేవించి, దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి , శ్రీ గురు సహితంగా దానిని పూజించింది. మూడు రోజులు దంపతులు సంగమంలోనే ఉన్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో మీ కోరిక తీరింది, ఉదయం శ్రీ గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను”, అన్నారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే రెండు పండ్లు ఇచ్చి, పారాయణ అయ్యాక నీవి పండ్లు తిను అన్నారు. నల్లని వెంట్రుక ఒకటైన లేకుండా జుట్టు మెరిసి, పళ్ళు అన్ని ఊడిపోయిన తరువాత కూడా ఆమె గర్భవతి అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. మరొక్కసారి శ్రీ గురుని మహిమ అందరికీ అర్థమైంది. ఒక శుభముహూర్తంలో ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు శ్రీగురుని పేరిటసరస్వతిఅని పేరు పెట్టుకున్నారు. దంపతులు  శ్రీ గురుని దర్శించి , బిడ్డను ఆయన ముందుంచగా, స్వామి వాత్సల్యంతోపుత్రవతి! లేవమ్మా! ఇది ఆడపిల్లే కానీ మగ పిల్లవాడు కాదే? ” అంటూ నవ్వి, నీకు కొడుకు కూడా పుడతాడు. కానీ నీకు వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా? లేక 30 సంవత్సరాల వయస్సు గల విద్వాంసుడు కావాలా ? అన్నారు. అప్పుడు గంగాంబ “విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయినా కొడుకునే ప్రసాదించండి. అతనికి అయిదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని స్వామికి నమస్కరించింది. “తధాస్తుఅని ఆమెను దీవించగా ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడానృసింహఅని శ్రీ గురుని పేరే పెట్టారు. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకు వెళుతూ ఉండేవారు. శ్రీ గురు కృప ఎంతటిదో చూసావా! నామధారకా ! వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది.

అధ్యాయం  - 40

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. “గంధర్వ పురానికి ఒక నాడు నరహరిశర్మ అనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుస్మాక , గార్గేయ గోత్రం. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని మనవి చేసుకున్నాడు . “స్వామి! మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమిమీద అవతరించాడు అని విని, మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నాకు కుష్టు వ్యాధి రావటం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికి కూడా ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకుని, నన్ను ఇప్పుడు ఇలా కట్టి కుడుపుతున్నాయి. తెల్ల కుష్టురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్నో తీర్ధాలను సేవించాను. దేవతలకు మ్రొక్కానుకానీ కించిత్తయినా తగ్గలేదు, చివరికి మీరే దిక్కు అని వచ్చాను. మీకు కూడా నాపై దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను, స్వామి! నన్ను ఉద్ధరించండి అని నమస్కారం చేశాడు. శ్రీ గురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి , “విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు కనుకనే నీకి కుష్టు వ్యాధి వచ్చింది. ఇది  తొలగిపోవడానికి నేనొక ఉపాయం చెబుతాను, దానివల్ల దివ్యమైన శరీరం పొందుతావు.

ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకుని అటుగా వెళ్తుండగా వాటిలో ఒక మేడి చెట్టు కర్రను ఇచ్చి, నీవు దీనిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లు చేయి, దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటి నిత్యం స్నానం చేసి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి  రెండు చేతులలో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి మీ శరీరం స్వచ్ఛవుతుంది వెళ్ళు! అన్నారు. నరహరి  మాట పై సంపూర్ణ విశ్వాసం ఉంచి కట్టెను భక్తితో నెత్తిపై మోసుకుపోయి ప్రతినిత్యం శ్రీ గురుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కట్టెకు నీరు పోయడం చూసినవారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు ఎన్ని రోజులు నీళ్ళు పోస్తే మాత్రం ఎందుకంటే చిగురిస్తుందా? నిజానికి జన్మలో నీ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికి శ్రీ గురుడు నీకు ఇలా చెప్పారు. జబ్బుకు తోడు ప్రయాస ఎందుకనగా శ్రీ గురుడు చెప్పినట్లు భక్తితో చేయడం నా బాధ్యత, వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వారి పనిఅని చెప్పి నిష్టగా చేస్తుండడం చూసి వారు శ్రీగురుని తో వృధా ప్రయాస ఎందుకు అనిన నా వినటం లేదు , స్వామి! అతనికి మీరైనా చెప్పండి లేకపోతే అలాగే చేస్తుంటాడుఅని చెప్పారు. శ్రీ గురుడు  భూలోకంలో గురు వాక్యం ఒక్కటే  తరింప చేయగలదు. దానిని విశ్వసించ గలవారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. ఎవరి భావం ఎలా ఉంటే ఫలితం కూడా అలానే సిద్ధిస్తుంది, దానిని తెలిపే వృత్తాతం ఉన్నది విను.

పూర్వం పాంచాల దేశాన్ని సింహ కేతువు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు, ఒకసారి వేటకని మహా అరణ్యానికి  వెళ్ళాడు, చాలాసేపు వేటాడి బాగా అలసిపోవడం వల్ల దాహం వేసింది.. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు తీసుకు పోగా అతని దాహం తీర్చుకుని  ప్రక్కనే ఉన్న దేవాలయం లో విశ్రాంతి తీసుకున్నాడు. బోయవాడు ప్రక్కనే ఉన్న ఒక శివలింగాన్ని తీసుకుని తదేకంగా చూస్తూ ఉండిపోవడం చూసిన రాజకుమారుడునీకు లింగం ఎందుకు అని అడిగాడు?” అయ్యా! చాలా కాలంగా నాకు శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉంది, ఇది చాలా ప్రశస్తమైనది అని విన్నాను, నేను అడవిలో పెరిగిన వాడిని కనుక దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు, దయతో పూజా విధానం చెప్పండి అని కోరాడు, అయితే చెబుతాను శ్రద్ధగావిను దీనిని తీసుకుపోయి, ఒక చోట శుభ్రం చేసి స్థాపించు , దీని రూపంలో సాక్షాత్తు శివుడే మీ ఇంట్లో ఉంటాడు. నిత్యం పూజ చేసి ప్రతిరోజూ స్మశానం నుండి చితాభస్మం తెచ్చి శివునికి అర్పించుఅని చెప్పారు.

బోయవాడు ఇంటికి వెళ్లి ప్రకారమే చేశాడు. ఒక రోజు ఎంత వెతికినా చితాభస్మం దొరకలేదని బాధపడుతుంటే, అతని భార్య నాదా! దానికోసం అంత బాధపడతావ్ ఏమీ? మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కనుక వాటితో నన్ను దహనం చేసి స్వామికి అర్పించు అన్నది. భయపడొద్దు, నీ వ్రతం బంగం కాకూడదు. శివ పూజ కోసం శరీరమే అర్పించడంకంటే సంతోషం ఏమున్నది, శరీరం ఏనాటికి అయినా చచ్చి బూడిద కావలసినదే కదా! అలాంటి శివ పూజకర్పించడంకంటే కావలసినది ఏమున్నదిఅని ధైర్యం చెప్పింది.

అప్పుడు ఆమె పట్టుబట్టి బోయ వాడిని ఒప్పించి, ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమనది. అతడలాగే సర్వం భస్మమయ్యాక దానిని భక్తితో లింగానికి అర్పించి ఎంతో సంతోషించాడు. తరువాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా  , శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకురమ్మని తన భార్యని పిలిచాడు, అది ఏమి చిత్రమో కానీ శివుని అనుగ్రహం వల్ల బతికి వచ్చింది. వెనుకకు తిరిగి చూస్తే  ఇల్లు కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నదిఅతని భార్య నాలుగు ప్రక్కల మంట అంటుకుని మండుతున్న గాని నాకు బాగా నిద్ర వచ్చి పడుకోగానే నిద్రపట్టింది, ఏం జరిగిందో తెలియదు మీరు పిలవగానే మేలుకో వచ్చి లేచి వచ్చాను, ఆహా! ఏమి మన భాగ్యం శివుని లీలా అని స్మరించగానే ఈశ్వరుడు సాక్షాత్కరించి వరమిచ్చాడు. దేనియందు అయినా విశ్వాసం ఉండాలేగానీ, ఎంతటి ఫలితం అయినా లభించగలదు, కనుక ఆ కుష్ఠిరోగిఆయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితంవుండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి లభిస్తుంది అన్నారు.

కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్టానం  పూర్తిచేసుకుని కుష్ఠురోగి వద్దకు వెళ్లారు. నరహరి ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించి ఆయన కమండలంలోని నీరు తీసి, ఎండిన మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురించింది! సంగమానికి వచ్చిన వారంతా చూస్తుండగానే పెరిగి చిన్న మేడి చెట్టు అయింది. అది చూస్తున్న నరహరికి కూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోతుంది. అతడు ఆనందభాష్పాలు రాలుస్తూ శ్రీ గురుని స్తుతించాడు. గ్రామంలోని వారందరూ ఆ లీ గురించి విని, శ్రీ గురుణ్ణి దర్శించి భక్తితో ఆయనకు హారతులిచ్చారు. తర్వాత శ్రీ గురుడు అతనినీ దగ్గరకు పిలిచినాయనా! నీ పట్ల మాకు ఎంతో ప్రీతి కలిగింది అని, విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు "యోగీశ్వరుడు" అని పేరు పెడుతున్నా ము. నీ భార్యా బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అన్నారు.

అతడు భక్తితో చేసిన స్తోత్ర మంటే శ్రీ గురుణ్ణికి ఎంతో ప్రీతి, స్తోత్రంలో ఏమైనా వ్యాకరణచందు దోషాలు ఉన్నాయి అని తప్పులు దిద్ద బోతే, శ్రీ గురుడు అంగీకరించక స్తోత్రం అలానే చదవాలనే వారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 41

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామదారకుడు, మా పూర్వీకులు శ్రీ  గురు భక్తులు ఎలా అయ్యారో ? తెలుపమనిగా సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయనా! పూర్వం శ్రీ గురుడు  తీర్దానం చేస్తూ వాస క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకులు. శ్రీ గురుడు అనేక తీర్థ క్షేత్రాలను పావనం చేసి  గంధర్వ పురం చేరారు కదా! అది తెలిసిన సాయం దేవుడు భక్తిశ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. శ్రీ గురుని దర్శించుకోగానే అతనికి రోమాంచితమై, ఆనందభాష్పాలతో సాష్టాంగ నమస్కారం చేసి గద్గదస్వరంతో స్తుతించాడు.

శ్రీ గురుడు సంతోషించి సాయం దేవుడు తలపై చేయి పెట్టి, నాయనా! నీవు నాకు పరమ భక్తుడవు, నీ వంశీయులు అందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లు గాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులు అందరితో ఆయన, “మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వద్ద వృక్షాన్ని సేవించి భోజనానికి రమ్మని చెప్పారు. అప్పుడు స్వామి సాయం దేవుడిని ప్రక్కనే కూర్చుండబెట్టి భోజనం పెట్టించారు. తరువాతనాయనా! నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్య బిడ్డలు క్షేమమా? చాలాకాలానికి కనిపించావు”, అన్నారుఅపుడు సాయం దేవుడు స్వామి! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది? మీ దయవల్ల అందరూ క్షేమమే . నా భార్య బిడ్డలు ఉత్తరకంచి లో ఉన్నారు, నా కుటుంబ భారాన్ని కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాద సేవ  చేయాలనుకుంటున్నాను అనుగ్రహించమని కోరాడు. శ్రీ గురుడు నవ్వి, “నాయనా! మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు, ఒక చోట ఉండే వారము కాదు, ఎక్కడపడితే అక్కడ ఉంటాము, మాతో కలిసి ఉండడం, మా సేవ చేయడము కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు.

సాయం దేవుడు,” స్వామి! మిమ్ము  శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు, మీరు ఉండగా నాకు భయం ఏమిటి? మీ పాద సేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండిఅని ప్రార్థించారు. అప్పుడు శ్రీ గురుడునీకంత దృఢ భావం ఉంటే అలానే చెయ్యిఅని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలల తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యుల ఎవరిని రావద్దు అని చెప్పి, సాయం దేవుని ఒక్కడినే సంగమానికి తీసుకువెళ్లారు. శ్రీ గురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చుని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. వారు వెళ్లిపోయాక శ్రీ గురుడు, సాయం దేవుడు మాత్రమేక్కడ ఉన్నారు.

అప్పుడు అతనిని పరీక్షించదలచి, శ్రీ గురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది, గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి, ఉన్నట్టుండి భయంకరమైన ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే లా కుండపోతగా వర్షం ఆరంభమైనది. సాయం దేవుడు గాలికి ఎలాగో ఓర్చుకుని, తన ఒంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీ గురునికి కప్పి అడ్డు నిలిచాడు. అప్పుడు శ్రీ గురుడు నాయనా! నన్ను చలి బాధిస్తున్నది, నీవు మఠానికి పోయి అగ్ని తీసుకుని రా! అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనిని బాటకు అటూఇటూ చూడకుండా వెళ్లి రమ్మని చెప్పారు.

వెంటనే సాయం దేవుడు బయలుదేరి  గంధర్వపురం వైపు నడవసాగాడు, దారిలో ఎక్కడ చూసినా మోకాలు లోతు బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి. ఆపైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులను నిద్ర లేపి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీ గురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో  తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూశాడు, అటు ప్రక్కన ఐదు పడగల భయంకరమైన తాచు పాము కనిపించింది. భయంతో వేగంగా నడుస్తూ ఎడమ పక్కకు చూడగా అటు కూడా మరొక భయంకరమైన పాము అతను వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాట లోని ఎత్తు ,ఫలాలు పట్టించుకోకుండా పరిగెత్తగా పాములు కూడా వెంబడించాయి.

అప్పుడు సాయం దేవుడు దిక్కుతోచక శ్రీ గురుని స్మరించగా కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది, కొద్దిసేపట్లోనే సంగమం వద్ద ఉన్న రావి చెట్టు అతనికి కనిపించింది, ప్రాంతమంతా వేల కొద్దీ దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది. అతడు అటువైపుగా వెళ్లి మీ శ్రీగురుని  సమీపించే సరికి, ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు, ఆకాశంలో పిండి ఆరబోసినట్లు, పండు వెన్నెల వచ్చింది. అతడు పాత్ర కిందపెట్టి, నిప్పులు ప్రజ్వలింపచేశాడు . భయం తగ్గి గురువు కేసి చూసేసరికి రెండు పాములు ఆయనకు నమస్కరిస్తున్నా యి. వాటిని చూడగానే సాయం దేవుడుకి మళ్లీ భయమేసింది. శ్రీ గురుడు అప్పుడు నవ్వి, “భయపడవద్దు, నిన్ను రక్షించడానికి పాములను మేమే పంపాము, గురు సేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? తగిన భక్తిశ్రద్ధలు ఉంటేనే అందుకు పూనుకోవాలి అన్నారు. “స్వామి! నేనేమీ తెలియని వాడిని కృపతో గురు భక్తి ఎలాంటిదో వివరించండి, దాని సహాయంతో  స్థైర్యం  చిక్కించుకుని మీ చెంతనే ఉండి సేవిస్తాను " అన్నాడు.

నాయనా! చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో,  బ్రాహ్మ ముహూర్తం అయిందోనని పట్టించుకోకుండా వినాలి. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురు భక్తితత్వం, శివుడు ఇలా చెప్పారు. “దేవి, గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో సేవించడం వల్ల  సర్వసిద్ధులు కలుగుతాయి. యధావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయుటలో లోటు కలుగదు. పూర్వం త్వష్ట  అనే బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి గురువు కుటీరం శిధిలమై వర్షం నీరు లోపలకు కురిసింది, గురువు త్వష్టనీ పిలిచి, “నాయనా! కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతుంది, ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించని కుటీరం నాకు కావాలిఅని చెప్పారు. అప్పుడు గురుపత్నినాయనా!, ఎవ్వరూ నేయనిది, కుట్ట నిది, రంగురంగుల ది, సరిపోయేది అయినా రవిక నాకు కావాలిఅన్నది. ఇంతలో గురు పుత్రుడు  వచ్చిఅన్నా, నాకు మట్టి అంటనివి , నీటిమీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవి అయినా పాదరక్షకులు కావాలిఅని చెప్పాడు. ఇంతలో చిన్న పాప అయినా గురుపుత్రిక కూడా వచ్చి, “ అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటిస్తంభం కలిగి, దంతంతో చేసినధై , పగలనిదిగా , తీసుకువెళ్లడానికి వీలుగా నెట్టుకు వెళ్లడానికి చక్రాలు, మళ్లీ ముడిచి వేయడానికి వీలున్నది, అయ్యి అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి ". అంతేకాకుండా ఇతర వంట పరికరములు కూడా కావాలిఅని చెప్పింది.

త్వష్ట  అంగీకరించి, అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువుని ధ్యానించి తన మనసులోనే  ఆయనను శరణు పొందాడు. అలా  పోతుండగా అవధూత కనిపించి, “నాయనా! , నీవు ఎవరు ? ఇంత చిన్న వాడవు? ఘోరమైన అరణ్యములో చింతాక్రాంతుడై తిరుగుతున్నావ్ ఏమి ? అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు  మనసు శాంతించింది తన గురువే రూపంలో. దర్శనమిచ్చినట్లు అనిపించింది. ఆయనకు నమస్కరించి, “స్వామి!  అరణ్యంలో మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది, తను సాధించవలసిన కష్టతరమైన పనులు గురించి విన్నవించుకున్నాడు. అవధూత నాయనా! అభీష్ట ప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాధుని పూజించు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యుకు ఆయన సాక్షాత్తు పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాళువుఅని చెప్పారు. గురు సేవ తప్ప ఏమీ తెలియని త్వష్ట, “స్వామి! కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది”? అని అడిగాడు. అప్పుడు ముని శ్రేష్ఠుడు, “కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుందిఅని చెప్పి అతనిని మనోవేగంతో కాశీ కి తీసుకు వెళ్ళాడు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 42

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

వారిద్దరూ కాశి చేరిన తరువాత త్వష్ట కు అవధూత ఇలా బోధించారు - కాశీ యాత్రలో ముందుగా విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, అంతర్ గృహ యాత్ర, , కాలభైరవ గృహ, కాశి మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగం ప్రతిష్ట చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమైన ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. నీ మనసులో నిస్సందేహంగా గురు చరణాలను స్థిరంగా ఉంచుకో, అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆయన సాక్షాత్తు విశ్వేశ్వరుడు సందేహం లేదు, నేను ఆయనను ఆరాధించుకున్నను, ఆయన ప్రసన్నుడు అవడం కేవలం గురు కృప వలనే కదా! లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు? అనుకుని యధావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ట చేసి ధ్యానించగానే  లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురు భార్య  మొదలైనవారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరం ఇచ్చి, “నాయనా!, నీ గురు భక్తికి మెచ్చాను, నీవు "విశ్వకర్మ" అనే సృష్టికర్తవు అవుతావు అని దీవించి అదృశ్యమయ్యాడు.

త్వష్ట సంతోషించి గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవి సృష్టించి సమర్పించాడు, గురువు సంతోషించి అతనికి జ్ఞానం, సర్వసిద్ధులు, నవ నిధులు, కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు. శ్రీ గురుడు గురు భక్తి గురించి చెప్పేసరికి సూర్యోదయం అయింది. సాయందేవుడు శ్రీ గురునికి   నమస్కరించి ఆనంద పారవశ్యంతో, కృపా మూర్తి! నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనం అయింది. వీరు కథలో కాశి యాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశి క్షేత్రం దర్శించినట్లు అనుభవ మైనది, అది నిధ్రావస్తా లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు! మీ నిజ తత్వము తెలియని మూడులకు మీరు మానవులుగా కనిపిస్తున్నారు కానీ మీరు విశ్వేశ్వరులు, మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ  అంటుంటే అతని శరీరం అంతా రోమాంచిత మై, కంఠం గద్దదమై శ్రీ గురుని అవతార మహత్యాన్ని స్తుతించాడు.

శ్రీ గురుడు సంతోషించి, “నాయనా! నీకు కాశీ దర్శనం అయింది కదా! నీ వంశంలో 21 తరాల వారికి కాశీ యాత్రా ఫలం  సిద్ధించింది, నీవు మా దగ్గర ఉండి మా సేవ చేసుకో కానీ, ఆలా చేయాలంటే నీవు మ్లేచ్చ రాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్య బిడ్డను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారుసాయం దేవుడు ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలు ను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటి గంధర్వ పురం చేరాడు. శ్రీ గురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు  వారి అందరినీ  శ్రీ గురునికి పరిచయం చేశారు.  అతని ఇద్దరు కొడుకులు నమస్కరించి నప్పుడు, అప్పుడు వారి  శిరస్సులపై  చేయి ఉంచి  ఆశీర్వదించాడు , అపుడు శ్రీ గురుడు  సాయం దేవునితో పెద్ద కుమారుడు నాగ నాధుడుని  చూపిస్తూ, ఆయన వీడే నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత, మీకు ఇంకా నలుగురు కొడుకులు కలుగుతారు. “మ్లేచ్చని సేవించడం వలన నీ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండమని , అతని భార్యా బిడ్డలను కూడా ఒప్పించారు. స్వామి! తర్వాత సాయం దేవునితోమొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వద్ధాన్ని సేవించుకుని రా అని చెప్పారు."

ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి, కనుక నది ఒడ్డున అందరూ అనంత వ్రతం చేస్తుండగా శ్రీ గురుడు వీరిని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడుమీరే నాకు అనంతులు మీ పాదసేవే నాకు అనంత వ్రతం, నాకింకా వేరొక వ్రతం ఎందుకు ?”అన్నాడు. స్వామి' నాయనా! నా మాట విని వ్రతం చేసుకో! పూర్వం కౌండిన్యుడు అనే ఋషి  వ్రతం చేసి అభిష్టాలన్నీ పొందారు, అప్పుడు సాయం దేవుడు వ్రత విధానం వివరించమని కోరగా,' శ్రీ గురుడు ఇలా వివరించారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 43

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

  అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు  సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. అనంత వ్రతం,  శుద్ధ చతుర్ధినాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరించాలి. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన: సుమంతుడు అనే మహా ఋషి ఉండేవాడు.

అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె పుట్టిన కొద్ది కాలానికే అతని భార్య దీక్ష దేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి బంగం రాకుండా ఉండేందుకు రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాలి, పోట్లాడుతూనే ఉంటుంది. కొంతకాలానికి తన కుమార్తెకు వేద శాస్త్ర పారంగతుడైన కౌండిన్యుడికి ఇచ్చి వివాహం చేశారు, కానీ అతని భార్య పెట్టే బాధలు ఓర్వలేక, కౌండిన్యుడు వేరొకచోట ఉండాలనుకున్నాడు. అయినా కూతురు కాపరానికి వెళ్లేటప్పుడు దోవ బత్తా నికి కూడా కించిత్తు వేల పిండి కూడా ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆమె చూడకుండా కొంచెం గోధుమపిండి మాత్రం ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపారు

మరుసటి రోజు మధ్యాహ్నం ఒక యేటి వద్ద ఆగి  కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని, అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీర కట్టుకుని పూజ చేస్తుంటే సుశీలాదేవి ఏమని విచారించగా,  తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు.. ఆమె కోరిక మేరకు ఒక ముతైదువ   వ్రత విధానం ఇలా చెప్పింది.

ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరం సిద్ధం చేసుకుని , ఎర్రని చీర కట్టుకుని, ఆకులతో ఒక కలశం స్థాపించాలి. తరువాత ద్వాదశాక్షరీ మంత్రంతో గాని, పురుషసూక్త విధానంతో గాని యధాశక్తి పూజించాలి. తరువాత తోరం కుడిచేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంటలు నివేదించి దక్షిణ తో సహా ఒక వేద విప్రులకు దానం ఇవ్వాలి. ఇలా 14 సంవత్సరములు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్ధాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి సుశీలాదేవి తో కూడా అనంత వ్రతం చేయించింది. తరువాత ఆమె భర్తతో కలిసి బయలుదేరింది , వ్రత మహిమ అన్నట్లు దంపతులకు ఒక పట్టణంలోని వారు ఎదురొచ్చి, వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కౌటిల్యుడు శ్రీమంతుడుగా సుఖంగా జీవించాడు.

ఒకరోజు కౌండిన్యుడు తన చేతికున్న తోరం చూసి, “ఇదేమిటి ? నన్ను వశం చేసుకోవడానికి ధరించవా ఏమి? ”అని అడిగాడు. ఇది అనంత తోరం అని,  దాని మహిమ వల్లనే తమకు సిరిసంపదలు వచ్చాయని చెప్పినా నమ్మక దానిని తెంచి నిప్పు లో పడేశాడు. కొద్దికాలానికే వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అప్పుడు  కౌండిన్యుడు తనతప్పు తెలుసుకుని ఎలాగైనా అనంతుని దర్శించి, ఆయనను శరణ్ పొందనదే భోజనం అయిన చేయనని శబదం చేసి, “అనంతా! అనంతా! అని కేకలు వేస్తూ అడవిలో వెదకసాగాడు, దారిలో ఒకచోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు. అది ఏమి చిత్రమో గాని ఒక్క పక్షి అయిన వాల లేదు. “అనంతుడు ఎక్కడ? అని అడుగగా, చెట్టు' నాకే ఆయన దర్శనం లభించలేదు' అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. మరొక చోట ఒక గడ్డిపరకనై నా కొరకని ఆవును దూడను చూసి , వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. కొంత దూరం వెళ్ళాక రెండు కొలనులు ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది కానీ ఒక్క కొంగ అయినా వాలడం లేదు, తరువాత ఒక గాడిద , ఒక ఏనుగు కనిపించి అవి కూడా అనంతుడు తనకు ఎక్కడా కనిపించలేదు అన్నాయి.

చివరకు అలిసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలి వాడు అతనిని చేయి పట్టి లేవదీసిఅనంతుని చూపిస్తాను రమ్మనిఒక అందమైన రాజభవనంలో సింహాసనం పైనున్న సుందర విగ్రహాన్ని చూపించారు . కౌండిన్యుడు అతడే అనంతుడని  తలచి అతనికి  నమస్కరించాడు. అప్పుడు అనంతుడు, నాలుగు పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ  నివాసం ప్రసాదించారుఅప్పుడు కౌండిన్యుడు అడవిలో చూసిన వింతలు అన్నిటినీ చెప్పాడు. అప్పుడు అనంతుడుపూర్వం ఒక విప్రుడు  విద్వాంసుడైనకూడా వారికి విద్య నేర్వ కుండా, తన కాలమంతా శాస్త్ర వాదాల తోనే  గడిపాడు, అందుకని మరుజన్మలో వ్యర్థమైన మామిడి చెట్టు అయి  అడవి పాలు అయింది. చవిటి నేలను దానం ఇచ్చిన వాడు పశువు అయ్యాడు. శ్రీమంతులై కొంచమైన దానం చేయని వాడు  ఆంబోతు గా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క, చెల్లెల్లు నీవు చూసిన రెండు చెరువులు. క్రోధం వహించినవాడు గాడిది గానూ, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగు గాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు కనుకే వృద్ధుని రూపంలో నేనే నీకు దర్శనం ఇచ్చాను. తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలుపమని కోరాయి కనుకే వాటన్నిటికీ విముక్తి కలిగింది. “నీవు పునర్వసు నక్షత్ర మై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావుఅని ఆశీర్వదించి పంపారు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు.

సాయం దేవా! నీవు కూడా నీగోత్ర ఋషి అయినా కౌండిన్యుని వలె వ్రతం ఆచరించు, తరువాత తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద ఉంచి  వచ్చి తన జీవిత శేషం అంతా గురు సేవలో గడిపి తరించాడు , అందువల్లే నీకీ నాడు కల్పవృక్షం  వంటిశ్రీ గురు చరిత్రలభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంత ధన్యుడవు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

మంగళవారం పారాయణ సమాప్తం!

సోమవారం పారాయణ ప్రారంభం

అధ్యాయం  - 36

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగిని  నామధారకుడు  శ్రీ గురుని గురించి చెప్పమనగా, నాయనా! శ్రీ గురు లీలలు ఎన్నని చెప్పగలను? కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను,  శ్రద్ధగా వినుగంధర్వ పురంలో సత్యవంతుడు అయినా ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో జీవిస్తూ ఉండేవాడు, ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. నిష్ఠతో వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ, తనకున్న దాంట్లో అతిధులను సేవిస్తూ ఉండేవాడు. కాలంలో శ్రీగురుని మహామకి ఆకర్షించబడిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఒక సంవత్సరం ఒక శ్రీమంతుడు గ్రామస్తులు అందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. అతని భార్యకు మంత్రం అటువంటి సమారాధన లకు వెళ్లి, భోజనము దక్షిణాలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడి ఎప్పుడు వల్లే సారి కూడా ఒప్పుకోలేదు. అతడునేను రాను, నీకింత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడేమి శ్రీమంతుడు నీతోనేనొక్కడే అయినా రావచ్చు? అడిగితే దంపతులే రావాలన్నారు. భర్త పై కోపం శ్రీ గురుని వద్దకు వెళ్లి తన బాధను వెల్లబోసుకుంది, తన భర్త కూడా రోజు సమారాధన కు వెళ్లేలా  ఆదేశించామని కోరింది. శ్రీ గురుడు నవ్వి  ఆమె భర్త ని పిలిపించిఈరోజు నీవు సమారాధన కు వెళ్ళు, భార్య కోరిక తీర్చడం భర్తయొక్క ధర్మం”, అని చెప్పగా అతడు ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.

ఆనాడు అతడు మొదటిసారిగా సత్రంవద్ద వందలాది   బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే దంపతులిద్దరికి అక్కడ విస్తళ్లలోను, మరికొందరు విస్తళ్లలోను ఉన్న అన్నాన్ని ఒక్క కుక్క, పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనం అయింది. ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా దడిలోంచి ఒక కుక్క వచ్చి అన్నపురాశిని ముట్టుకొన్నది, వెంటనే ఒకరు తరిమివేసి వడ్డన కొనసాగించారు. ఆమె భర్త తలబాదుకునిబుద్ధిలేనిదాన! నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది! అని విస్తరి ముందు నుంచి లేచిపోయాడు. అతడు బాధపడుతుంటే శ్రీ గురుడు పితృకార్యముల భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానానికి భోక్తగా   వెళ్లినందువల్ల ఎట్టి దోషం ఉండదు అని చెప్పారు. అప్పుడా విప్రుడు, “స్వామి! , ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదు దయతో వివరించండి అని కోరాడు.

గురువులు మేనమామలు, ఆచార్యవంతులై వేదవిధులు, అత్తామామలు తోబుట్టువులు, పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవా చేయించుకునేవాడు భార్యబిడ్డలను ఏడిపించి, పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాలు కోరు, క్రోధ వంతుడు, భార్యని విడిచి పెట్టిన వాడు, క్రూరుడు , పిసినారి, దురాచారి, స్నానం చేయకుండా భోజనం చేసేవాడు, కనీసం సంధ్యావందనం అయినా చెయ్యనివాడు మొదలైనవి - ఇలాంటి వారిని భోజనం తిన్నవారు పతితులౌతారు. ఇలా చేయుట స్వధర్మమాచరించేవారికి దేవతలు, సిద్ధులు కామధేనువు గూడా సేవిస్తూ ఉంటాయి. అని శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

అధ్యాయం  - 37

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

 సిద్ధ యోగి ఇలా చెప్పారు, “నామధారకా ! శ్రీ గురుడు సబ్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు . మానవులు మూడు కాలాలలో ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకు అవకాశం లేకుంటే ఉదయం షోడశోపచార పూజ ,మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనం అయినా సమర్పించాలి మానవ జన్మ లభించి గూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తరవాత మానవజన్మ రావటం కష్టం.అన్నిటిలోకి గురుపూజ శ్రేష్టం, భక్తితో పూజించగలిగితేచాలు రాయి, చెక్క గూడా దేవుడైఅభిష్టాలు ప్రసాదించగలవు.

పేట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయమము చేసి, పూజ ద్రవ్యాలు సిద్ధం చేసి వాటిని ప్రోక్షించాలి. ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహంముంచి, కుడివైపు శంఖం, ఎడమవైపు గంట ఉంచి, దేవుని మీద నిర్లక్ష్యం తొలగించి, దీపమెలిగించాలి. మొదటి గణపతిని పూజించి, గురువును ,తర్వాత పీఠాన్ని ,ద్వారపాలకులను పూజించాలి. సాక్షాత్తు భగవంతుడే ఎదుటనుండి మన పూజలు గమనిస్తున్నాడని గుర్తించుకోవాలి.  తల్లిదండ్రులు, పూజలు పెద్దలకు చూచినప్పుడు వారి పాదాలకు నమస్కరించి, గురువు యొక్క కుడి పాదాన్ని కుడి చేతితో, ఎడమ పాదాన్ని  ఎడమచేతితో  స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒక్క చేత్తో ఎవరికి, ఎప్పుడు నమస్కరించకూడదు.

గృహస్థుల ఇండ్లలో - కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన కలిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు , పితురులకు మొదలగు వారికి అర్పించి మిగిలినది మహా ప్రసాదం అన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్యదేవం అంటారు. మొదట కుడి ప్రక్కన చిత్రగుప్తుని కి బలిగా కొంచెం అన్న ముంచి  తరువాత భోజనం చేయాలిసూర్యాస్తమయమప్పుడు  సంధ్యావందనం, హోమముచేసి, గురువుకు నమస్కరించాలి, రాత్రి తేలిక గా భోజనం చేసి, కొంతసేపు సద్గ్రంధాలు చదువుకుని,  తర్వాత తాను రోజు చేసినవి స్మరించుకుని, భగవంతునికి నమస్కరించాలి. ఇటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడు భోజనం చేయకూడదుభోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువల్ల ఇహంలోనూ, పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది. అని శ్రీ గురుడు బ్రాహ్మణుడితో చెప్పారు. బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ  ఇంటికి వెళ్ళిపోయారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా !!

అధ్యాయం  - 38

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామధారకుడు, “స్వామి, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్టాన రహస్యం  మీనుండి విని ధన్యుడనయ్యాను, ఇక అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండిఅని వేడుకున్నాడు. సిద్ధ యోగి ఇలా చెప్పారు నాయనా!  నీవంటి గురుభక్తుడు,  శ్రోత లభించిన అందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివితీర స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది.

శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో  గంధర్వ నగరం వచ్చేవారికి బిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒక్కసారి కాశ్యపస  గోత్రానికి చెందిన భాస్కర  శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి సరిపడే ధాన్యం మొదలగునవి మాటకట్టుకుని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు, కానీ ఆరోజు అందరితోపాటు అతని కూడా ఎవరో భక్తులు సంతర్పణ ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట  మఠం లో ఉంచి, భోజనానికి వెళ్లాడు. రోజు ఇలానే జరుగుతుండడం వల్ల మూడు మాసాలు అలాగే గడిచింది. అతనిని చూసిన బ్రాహ్మణులుఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చినాదెందుకు ? చేస్తున్నదేమిటి? నీవు బిక్ష ఇవ్వడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు? పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి  లావేక్కావు, సిగ్గు వేయడం లేదా? అని ఎగతాళి చేశారు.

కొంతకాలం భాస్కర శర్మ  తనని కాదానట్టు కాలక్షేపం చేస్తున్నాడు. వారి నోట, వీరి నోట విషయం శ్రీ గురునికి తెలిసి, భాస్కరశర్మన పిలిపించినాయనా, నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు బిక్ష సమర్పించుఅని ఆదేశించారు. అతడు  మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి నెయ్య ,పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్టానాలు పూర్తిచేసుకుని, తను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తుండగావేరొక భక్తుడోచ్చి తానారోజు స్వామికి భిక్ష  సమర్పించాలనగా, శ్రీ గురుడు తాము ఈరోజు భాస్కరశర్మ ఇచ్చిన బిక్ష  తీసుకుంటామని, అతడు మరొక రోజు బిక్ష  చేయవచ్చని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యా! ఇప్పుడి ఈ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా? ఈరోజు ఎవరి  కొంపకి వాళ్ళు వెళ్లి భోజనం చేయవలసిందే! అనుకుంటూ వెనక్కి తిరుగగా, శ్రీ గురుడు మాటలు వినినాయనలారా! ఈరోజు మీరెవరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు, మీరందరూ భార్య బిడ్డలతోను, స్నేహితులతోనూ కలిసి మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండిఅని అన్నారు. అందరూ వారి ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యం కదా! ఎవరికి తెలియదు. కనీసం శ్రీ గురున్నికైన కడుపునిండా పెట్టగలిగితే  అంతే చాలు, పో పో అన్నారు. అప్పుడు శ్రీ గురుడు ఈరోజు ఇక్కడ నాలుగు వేల మందికి సమారాధన చేయాలి, అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి. మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని సంతర్పణకు రావాలి, అని భాస్కరశర్మతో ఏమయ్యా, చూస్తావేమిటి? నమస్కరించి అందరిని ఆహ్వానించుఅన్నారు. అతడు లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతోకలిసి తాను చెయ్యనున్న సమారాధనకు విచ్చేసి, తనను కృతార్ధుడను చెయ్యమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, “ఓరి వెరీ బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగదునుకుని, నీవుపిలిస్తే వచ్చామట్టయ్య? నీవు చేసినది ఒకరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా? అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి, “తప్పు, అతనిని నిందించవద్దు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు' అని మందలించాడు. భాస్కరుడు శ్రీ గురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు . అప్పుడు  శ్రీగురుని ఆజ్ఞాకోరగా, శ్రీ గురుడు వస్త్రంమీచ్చి, దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. భాస్కరశర్మ, మరికొందరు తిరిగి తిరిగి తిరిగి వడ్డీస్తున్నారు, నెయ్యి కూడా దారలుగా వడ్డిస్తున్నారు. చివరికి  ఊర్లో  విచారించి భోజనం చేయని వారు ఎవరు లేరని నిర్ధారణ చేసుకున్నాక, శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం సేకరించారు. అప్పుడతడు వెళ్లి చూడగా అతడు వండిన వంటకంఅంతా అలాగే ఉన్నదని స్వామికి చెప్పగా, దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికి తెలిసింది . అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారు మ్రోగింది.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!! 

సోమవారం పారాయణ సమాప్తం !

ఆదివారం  పారాయణ ప్రారంభం

అధ్యాయం  - 30

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామధారకుడు, స్వామి! నాకెన్నో శ్రీ గురుని అపురూపమైన అంశాలు తెలుపుతారు. ఇట్టి నీ బుణం ఎన్నటికైనా తీర్చకోగలను, అటు తర్వాత! ఏమి జరిగిందో  తెలుపమని అని ప్రార్ధించాడు!

 నామధారకా! శ్రీ గురు లీలల అన్ని చెప్పడం ఎవరి తరం కాదు , నాకు చేతనైనంత  వరకు చెబుతాను, విను. శ్రీ గురుడు చూడటానికి మానవుని వల్లే కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమ బట్టి త్రిమూర్తులువతారమన్న కీర్తనలు అన్ని దిక్కుల వ్యాపించినది, భక్తులు నీ ఎంతో దూర ప్రాంతాల్లో నుంచి వచ్చి, దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారికి సంతానం, రోగులకు ఆరోగ్యం. అని పొందుతారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతం చెబుతాను విను అన్నారు.

మహురపురం  లో గోడేనాధుడు (ఉరఫ్ గోపీనాథ్ నాయుడు) సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. దుఃఖం భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. స్వామి అనుగ్రహం వలన మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుని పేరు పెట్టుకున్నారు. అల్లరి ముద్దుగా పెరిగి  ఐదవ ఏటా ఉపనయనం, పన్నెండవ సంవత్సరంలో రూపవతి,సుగుణాలరాసి  అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. దంపతులు సుగుణాలలోనూ, సౌందర్యంలోనూ సమానులై రతి మన్మదులవలె  సుఖిస్తూ, ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్త జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా పిల్లవాడికి 16, సంవత్సరం లోనే తీవ్రంగా జబ్బు చేసింది. అది మూడు సంవత్సరాల్లోనే క్షయ  వ్యాధిగా పరిణమించింది  .  భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అలంకారమే చేసుకొనగాపాత చీర ధరించేది. జుట్టుడువ్వుకొని పోయే సరికి  జుట్టు జడల  కట్టింది. అత్తామామలు ఎంత వారించినా వినకుండాభర్త ప్రత్యక్ష దైవమని సేవిస్తూ ఉండేది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి, కానీ దత్తుని  పరిస్థితి కొంచెం కూడా మెరుగు కాలేదు సరిగా అందరూ ఆశలు వదులుకున్నారు.

దత్తుడు తల్లిదండ్రుల దుఃఖించి దత్తాత్రేయ స్వామిని  తలిచిస్వామి! దత్తాత్రేయ! నిన్ను సేవించి కొడుకును పొంది వెనకటి దుఃఖం మరిచాము, ఇప్పుడు ఇతను దక్కకుంటే ఏమి చూచుకొని బతకాలి? దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారినిఊరడిస్తూమనకు ఎంత ఋణానుబంధం ఉంటుందో  అంతవరకే ప్రాప్తముంటుంది కానీ , అంతకుమించి ఆశ పెట్టుకుంటే దక్కదని? కనుక నా కోసం దుఃక్కించవద్దు అని చెప్పి, తన తల్లితో నీవు  నాకొక్క గడియ సేపు పాలిచ్చిన రుణమైన తీర్చుకోలేక పోయాను,నేను కష్టాలే తెచ్చి పెట్టాను, అంటుండేవాడు.

దత్తుడు తన భార్యతో “ప్రేయసి , నాకు ఇంకా కాలం తీరుపోతున్నది, నీవు నాకు చేసిన సేవకు, నాకోసం పడ్డ  కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువుని కాబోలు , నేను ఇలా బాధిస్తున్నాను! ఇకముందు నీకు భయపడకు నా తల్లిదండ్రులు నిన్ను కూతురిల్లా చూసుకుంటారు, నీకు ఇష్టం లేకపోతే నీవు ఇంటికి వెళ్ళవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు లేదు. నన్ను కట్టుకున్న క్షణంలోనే ని సౌభాగ్యం మంటగలిసింది, అని బాధపడుతుండగా , సావిత్రి ఆ మాటలు భరించలేక స్వామి నేను మీ అర్ధ భాగాన్ని మీరు లేకుంటే నా శరీరం లో ప్రాణం ఉండదు , మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే వుంటాను , అంటుండేది.మీకు ఏ భయంలేదు , అందరం కలిసి భగవంతుని ప్రార్దిధ్ధాము అని తల్లితండ్రులకు ధైర్యమ్ చెబుతుండేది సావిత్రి ఒకసారి గాలిమార్పుకై అతనిని ఎక్కడికైనా  తీసుకువెళ్లాలి అనుకున్నది. అప్పుడొక గ్రామస్తుడు మీరు దత్త భక్తులు, కదా! దత్తావతారమైన  శ్రీ గురుని  వద్దకు వెళ్ళండి , మంచి జరుగుతుంది అని చెప్పారు.

సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో పడక ఏర్పాటు చేసి, మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడ పల్లకి దించి శ్రీ  గురుని గురించి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేయడం వల్ల రోగ బాధ తీవ్రమైన అవసాన దశ వచ్చిందా అన్నట్లు  గిలగిలా  లాడుతున్నాడు. గంధర్వపురంలో పల్లకి ఒక చోట దించి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీ గురుడు ఎక్కడ ఉంటారని విచారించగా అనుష్టానానికి సంగమం వదిలి వెళ్లారు అని చెప్పారు. అతనిని అక్కడికి తీసుకు వెళ్దామని పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం! ఆమె గుండెలు బాదుకుంటూ, బాధ భరించలేక ఆమె కత్తితో పొడుచుకోపోతే అక్కడి వారందరూ వచ్చి అడ్డు వచ్చి ఆపారు. “ఓ గురు మూర్తి! రక్షకుడు అని తలచి గంపెడుఆశతో ఇంతదూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను, కానీ దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడినట్లు, నీడను చేరబోయి న వాణి మీద చెట్టు విరిగి పడినట్లు, ఎక్కడికే మంచినీటికి పోయిన వాడు ముసలి నోట పడ్డట్టు, నా భర్తను బతికించుకోవాలని వచ్చి నేను అతనిని పోగొట్టుకున్నాను. ,తల్లిదండ్రులకు దూరంగా దేశం గాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేస్తాను. చిన్నప్పుడు గౌరీ వ్రతం వివాహం అయ్యాక భవాని  పూజలు, అఖండ సౌభాగ్యం వ్రతం అని ఎంతో  శ్రద్ధగా చేశాను. పుణ్యమంతా ఏమయింది? నా మాంగల్యం రక్షణ కోసం నా నగలు అన్ని వదులుకున్నాను, అందుకే చివరికి నాకే పసుపుతాడు అయిన దక్కలేదు? అని దుఃఖిస్తూ శవం మీద పడి లేకుండా నేను ఎలా బతకాలని? నేను కూడా  మీతో వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది.

అసలు నువ్వు ఎవరు? ఎక్కడనుండి వచ్చావు చెప్పు. ప్రవాహంలో ఎక్కడ నుండి వచ్చి కలుసుకున్న కట్టెల లాగా  భూమిపై జీవులు లో కలుసుకుంటారు . కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పుట్టినవాడ, చనిపోయినవాడు వాటిలో ఎక్కడ ఉన్నారు? అతడు ఎవరు?మాయావశులై ,అలాంటి జీవులనునావి నా వాళ్లుఅనుకోవడం భ్రాంతి. శరీరమే నీ భర్త  అనుకొని  , “నేను, నాది అనుకోవడం సరియేన?  ఇంతకూ నీవు శోకించేది, ఇటువంటి తోలు బొమ్మలు కోసమే కదా? ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని ఈ  జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో! అని పలు విధాలుగా హితబోధ చేశారు. “ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని , ఆ ముని పాదాలకు నమస్కరించి ,స్వామి! నాకు ఎలాగైనా  తరుణోపాయం  చెప్పండి, మీరు చెప్పినట్లు చేస్తాను. దయ సాగరా ! నాకు నీవే  తల్లివి, తండ్రివి నేను  సంసారం నుంచి తరించే మార్గం ఉపదేశించండిఅని వేడుకున్నది .

అధ్యాయం  - 31

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

యోగీశ్వరుడు సావిత్రి తో ఇలా చెప్పాడు, సాధ్వి! స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను. పూర్వం కాశీలో ఒక అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవాడు. మహర్షి తపస్సుకు, ఆమె ప్రాతివత్యనికి మెచ్చి వింద్యాచలుడు వారిని గొడుగు వల్లే నిలిచి ఉండే వాడు. ఒకరోజు త్రిలోక సంచారియైన  నారదుడు వింధ్యునితో  పర్వత రాజా ! నీకు సాటి అయినా పర్వతఇంకోటిలేదు. అయితే నేమి నీవు మేరునితో మాత్రం సమానం కాలేవుఅన్నాడు. వింధ్యుడు రోషంతో మీరు పర్వతాన్ని మించిపోవాలని పెరగ సాగాడు , ఆ పర్వతానికి  దక్షిణంగా ఉన్న ప్రాంతం చీకటి మయమైంది సూర్య దర్శన లేమి వలన ప్రాంతంలో ప్రజలు నిత్యకార్మాచరణ తారుమారు అయింది. అప్పుడే బ్రహ్మకు  విషయం విన్నవించగా, బ్రహ్మదేవుడు అగస్యమహర్షి ని దక్షిణ దేశానికి వెళ్లేలా చేయమని ఉపాయం చెప్పాడు. అప్పుడే ఇంద్రుడు దేవతలందరితో  కలిసి బుషీ దంపతులును దర్శించి పూజించారు. అప్పుడుమహా పతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ మహిమకు  కారణమైన పతివ్రత ధర్మాలను బృహస్పతి ఇలా చెప్పాడు.

“స్త్రీలు ఎల్లపుడు తమ పతిని శ్రీహరి గా  భావించి సేవ చేయాలి, విసుగు అన్నది లేకుండా అతిథులను ఆదరించాలి, భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంతవరకు పొరుగు ఇళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తలవంచుకుని వెళ్లాలి. దుస్సిలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు, ఉత్సవాలకి, యాత్రలకి ఒంటరిగా వెళ్లకూడదు. భర్త లేనప్పుడు స్త్రీ అలంకరించుకో కూడదు, బయటనుంచి వచ్చిన భర్తకు సంతోషంగా ఎదురేగి కాళ్లు కడిగి, తుడిచి,  విసిన  కర్రతో వీచి  సేద తీర్చాలి. భర్తకు హిత కరమైన భోజనం పెట్టి, అతని  ఉచ్చిష్టనాన్నే ప్రసాదంగా భుజించాలి. భర్త నిద్రించాక   నిద్రపోయి , అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు విచారంగా నూ, భర్త విచారంగా ఉన్నప్పుడు సంతోషంగా ను ఉండకూడదు. భర్త కోపించిన అప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ,ఉపవాసాలు చేయకూడదు. భర్త ఆయుషా భివృద్ధికి పసుపు, కుంకుమ, మంగళసూత్రం భక్తితో ధరించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైన అతనిని పరమేశ్వరుడు గా భావించి అతనినే  పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు.

ఇలాచేయక యదేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యం అంతా నశించింది నరకానికి పోతుంది. పతివ్రతల పాద ధూళితో గాని వారి పాపం నశించదు. ప్రతివతలు వల్లనే వంశమంతా ఉద్దరించే పడుతుంది.7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమె సాంగత్యంతోనే అన్ని పురుషార్దలు సిద్ధిస్తాయి.అటువంటి భార్య లేకుంటే యజ్ఞంమొదలైన ధర్మాలు సఫలం కావు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు . ఆమె లేని భవనం అయిన అడవి తో సమానం. ఆమె సహచర్యం వల్ల ఏడు న్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతలను దర్శించడం వల్ల కలుగుతుందిఅన్నారు.

అధ్యాయం  - 32

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

 బృహస్పతి ఇంకా  ఇలా చెప్పారు. “దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు. భర్తతో సహగమనం చేయటం ఉత్తమం, కానీ భర్త దూరదేశంలో ఉన్న, ఆమె గర్భవతి అయిన లేక ఆమెకు పాలు తాగి బిడ్డ ఉన్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు, అటువంటి స్త్రీ  యావజ్జివితము  విధవా ధర్మం పాటించిన కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విదవా ధర్మాలు ఎంత పుణ్య ప్రధానమైనవే. ఆమె  జట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం, లేకుంటే జట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. ఆమె ప్రతినిత్యం తలస్నానం, ఒక పూట భోజనం  చేస్తూ ఉండాలి లేకుంటే చంద్రాయనవ్రతం ఆచరించడం శ్రేయస్కరం. మూడు రోజులకో, వారానికో,  పక్షానికో ఉపవాసం ఉండాలి. ముసలితనం, రోగం వల్ల ఇలా చేయకపోతే రెండో పూట, పాలు పండ్లు  యావజ్జివితం సేవించవచ్చు. మంచం మీద నిదురించిన పతితో కలిసి నరకానికి పోతుంది. తనకున్న పరుపు మంచం పేదలకు దానం ఇవ్వాలి, రంగు చీరలు ధరించక, తెల్లని వస్త్రం మాత్రమే ధరించాలి.

వైశాఖ మాసంలో జలదానం, కార్తీకమాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి, నువ్వుల దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవిలో చలివేంద్రం పెట్టించాలి  విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందెనేతితో నింపిన కంచు పాత్ర బాగా పాలిచ్చే కపిల గోవు, యధా శక్తి బంగారం, దీప మాలిక  దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

వేద విధులకు  పాద్యమిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పళ్ళు దానమిచ్చి తన భర్త పేరిట కి వారికి ఆపోసన  ఇవ్వాలి. ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతి సహగమనంతో సమానం అవుతుంది.

బృహస్పతి చెప్పిన ధర్మాలతో  స్త్రీలకు రెండు మార్గాలు ఉన్నాయి. ధైర్యం గలవారు  సహసహానం చేయవచ్చు. కనుక అమ్మాయి! నీవు శ్లోకం వీడికి, నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు ఆమె యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరు ఎవరు లేరు, ఇంత దూర ప్రాంతంలో ఒంటరి అయినప్పుడు మీరు తారసిల్లారు , యుక్త వయసులో ఉన్నప్పుడే నాకు  వైద్య  ధర్మం ఆచరించడం  కత్తి మీద నడకవంటిది యవ్వనం, సౌందర్యం గల వారికి లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనం మంచిది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండిఅని నమస్కరించింది. ఆయన త్వరలో నీ భర్తను కలుస్తాం అని ఆశీర్వదించెను, నీవు ఎంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగరానిది జరిగింది,  నీవు ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని  దర్శించి, తర్వాత కర్తవ్యం అని చెప్పి, యోగీశ్వరుడు  శవం తల మీద బస్మముంచి,  ఆమెకు 4 రుద్రాక్ష ఇచ్చి, వీటిలో 2 అతని మెడలో, చెవుల కొకటి కట్టి, రుద్ర సూక్తాలతో గురు పాదాలు అభిషేకం ఇచ్చిన జలం తెచ్చి , శవం మీదా చెల్లి తరవాత సహగమనం చెయ్యవచ్చుఅని చెప్పి వెళ్ళిపోయారు.

అప్పుడు ఆమె పసుపు, కుంకుమ అలంకరించుకుని, అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్లింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మి లా అలంకరించుకుని సహగమనానికి వెళుతుందని తెలిసి ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్లి “ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించ రాధా?అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోయింది.

అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి వచ్చిన వారికి వాయనాలు,సద్బ్రాహామానులకి దండిగా దక్షిణలు సమర్పించి నమస్కరించి, “తల్లులారా! విప్రోత్తములారా! మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుని దర్శనం కోసం వచ్చాను, కనుక వారిని దర్శించి వచ్చి సహనం చేయడం ధర్మమని తోస్తున్నది, నేను వెళ్లి రానా? అన్నది. అప్పుడు వారు “అమ్మ!, సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో!” అన్నారు.

ఆమె శ్రీగురుని దర్శనానికి మెల్లగా నడుస్తూ మనసులోస్వామి! మీరు సర్వేస్వరులు. మీరు భక్తుల పాలిట కల్పవృక్షం అని విని, నా భర్తను బతికించుకొని సంతాన పొందాలని ఇంత దూరం నడిచి నీ వద్దకు వచ్చాను. నేను ఏమన్నా పాపం చేశానో కానీ, అందరికీ అబ్బిన సౌభాగ్యం, సంతానం మాత్రం నాకు కరువవడమే కాక   దుస్థితి కలిగిందిఇంత ఆశపెట్టుకొని వచ్చినందుకు అన్ని బాగా జరిగాయి, మిమ్మల్నిఆశ్రయించిన  వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది, కీర్తి పరలోకానికి కూడా తీసుకుపోదలిచి  నా భర్తతో కలిసి వెళ్ళిపోతాను.

ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్లి దేదీప్యమానమైన, శ్రీ గురుని మూర్తి కనిపించగానే అపారమైన భక్తితో ఆయనకు సాష్టంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీ గురుడు ఆమెనానిత్య సౌభాగ్యవతి బావ! అని ఆశీర్వదించారు!! అచ్చటి వాళ్ళు అందరూ తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకరు సాహసించి  “ స్వామి !  ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించారు. అతని శవం కూడా స్మశానం లో ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది? అన్నాడు. అది విని ఏమి తెలియనట్టుఅలాగా ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే, ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము చూస్తాం! అగ్ని సంస్కారం నిలిపివేసి, ఇక్కడికి తీసుకు రండి, మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు" అన్నారు. అందరూ ఆశ్చర్యపడి శవాన్ని అందరు అక్కడికి తీసుకు వచ్చారు. వెంటనే శ్రీ గురుడు శవానికి కట్లు విప్పించి ఆయన పాదోదకం శవంపైచల్లి తమ అమృతదృష్టితో శవం కేసి చూశారు. అందరూ చూస్తూ ఉండగానే శవంలో కదలిక  వచ్చి , మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు! అతడు  సావిత్రితో, ప్రేయసి! నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పడితే లేపనన్న లేపలేదు ఏంటి అన్నాడు.

సావిత్రి ఆనందభాష్పాలు రాలుస్తూ జరిగింది చెప్పిమన పాలిట పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీ గురు డే”! అని చెప్పి, దంపతులు ఆయనకు సాష్టంగం పడి  ఆయన పాదాలు అభిషేకించారు.చనిపోయిన దత్తునికి ప్రాణం పోసి సావిత్రికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించిన శ్రీ గురుని కీర్తిని అచ్చటి వారు అందరు ఇలా  జయ జయ ద్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు.

కానీ అందరిలో ఒక దూర్తుడు స్వామిముందుకు వచ్చి' నాకు ఒక సందేహం ఉన్నది, నొసటి  వ్రాత మార్చడంఎవరి తరం కాదని వేద శాస్త్రాలు, చెబుతున్నాయి. బ్రహ్మ వ్రాత నిజమే అయితే చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికారుఅన్నాడు. స్వామి నవ్వి  బ్రహ్మ అనుమతి తోనే మరు జన్మ లోనే కొంత జీవిత కాలాన్ని ఈ జన్న్మకు మార్చాము . అంతగానే, విధివ్రత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్యదృష్టి ప్రసాదించి సత్యం  దర్శింప చేస్తారు. సూర్యాస్తమయానికి శ్రీగురుడు దంపతులను  వెంటనే తీసుకొని సంగమానికి చేరుకున్నారు..,

అధ్యాయం  - 33

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామధారకుడి తో  సిద్ధుడు ఇంకా ఎలా చెప్పారు, “దత్తుడు, సావిత్రి ఆరోజు అక్కడ నిద్ర  చేసి , ఈరోజు తెల్లవారు జామున స్నానం చేసి శ్రీగురుని దర్శించారు. అప్పుడే సావిత్రి స్వామి! నేను దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోబోయినపుడు ఒక యోగీశ్వరుడు వచ్చి  ఈ ధర్మం ఉపదేశించి, రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు?  ఆయనవల్లే మాకంతటి మహా భాగ్యం కలిగింది. మరల వారి దర్శనం ఎక్కడ లభిస్తుంది అనగా శ్రీ గురుడు నవ్వులు చిందిస్తూఅమ్మాయి! నీ పతి భక్తుని చూడదల చి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చి మీకు  మహిమ  గల రుద్రాక్షలు ప్రసాదించాను. వాటివల్ల నీ కిట్టి అభయం లభించింది. మీరు నాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాను.

పూర్వం కాశ్మీర దేశంలో భద్ర సేనుడు అనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సద్గురుడికి  కొడుకు ఉండేవాడు. వారంతో ప్రేమతో మసులు కుంటూ, ఎట్టి  ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసిన వారు కాదు, ఒకనాడు పరాశరమహర్షి రాగా రాజు ఆయనను పూజించి,  వారిద్దరి  విచిత్ర వైఖరికి కారణమేమి చెప్పమని ప్రార్థించాడు. మునిరాజా! పూర్వజన్మలో వీరు మహానంద అనే వైశ్య ఇంటిలో కోతిగా, కోడిగా పుట్టారు. ఆమె గుణవంతురాలు, స్వేచ్చాచారినిగా  జీవించ పెద్దల వలన , సకల ధర్మాలు తెలుసుకుని దానధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. తమ నిత్యం అలంకరించుకుని మంటపంలో నాట్యం చేసేది, ఆమె వినోదం కోసం కోతికి, కోడికి రుద్రాక్షలతో అలంకరించేది.

ఒకనాడు మహాధనికుడు, శివ వ్రత దీక్షితుడు అయినా ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆయన విభూతి, రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్న లింగము ఉన్నాయి. దానిని చూసి ఆశ పడగా,  వైశ్యుడు  ఆ వేశ్యాతనను సంతోషపెట్ట  కలిగితే ఆ లింగం ఇస్తానన్నారు. ఆవేశం అందుకు ఆమె సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మమును అనుసరించి అతనిని చేయించ గలను అని చెప్పి ఆ లింగం పై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి , “ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరి పోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధగా పూజించింది.

ఇద్దరూ కలిసి రాత్రికి అంతఃపురానికి వెళ్లే సరికి, అదేమి చిత్రమో గాని, నాట్య మండపం క్షణంలో బస్మంమై , కోడి, కోతి కూడా బూడిద అయిపోయింది. తెల్లవారి అది తెలిసిన  వైశ్యుడుఅయ్యే ! నా ప్రాణం లింగమే పోయింది! నేను ఇంకా బతకను అని ఏడుస్తూ, ఎంత వెతికిన  లింగమే దొరకలేదు, అప్పుడు అతడు ఒక చితి వెలిగించి మంటలలో దూకాడు. అతని వెంటనే వైశ్య కూడానాధా  ! అని కేకలు వేస్తూ సహగమనం చేయడానికి సిద్ధమయింది. ఆమె బంధువులు వారించి, వైశ్య వైనా నీకు ఇదేమి వెర్రి? అనగా సూర్య చంద్రులు సాక్షిగా ప్రాతివత్యం అవలంబిస్తానని ప్రమాణం  చేశాను, నాకు ఇదే ధర్మం, నేను సహగమనం చేయకుంటే, నాతోపాటు నా 21 తరాలు వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తాను అని దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి , నీ ధర్మ గుణాన్ని, ప్రాతివత్య గుణాన్ని  పరీక్షించడానికి నేను వైశ్యుని రూపంలో వచ్చాను.  నీకు ఇచ్చినది నా ఆత్మ లింగం, మండపానికి నేనే నిప్పుపెట్టి పరీక్షించాను. నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకో! అన్నారు' స్వామి, నాకి ముల్లోకాలలోట్టి భోగం అక్కర్లేదు. శాశ్వతమైన శివసామ్రాజ్యం ప్రసాదించుఅని ప్రార్థించగా, శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన కోడి, కోతి  ఈ  బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మల సంస్కారం వల్ల శివభక్తులై రుద్రాక్షలు , భస్మం ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలవి   కానిది”, కనుక సాద్వి, రుద్రాక్ష ఇంత  మహిమ గలదిఅని శ్రీ గురు చెప్పారు.

అధ్యాయం  - 34

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

రాజు పరాశర మహర్షికి నమస్కరించి, “స్వామి!  బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజు పుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు ఇంత శ్రద్దా భక్తితో ధరిస్తున్నందుకు ఎంత ఫలితం ఉండబోతుంది? అనగా మహర్షి ఆలోచించి నిట్టూర్చి” రాజా! వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది, రోజు నుండి ఎనిమిదవ రోజు వారు మరణించి వలసిన ఉన్నది అన్నారు. అది విని ఎంతగానే దుఃఖిస్తూ, దానికి నివారణోపాయాలు చెప్పమనగా మహర్షి ఇలా చెప్పారు. భయం లేదు, శ్రీమన్నారాయణుడు  బ్రహ్మను సృష్టించి, అతనికి ప్రసాదించిన వేదంయొక్క సారమే రుద్ర మంత్రం.

 ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ పాపాలు ప్రసాదించే లేవు. పూర్వం రుద్ర మంత్రం వలన పాపులు కూడా పరిశుద్ధులు అవుతున్నారని యమధర్మరాజు బ్రాహ్మకి వినిపించుకొన్నాడు. అప్పుడు బ్రహ్మ, “యమధర్మరాజా! మధాందులు , తామసులు  భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్ర జపం జపించే వారి దగ్గరికి వెళ్ళనే కూడదు. అల్పాయువు గల వారు దీని వలన దీర్ఘాయువు పొందగలరు. కనుక రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి , 7 రోజులు నిరంతరం రుద్రాభిషేకం చేయించు . అప్పుడు వారు దీర్ఘాయువు సరిసంపదలతో జీవించగలరు అని చెప్పారు.

రాజు వందమంది సద్బ్రాహ్మణుల చేత పదివేల రుద్ర మంత్ర గానంలో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతత ధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యం ఆ అభిషేక జలంతోనే రాజు కుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం బిడ్డల ఇద్దరు సృహతప్పిపడిపోయారు. అప్పుడే పరాశర మహర్షి రుద్ర మంత్రజలం వారి మీద చల్లగానే వారు లేచి కూర్చున్నాడు. బిడ్డల ప్రాణాలు అర్పించడానికి వచ్చినాయి యమదూతలు శివదూతలు వచ్చి తరిమివేసి, రాజకుమారుని బతికించారు అని చెప్పారు. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యానమంటే అంత ప్రీతి. కనుక నామధారకా, నీవు నిత్యం రుద్రాభిషేకంతో శ్రీ గురుని పూజించు! అని సిద్ధుడు చెప్పాడు.

అధ్యాయం  - 35

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. “సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి "స్వామి! నిరంతరం మీ పాదాలను స్మరించేoదుకు సాధనంగా నాకొక మంత్రముపదేశించి  అనుగ్రహించండి. అని వేడుకొన్నది. శ్రీ గురుడు, “అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడంకుంటే మోక్షానికి మరొక మార్గం లేదు. స్త్రీలకు మంతోప్రదేశం చేయకూడదు

పూర్వం శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులందరిని మృతసంజీవనీ మంత్రంతో బతికించి దేవాసుర యుద్ధానికి పంపుతున్నాడు. మంత్రమైనా స్త్రీకి ఉపదేశంఇస్తే నిర్వీర్యమవుతుందని , అందులో మృతసంజీవనీ మంత్రం మూడవ వానికి ఉపదేశించగానే పోతుందన్న విషయం శివుడు బృహస్పతికి చెప్పి అతనికి ఒక ఉపాయం చెప్పాడుబృహస్పతి  కొడుకు కచుడు శుక్రాచార్యుల వద్ద శిష్యునిగా చేరాడు. శుక్రాచార్యుల కుమార్తె దేవయాని కచుని మోహించింది, కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకుని రాక్షసులు కచుని చంపగా దేవయాని కోరికమేరకు శుక్రాచార్యుడు రెండు మూడు సార్లు మృత సంజీవని మంత్రం ద్వారా బ్రతికించారు.  రాక్షసుల అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి, నీటిలో కలిపి శుక్రుని చేత తాగ్గించారు. దేవయాని మొరపెట్టు ఎలాగైనా బ్రతికించమంటే , కచుడుని బతికిస్తే, నేను చనిపోవాల్సిన వస్తుంది అంటే ఆమె అప్పుడు నేను అతనిని వివాహమాడాలనుకున్నాను. అతడు లేక నేను బ్రతక లేను అన్నది. రాక్షస గురువు ఈ  మంత్రం నా ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె "తండ్రీ నీ కూతురు అయినా నాకు మంత్రం చెప్పు, కచుడు బతికి బయటకు రాగానే నిన్ను కూడా బతికి ఇస్తాను అన్నది. “అమ్మ! స్త్రీలకు మంత్రజపం తగ్గదు, స్త్రీ కి  మంత్రం ఉపదేశిస్తే  మంత్రం శక్తిహీనమఅవుతుందిఅన్నారు.  దేవయాని మీ మంత్రంతో మీరే సుఖంగా ఉండండికచుని విడిచి జీవించలేక నేనే మరణిస్తాను అని మూర్ఛపోయింది. ఆమెను మేలుకొలిపి మంత్రం ఉపదేశించి, తర్వాత కచుని బ్రతికించాడు. కచుడు శుక్రాచార్యుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికించుకున్నది, కచుడు కూడా మంత్రమే వినిన కారణంగా మంత్రం నష్ట మైంది. ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు . కనుక సావిత్రి నీకు ఏదైనా వ్రతం చెబుతారు చేసుకో అన్నారు, “అందరూ ఆచరించటానికి  ఉత్తమమయినది సోమవార వ్రతం. సోమవారం రాత్రి మాత్రమే భోజనం చేస్తూ  ఇంద్రియ నిఘాహంతో ఉండాలి. వ్రత మహిమ  తెలిపే కథ ని ఇలా చెప్పారు

సీమంతిని ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో వ్రతమాచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే కుమారుడైన చంద్రాంగదుడుకి ఇచ్చి వివాహం చేశారు. దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు రాజకుమారుడు జలక్రీడ కని వెళ్లి ప్రమాదవశాన  కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరోఈతగాళ్లు  వెతికిన దొరకలేదు. అది తెలిసిన 14 సంవత్సరాలునిండిన సీమంతిని  ప్రాణత్యాగానికి సిద్ధమయ్యిందిసీమంతిని తను వ్రతంఆచరించిన కూడా తన భర్తను రక్షించేందుకు శివపార్వతులు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధపడింది.

కానీ శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు, అసలు మరణించాడు లేదో ఎలా నిర్ణయించ గలవు. కనుక నీవు వేచి ఉండాలి. అని చెప్పారు. దాయాదులు అతని రాజ్యం హరించి, రాజదంపతులను చెరసాల లో పెట్టారుసీమంతిని   అంత దుఃఖంలో కూడా ఎంతో దీక్షతో వ్రాతఆచరిస్తూనే ఉన్నది.   

నీట మునిగి పోయిన చంద్రాగదుడుని  నాగ కన్యలు అమృతం పోసి బ్రతికించి, పడగలు  గల తమ రాజు అయినా తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు. తక్షకుడు అతని వృత్తాంతం మెఱిగి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపొమ్మని ఆహ్వానించారు. చంద్రాగదుడు అందుకు సంతోషించి, తన తల్లిదండ్రులు, భార్య తన కోసం దుక్కిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లాలి అని చెప్పాడు. తక్షకుడు తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించ గలనని  చెప్పి పంపాడు. నీటి నుంచి గుర్రం మీద పైకి వచ్చిన చంద్రగదుడుని చూసి సీమంతి ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం, సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళ సూత్రం , నొసట కుంకుం కనిపించకపోయేసరికి, ఆమెను గుర్తు పట్టలేదు. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లి , రాజ్య మపహరించిన దయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించకపోతే యుద్ధంలో శిక్షిస్తానని  తెలపగా ఆ దాయాదులు భయపడి రాజ్యం అప్పగించి క్షమాపణ కోరారు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి ఇదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకు వచ్చి వైభవంగా చంద్రంగదడుకి పట్టాభిషేకం చేశారు.

శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, “స్వామి, పరమ పవిత్రము అయిన మీ పాద సేవా మాకు చాలధా? వేరొక వ్రత మెందుకు అన్నాడు? శ్రీ గురుడు "ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకుఅందదు కనుక వ్రతం చేసుకోండి! అని ఆశీర్వదించి  పంపివేశారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నాలుగు దిక్కులు గా పాకి పోయింది

ఆదివారం పారాయణ సమాప్తం!

శనివారం పారాయణ ప్రారంభం

 

అధ్యాయం  - 22

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

నామధారకుడు,“ సిద్ధమని మీ వల్ల నాకు అజ్ఞానాంధకారం  తొలగి, జ్ఞానోదయం అయ్యింది అందువలన మీరే నా గురుదేవులు.కామధేనువు వంటి గురి చరిత్రను వినిపించి నాలో గురు భక్తిని వికసింప చేస్తన్నారు అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి, అని ప్రార్థించాడు సిద్ధ యోగినాయనా, నీకు గురుకృప   లభించింది. కథ వినిపించడం వలన నా జన్మ గూడా ధన్యమైంది.అటు తర్వాత శ్రీ గురుడు గంధర్వపురం చేరి, బీమా అమరజసంగమంలలో నివసించారు. ఇక్కడ రెండు నదులు ఉత్తరదిక్కుగా ప్రవహిస్తున్నాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. గంధర్వపురంలో శ్రీ గురుడు తమ మహిమ ప్రకటమవనీ యక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంఘం వద్ద సంచరిస్తూ దగ్గర్లో ఉన్న గంధర్వ పురానికి బిక్షకు వెళ్లేవారు గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణులు ఉండేవారు. వారంతా వేదవిదులు. గ్రామం లో గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి  గొడ్డు బర్రె ఉండేది, గ్రామంలోని రైతులు దానిని, మట్టి, ఇసుక మోయించుకోవడానికై అద్దెకు తీసుకువెళ్తుండే వారు. అతడు బిక్షాటనతోను గెద పై వచ్చు  బాడుగుల తోను జీవనం సాగించేవాడు.

శ్రీ నృసింహ సరస్వతి తరచూ వీరి ఇంటికి బిక్షకు వెళ్లేవారు. అది చూసి కొందరు, గ్రామంలో  శోత్రియూలము ,శ్రీ మంతులం అయినా బ్రాహ్మణులు ఇంతమంది ఉండగా సన్యాసి మన ఇళ్లకు భిక్షకురాకుండా, దరిద్ర బ్రాహ్మణ ఇంటికివెళ్లాలా?అక్కడ ఆయనకు ఏమి దొరికింది అని అందరూ విమర్శించేవారు.

ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నంపుటెండ నిప్పులు చెరుగుతున్న సమయాల్లో శ్రీ గురుడు వారింటికి  బిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో గేదెను బాడుగకు ఎవరు తీసుకుపోలేదు . బ్రాహ్మణుడు బిక్షకోసం గ్రామంలోకి వెళ్ళాడు.శ్రీ గురుడు వాకిట్లో నిలిచి,“భవతీ భిక్షాం దేహిఅన్నాడు . ఇల్లాలు నమస్కరించిస్వామి యజమాని మాయావరానికై గ్రామంలోకి వెళ్లారు, వచ్చే సమయం అయింది,  కోపగించక దయతో కొద్దిసేపు కూర్చోండి. అని వీటి పీట వేసింది.

శ్రీ  గురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు, మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు, మీ ఇంటి ముందు బర్రె ఉన్న పాలు కొంచెం ఇచ్చిన చాలు! అన్నారు. అప్పుడు ఆమె,“సామీ! ఇది  గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టను లేదు,ఈనను లేదు. దీనిని బరువులుమోయటానికే   ఉపయోగించు కుంటున్నాముఅన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోక,“ఎందుకు మా వొట్టి మాటలు”? ఆయన పాలు పీతకు చూస్తాము! అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని  తలిచి ఆమె పాత్ర తెచ్చి  పితకనారంభించింది. ఆశ్చర్యం! గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండగా  పాలు ఇచ్చింది . ఇల్లాలు ఆశ్చర్యపడి యతీశ్వరుడు  సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకుని వెంటనే పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీ గురుడు పాలు త్రాగి సంతోషించిమీరు అఖండ ఐశ్వర్యం తోనూ, పుత్ర పౌతృలతో నూ సుఖించగలరుఅని దీవించి సంగమానికి వెళ్లిపోయారు. తరువాత బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని, భార్యతో కూడా సంగమానికి వెళ్లి స్వామిని పూజించాడుఅన్నారు సిద్ధయోగి.

 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 23

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

నామధారకా! “శ్రీ గురుడు గొడ్డు బర్రె నుంచి పాలు పితకడంతో గుప్తంగా ఉన్న మహిమ వెల్లడి అయింది. మరునాడు గ్రామస్తులు మట్టి తోలడానికి బర్రెను అడగగా, బ్రాహ్మణుడు అయ్యా! మా గేద పాలిస్తున్నది! కనుక మట్టి  మోయడానికి పంపలేను. అని చెప్పినాడు గేద ఇచ్చిన పాలు చూపించాడు. గ్రామస్తులు, అరెరే!ఇంతవరకు ఒక్కసారైనా కట్టనిముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది? అని ఆశ్చర్యపోయారు,అద్భుతం అయిన వార్త ప్రాంతంలో పాకి నగరమేలె రాజు కు చేరింది. అతడు ఆశ్చర్యపడి, కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి, అది సంఘములో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు, వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో సంగమానికి వెళ్లి శ్రీ గురునికి దండాలు పెట్టి, సాష్టాంగనమస్కారం చేసి ఇలా స్తుతించాడు.  జగద్గురువు! నీకు జయము. పరంజ్యోతి స్వరూపా! నన్ను మిరే సంసారం నుండి ఉద్ధరించాలి, పామరుల దృష్టికి మానవుని లాగ కనిపించే మీరు విశ్వ కర్తలు”. 

శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా! మేముతపస్వులము అరణ్యం లో నివసించే సన్యాసులము, నీవు సకుటుంబంగా, పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి? అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు! మీరు భక్తులను ఉద్దరించడానికి అవతరించిన నారాయణులే.  అట్టిమీరు అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థన మన్నించి గాంధర్వ పురం లో నివసించండి, నేను మఠం నిర్మించి  సమర్పించుకుంటాను. మీరు అక్కడ నుంచి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని  పావనం చేయండి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామిఇది భగవదేచ్చ మేము ప్రకటమయ్యే సమయం అయ్యింది. కనుక కొంతకాలం గాంధర్వ పురంలో నివసించాలని అనుకున్నారు”.

రాజు సంతోషంతో స్వామి పల్లకి లో కూర్చోబెట్టి, వాద్య, నృత్య ,గీతాదులతో తీసుకువెళ్లారు, “ఊరేగింపు గాంధర్వ పురం లో ప్రవేశిస్తూ ఉండగా,పెద్ద రావిచెట్టు ఉంది. దాని సమీపంలో ఇళ్లన్నీ పాతబడి నిర్మానుష్యంగా ఉన్నాయి, అందుకు కారణం బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రదేశంలోకి వచ్చిన వారిని మింగేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి అక్కడ వారందరూ ఇల్లు విడిచి పెట్టి, పట్నంలోని మరో చోటు ఉంటున్నారు. ఊరేగింపు దగ్గరికిరాగానే స్వామి చెట్టు పైకి చూశారు, మిగిలినవారికి కనిపించకపోయినా, రాక్షసుడు చెట్టు దిగి వచ్చి నమస్కరించి ఉద్దరించమన్నాడు. స్వామి తలపై చేయిపెట్టి ఆశీర్వదించగా మానవ ఆకారంవచ్చిఅందరికీ కనబడ్డాడు, స్వామి అతనితో సంగమానికి వెళ్లి స్నానం చెయ్యి నీకు పాప విముక్తి కలుగుతుందన్నారు.

సన్నివేశం చూసిన పట్టణ వాసులు, శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు   శ్రీ గురుడునాకు మఠం ఇక్కడే నిర్మించండి. శ్రీ గురుడు సంగమానికి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్వామి పల్లకిలో రాజా మర్యాదలతో తీసుకు వెళ్ళాడు. ప్రతినిత్యం,శ్రీ గురుని కీర్తి గ్రామాలకు పాకిపోయింది.

గంధర్వ నగరానికి కొద్ది దూరం లోని' కుమ సి' గ్రామంలో త్రివిక్రమభారతీ అనే సన్యాసి శ్రీ గురుని గురించి యతి దాంభికుడు సన్యాసాశ్రమానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపించాడు, అప్పుడు ఒక అద్భుతం జరిగింది.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 24

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

త్రివిక్రమభారతి శ్రీ గురుని నిందిస్తున్నారని, రాజు స్వామితో, “స్వామి మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరుఊరుకుంటారేమి? అతని అజ్ఞానంతొలగించడం అని కోరగా రాజు బయలుదేరారు, ఊరేగింపు మహా వైభవంగా కుమసి గ్రామం సమీపించే సరికి త్రివిక్రమ భారతీ పూజ చేసుకుంటున్నాడు. పూజలో ప్రతిరోజు అతనికి నరసింహ అవతారం దర్శనం ఇచ్చే వాడు. కానీ ఆరోజు ఎంత ప్రయత్నించినా దర్శనం నీ లేడు, అని ఆర్తితో ప్రార్థించగా. ఇప్పుడ నేను నదీతీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని  దివ్య వాణి వినిపించింది. వెంటనే అతడు లేచి నది వద్దకు వెళ్లి అతనికి ధాన్యం లో కనిపించిన శ్రీ గురుడు అక్కడ దర్శనం ఈయడం తో సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు శ్రీ గురుడుత్రివిక్రమ!ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందిచావో సన్యాసినే మేము అనగా త్రివిక్రమ భారతి సద్గురోత్తమ ! మీరు మానవ రూపంలో అవతరించడం వల్ల  తెలియక మూడిని వలె ప్రవర్తించను, నన్ను క్షమించు మీరేనా ఉపాస్య దైవము నరసింహ స్వరూపులు. శరణు! శరణు!  అని స్తుతించాడు.

శ్రీ గురుడు అతనిని త్రివిక్రమ! నీ భక్తికి సంతోషించాము, నీవు నరసింహ స్వామికి చేసే అనుష్టానం మాకే చెందుతుంది అని మాకు అనుష్టానానికి సమయం అయింది అని మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు.

కనుక నామధారకా! శ్రీ గురుడు భగవంతుడు కాదని, మానవ మాతృడేనని తలచే వారు ఏడు జన్మలు నరకం అనుభవిస్తారు. గురువే బ్రహ్మ, విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాట పై విశ్వాసముంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయింతురు గాకఅన్నారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 25

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

అటుపైన శ్రీ గురుడు చేసిన దివ్య లీలలు వివరించమని ప్రార్థించగా సిద్ధమని ఇలా చెప్పారు. “ఒకప్పుడు వైడూర్య  నగరంలో  ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, కఠినాత్ముడు. వైదిక ధర్మాలకు విరుద్ధంగా తన ఎదుట వేదాంగములు చెప్పమని శాసిస్తూండేవారు. వారికి   దనాశ చూపుతుండే వారు. కొందరు శిష్టాచార  పరులు ఇతరులు అందుకు అంగీకరించేవారు కాదు.

ఒక నాడు ఉత్తరాది నుండి వేదపండితులైన బ్రాహ్మణులు ఇద్దరు రాజుని  దర్శించి,' రాజా! సకల  విద్యలోనూ మాకు సాటి మైన వారు ఎక్కడా లేదు, మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఉంటే పిలిపించండి, మా ప్రతిభా  నిరూపించగలను అన్నారు. పరాయి మతాన్నికించపరచానికి మరో మంచి అవకాశం వచ్చిందని, రాజు వెంటనే నగరంలో దండోరా వేయించాడు, వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమతులు, ఓడిన వారిని దండించ గలం అని ప్రకటించారు. దుష్టుల ఎదుట వల్లించడం  ఇష్టపడిన శిష్టాచారులు కొందరు, తమకంత సామర్థ్యం లేదని తప్పుకున్నారు, మరి కొందరు నిండు సభలో అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా జై పత్రాలు ఇవ్వక తప్పలేదు. రాజు  సంతోషించి కుపండితులు ఇద్దరికి వస్త్రాలు, ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు ఇచ్చి, సగౌరవంగా సాగనంపాడు. వాళ్ళిద్దరూ ఏనుగులు ఎక్కిఊరూరు తిరిగి జై పత్రములు పొందసాగారు, ఒకరోజు కుమిసీ గ్రామం చేరి అక్కడ  త్రివిక్రమభారతి  వేదవేదాంగ పారంగతుడు విని అయినా దర్శించిఏమయ్యా! మాతో వాదించు లేక జై పత్రం ఐన ఇవ్వు" అనగా త్రివిక్రమభారతి వీరికి గర్వం తలకెక్కింది, సాటి పండితులను నిందిస్తున్నారు వీరికి బుధ్ధి చెప్పడానికి గురు దేవుల్లే సమర్థులు అనుకుని శ్రీ గురుని దగ్గరికి తీసుకు వెళ్లారు.

త్రివిక్రముడు వినయంతో కాలినడకన  వెళ్తుంటే వీళ్లు మాత్రంఏనుగు మీద కూర్చుని వెళ్లారు.  త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి, ఆనంద భాష్పాలు కారుస్తూ, ఆకుపండితులు గురించి విన్నవించి, పరాత్పర!గుడ్లగూబ సూర్యుని చూడ లేనట్టుగా అజ్ఞానులు మిమ్మేరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికి ఇక్కడకు తీసుకువచ్చారు. వీరి నుండి నన్ను, వేద ధర్మాన్ని కాపాడండి, మీరు ఏది చేయమంటే అది చేస్తానుఅని ప్రార్థించాడు. వాళ్లు  మా కాలం అంతా వ్యర్థం అయింది కానీ ఇతడు  జై పత్రం ఇవ్వడు వాద బిక్ష ఇవ్వడు. మమ్ములను ఇక్కడ కు తీసుకొచ్చాడు. కనుక గురు శిష్యుల లో ఎవరో ఒకరు రెంటి  లో ఏదో ఒకటి చేసి తీరాలిఅన్నారు. శ్రీగురుడు నవ్వుతూ మీ వంటి వేద విధులకు సాటి విప్రులను  పరాభవించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమున్నది? ఎతుల మైన మాకు జయించడం వల్ల గొప్పతనం, ఓడి నందు వలన చిన్నతనం ఏమి కలుగవు, అటువంటి మా వలన మీ కేమి ప్రయోజనము? అని ఎంత చెప్పినా వినకుండా జయ పత్రం ఇవ్వండిఅని పట్టు పట్టారు.

శ్రీ గురుడుఅయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం! బ్రాహ్మణుల కే సాధ్యం కాలేదు, వేదాలు అపారమైనవి, అలాంటిది వేదవిధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది అనగా, మేమ సంఘోపాకంగా వేదమంతా నేర్చుకున్నాము  మమ్మల్ని  మించిన ఎవరూ లేరుఅని విర్ర వీగారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 26

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

నామధారకుడు పట్టరాని ఆసక్తితో, స్వామి! శ్రీ గురుడు విద్యావంతులైన మూర్ఖులను ఎలా సమాధాన పరిచారు? అనడిగా.“గురుడు తీవ్రమైన ఖంఠంతో ఇది దుస్సాహసమే అవుతుంది, ఎవరైనా వేదవిధులను అనుకోవటం, దురహంకారమే వేదాలు లక్ష్యం పరమాత్మనే గాని - ధనము, కీర్తి, అహంకారం కావు.  వేదం పూర్తిగా తెలుసుకోవటం బ్రహ్మ దేవునికి సాధ్యపడలేదు.

పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మదేవుని వరంతో  మూడు సార్లు దీర్ఘాయువు పొంది,  బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్పటానికి చాలక తపస్సు చేసాడు. అప్పుడుబ్రాహ్మ వేదం పూర్తిగా నాకే రాదు, నీకే వేదరాశిని చెబుతాను, చూడు”! అని కాంతులతో వెలిగిపోతున్న మేరు పర్వతాలు వంటిఅపారమైన వేదరాశి ని చూపి, మూడుపిడకలు తీసి అతనికి ప్రసాదించి,  ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నీవు జన్మించితువుగాక అని వరం ఇచ్చాడు . అది అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు, వేదమంతా నేర్వగలగడం ఒక్కరికైనా సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించి.,పైలుడుకి, వైశంపాయునికి, జైమినికి, సుమంతుడికి బోధించాడు. 

పూర్వం అన్ని వేదాలను సంఘోపాకంగా నేర్పగల వర్ణాశ్రమాచారా నిరతులెందరో భరత భూమిలో ఉండేవారు. వేద అధ్యయనం బలం వలన త్రిమూర్తులు కూడా ఆదీనులై ఉండేవారు. కానీ   కలి యుగంలో మీరు మేచ్యుల ఎదుట వేదం చదువుతున్నారు మీ ముఖమేనా చూడకూడదు అటువంటి త్రివిక్రముని కూడా జయ పత్రిక ఇవ్వమని భావిస్తున్నారె! ఇకనైనా నా మాట విని వెళ్ళండి అన్నారు కానీ తమ పట్టుదల  వదలక వాదమైన లేక జయ పాత్రమైన ఇవ్వమని కోరారు!

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 27

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

శ్రీ గురుడు ఎంత చెప్పినా వారు వినలేదు, అప్పుడు శ్రీ గురుడు ఇక నీ కోరిక ఇప్పుడే తెరుస్తానుఅని ఆటగా వెళ్తున్న ఒకనిని పిలిచి నీవు ఎవరు? ని కులం ఏది? ఎక్కడికి పోతున్నావు? అని అడిగాడు. అతడు, “అయ్యా, నేను  కడజాతి వాన్నిని కులం మాతంగుడు అంటారు అనగా  శ్రీ గురుడు అతనిపై తమ కృపా దృష్టి సారించి,  శిష్యునిని స్వామి దండంతో 7 గీతలు గీయించి  , అప్పుడు చండాలుని మీద విభూది చల్లి ఒక్కొక్క  గీత  దాటి వెనకటి జన్మలో తానెవరో  చెప్పాడు. నీవు పూర్వం వేదజ్ఞుడువైతే  వాదంలో వీరిని జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి చర్చకు సిద్ధమయ్యారు, అది చూసి కుపండితులకు నోరు ఎండి పోయి కడుపులో నొప్పి వచ్చి, వారు స్వామి పాదాలపై బడి, “స్వామి! సాక్షాత్తు పరమేశ్వరుడు అయినా మిమ్ము   దిక్కరించాము మమ్ము ఉద్ధరించండి , అని వేడుకున్నారు. కానీ చేసిన తప్పుకు 12 సంవత్సరాలు బ్రహ్మరాక్షసులుగా జీవించి ముక్తి చెందారు. ఏడు జన్మల క్రిందట వేదవిదుడు అన్న స్మృతి కలిగిన చండాలుడు స్వామికి నమస్కరించి,  పూర్వం నాకు జన్మ రకంగా వచ్చిందో తెలుపవలసిందిగాఅని వేడుకున్నాడు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 28

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

శ్రీ గురుడు చండాలునితో  నాయనా! పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీన జన్మలో, తల్లిదండ్రులను, గురువులను, కుల స్త్రీని, సత్యమును, అహింసను, విడిచిన వారు, కన్యా శుల్కం  తీసుకునేవారు, అనాచారాలతో సాంగత్యం చేసేవారు, తల్లి దండ్రులు - బిడ్డలను, ఆవులను- దూడలను విడదీసిన వారు, భగవంతుడికి అర్పించకుండా ఆహారం తీసుకునే వారు,అతిధులను సేవించనివారు, అయోధ్య లను గౌరవించేవారు, శాస్త్రం తెలియకుండా వైద్యం చేసేవారు, మొదలైనవి చేయడం వలన చండాల జన్మ వస్తుంది.

ఏమి చేస్తే చండాల  జన్మ కలుగుతుందో, పూర్వ జన్మలో చేసిన తప్పులకు జన్మలు కలుగుతాయో వివరంగా చెప్పగా, నామధారకుడు స్వామి! ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టె ఉపాయం ఏమీ లేదా? అన్నాడు. నాయనా! నిజమైన పశ్చాత్తాపమే, లేకుంటే  గోదానం వల్ల పాపం పోతుంది. సద్గురు సేవ వలన మాత్రమే మహాపాపాల గూడా మటు మాయమైపోతాయి.

తర్వాత శ్రీ గురుడు చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందున నీకు చండాల జన్మ లభించింది. నెలరోజులు సంఘములో స్నానంచేస్తే క్రమంగా శుద్ధుడవై, వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడివిగా జన్మిస్తావ్ అని చెప్పారు. అప్పుడా చండాలుడు, స్వామి! మీ  కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాపవిముక్తుడిని అయ్యాను, పరుసు వేదిని తాకి ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగే లాగా అభిమంత్రించి , నన్ను విప్రులలో చేర్చండిఅని వేడుకున్నాడు. 

శ్రీ గురుడు, పూర్వ పాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి నని అనిపించుకోవాలని కొన్ని వందల సంవత్సరాలు మహాతపస్సు చేసి  ఇంద్రాది దేవతలను కోరాడు. అతని వశిష్ట మహర్షి వలన కావాల్సిందే కానీ తమ వల్ల కాదని చెప్పగా, అప్పుడు అతడు వశిష్ట మహర్షినికోరగా, అది సాధ్యం కాదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించ లేదు కానీ, అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. కోపం తగ్గించుకొని విశిష్టుడు ని చంపితే బ్రహ్మ హత్య పాతకం కూడా చుట్టుకుంటుంది, ఆయన మరణిస్తే నన్ను బ్రహ్మర్షిని అని అంగీకరించగలవారు ఎవరు అని ఆలోచించుకుని ఆయన పాదాలపై పడి ప్రార్థించగా నీవు సూర్య కిరణాలతో నీ శరీరాన్ని, తపింప చేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్య కిరణాలతో తన దేహం మాడిపోయి కొత్తదేహం వచ్చేవరకు తపస్సు చేసి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని ఒప్పుకున్నాడు.

అలాంటిదేమీ చేయకుండానే మీకు అదెలా సాధ్యం? పూర్వం నువ్వు చేసిన పాపానికి పశ్చాతాపం చెంది, నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు! అన్నారు. కానీ పేదవానికి పెన్నిధి దొరికిన, మృత్యు ముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన, ఆకలిగొన్న పశువులకు గడ్డిదొరికిన వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి కలిగిన  చండాలుడు అవి పట్టించుకోకుండా, భార్య వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే అతడునేను ఇప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను త్రాకవద్దు దూరంగా పొంది! అన్నాడు, ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా ! నీకేమన్నా పిచ్చిపుట్టిందా? అనగానే కొట్టబోతే ఆమె శ్రీ గురుని వద్దకు వెళ్లి దుఃఖిస్తూ ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు, ఇతనికి మతి చలించింది, బుద్ధి మారకపోతే నాకు వేరు దిక్కు లేదు ఉరి పోసుకుంటా అన్నది. అప్పుడు శ్రీ గురుడు ఇతని ఒంటి మీద నున్న విభూది తొలగిస్తే గాని ప్రయోజనం లేదు. ఆయన ఒక శిష్యుడునిపిలిచి, ఒక శ్రీమంతుడు, పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని చెప్పగా, గ్రామానికి వెళ్లి పిసినారి బ్రాహ్మణుడునితీసుకు వచ్చాడు.

నాయనా! నువ్వు తనకి స్నానం చేయించు, అప్పుడు తనకి తన కుటుంబం పై మమకారం కలుగుతుంది”, అని ఆదేశించారు. వెంటనే వ్యక్తి కుండలో నీళ్లు తెచ్చి చండాలుని తలపై కుమ్మరించగా, అతని ఒంటిపై ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి, భార్యా బిడ్డలతోఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఏమైనా భయమా? ఇది పగలే కదా! అన్నాడు. అది అంత చూసి విస్తుబోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణం లో ఎలా పోయింది? అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి ఇది అంత భస్మ మహిమ కాబట్టే శివుడు దాన్ని ధరిస్తాడు. దానికితోడు బస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటె బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించ గలదు అన్నారు " దానికితోడు బస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటె బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించ గలదు అన్నారు " మహిమ గురించి వివరించవలసినదిగా శ్రీగురుని  ప్రార్థించాడు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

 

అధ్యాయం  - 29

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః 

త్రివిక్రమ భారతి  ప్రశ్న వేయగానే శ్రీ గురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృత యుగంలో వాము దేవుడనే మునీశ్వరుడు జీవణ్మక్తుడై ఆత్మానందంతో తెలియాడుతుండేవాడు. ముని  జడలు, నార బట్టలు ధరించి, ఒంటి నిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరిస్తు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నిరసించ సాగాడు. అడవిలో ఒక బ్రాహ్మణుడు కనిపించిన దాని నల్ల చంపి తింటు డేవారు, వాడు మునిని చూచి లో ఆయనను మ్రింగ దలిచి ఆయనపై దూక పోయాడు, ఆయన శరీరం మీద ఉన్న భస్మము అతనికి అంటుకోగానే వెంటనే రాక్షసుడికి పూర్వజన్మ శృతి  కలిగింది . ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని, సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని పాపాలు చేసిన రాక్షసుడికి కూడా ముని స్పర్శ తగలగానే పాప విమోచనం అయినది. అతడు ముని శ్రేష్ఠుని పాదాలపై పడి" గురూత్తమా! నీవు సాక్ష్యాత్తు భగవంతుడవు.మీ స్పర్శవలన నాపాపాలన్నీ తొలిగిపోయాయి. నన్ను రక్షించుఅని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి నీవు ఎవడవు? నీవీ అడవిలో ఎందుకు ఉన్నావు అనిఅడిగారు. రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు.

స్వామి మీ దయవలన నా పూర్వ జన్మలు గుర్తొచ్చాయి. నాకు 25 సంవత్సరాలు కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు దుర్జయుడుపేరుగల యమన రాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు బాధ కలిగించాను, అంతేకాకుండా మదోన్మత్తుడై  పరస్త్రీలను ఎందరినో బలవంతం చేసి, తరవాత వారి ముఖము చూసేవాన్ని. వాళ్ళందరూ శాపమిచ్చారు , అయినా లెక్క చేయక తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను ,నన్ను శత్రు రాజులు జయించి  నా రాజ్యం చేజికించుకోక , ఎన్నో కష్టాలు పడి మరణించాను. అప్పుడి  నుండి ఇలా ఘోరమైన జన్మలు అనుభవిస్తున్నాను. ఇపుడు మీ దర్శనం వల్ల శాపవిమోచనం జరిగింది ,నావంటి నీకృష్ణుడికి ఇంత జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని కోరగా ఇదంతా నీ వంటి మీద ఉన్న భస్మం  యొక్క మహిమ! దాన్ని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు , పరమేశ్వరుడే  దానిని దరిస్తుంటే దాని మహిమ వేరే చెప్పాలా? అని భస్మాన్నిఏ విధంగా ధరించాలో వివరించి చెప్పారు.      

కనుక ఓరాక్షసుడా! భస్మం  వల్లనే నీకిట్టి  జ్ఞానం కలిగింది, అని కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి  రాక్షసుడు ముక్తుడై స్వర్గానికి వెళ్ళాడు. వామదేవడు త్రిమూర్త్యావతారం , జీవులనుద్దరించటానికి భూమిపై సంచరిస్తున్నారని చెప్పారు, సిద్ధ యోగి.

శనివారం పారాయణ సమాప్తం!

గురువారం పారాయణ ప్రారంభం

అధ్యాయం  - 1

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోకప్రసిద్ధి అయి దూర ప్రాంతాల నుండి అందరూ వచ్చి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేనివారు సంతానం, పేదవారు ధనము ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. నామ దారుకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఒక్కటీ తీరక, శ్రీ గురుని మహత్యం విని, ఆకలిదప్పులు మరిచి కాలినడకన అతడు శ్రీ గురు స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు.

అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు పోవడం లేదు, అందుకు నా పాపాలు కారణమైతే, అన్నిటినీ కరుణించే మీ నామం, దేవతలకె శక్తిని అనుగ్రహించి విశ్వం అంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా! మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? వీటి అన్నిటికీ నేను చేసిన తప్పులే కారణమా? అని పలువిధాలు శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ చివరకు కిన్నుడై, శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురుని నే స్మరించాడు. భక్తుల పాలిటి అమ్మ దేనికైనాకామధేనువైన ఆయన జడలు, విభూది, పులి చర్మముతో నామధారకుడికి  దర్శనం ఇచ్చారు. అతడు పొడవైన తన  జుట్టుతో వారి పాదాలు తుడిచి, అభిషేకించి, గంధం అలంకరించి పూజించాడు. దర్శనంతో తన హృదయం శాంతించి, అతని మనసులో ఆయన రూపం స్థిరంగా నిలిచింది.

యోగీశ్వరుడు అతనిని లేవ నెత్తి ముఖాన విభూది పెట్టి , తలపై చేయి ఉంచి ఆశీర్వదించగా, వెంటనే మెలుకువ వచ్చింది. కానీ నామ దారుకుడు కి అనుభవము అలానే ఉన్నది, ఆశ్చర్యపోయి చుట్టూ చూసాడు, అక్కడ మరెవ్వరూ లేరు, తనకు స్వప్న దర్శనం ఇచ్చినది గురుమూర్తి నే అని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు.   

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 2

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

స్వప్నంలో జడలు, విభూతి , పులి తోలు ధరించి దర్శనమిచ్చిన మూర్తి నామదారకుని మనసుపై చెరగని ముద్ర వేసుకుంది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. కొద్ది దూరం వచ్చేసరికి ఒక చోట కృపాకరుడు,ద్వంద్వాతీతుడు అయినా యోగి పుంగవుడు పీతాంబరం, దానిపై పులిచర్మం,, దేహమంతటా విభూది జడలు ధరించి కనిపించాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగి నేనామ దారుకుడు రోమాంచిత మై, కన్నులు ఆనందభాష్పాలతో స్వామి! నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయం సంతోషంతో ఉప్పొంగింది, నా దుఃఖం పోగొట్టగల వారు మీరేనని స్పష్టమైంది. స్వామి! నా అదృష్టం వల్ల మీ దర్శనం అయింది. నా పేరు నామ దారక శర్మ. తమ పేరేమి? ఎక్కడనుండి వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగాడు.

యోగి ఇలా చెప్పారు, నాయనా! భక్తులకు ఎవరు భక్తిని, ముక్తిని ప్రసాదిస్తారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను.

నామ దారుకుడు, స్వామి! శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీ లందరూ ఆయన భక్తులే. నేను కూడా ఎల్లప్పుడు ఆయనను స్మరిస్తున్నాను, కానీ నేనంత కష్టాలలో ఉన్న నన్ను ఆయన అనుగ్రహించడం లేదు ఏమి? నాపై ఆగ్రహించారు ఎందుకు? అని అడిగాడు.

సిద్ధ యోగి ఇలా చెప్పారు , 'నాయనా! నేను చెప్పేది శ్రద్ధగా విను - భక్తులపై ఆయన కృపను అన్ని జీవులకు ఆయన  ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటుంది, దానిలో ఎలాంటి లోపం ఉండదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ద లేని వాడు, సంశయాత్ముడు ఎవరి చేత అంగీకరించబడడు. ఆయన ఎవరి పైన కోపించరు, అలాంటిది శ్రీ గురుణ్ణే  శంకించే వాణ్ని అనుగ్రహించేది ఎవరు? అని చెప్పగా నామ దారకుడు "స్వామి! దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరు అన్నారే అది ఎలా సంభవం? అందుకు ఏమి తార్కాణం ఏమి చెప్పమనగా , సిద్ధుడు అతని జిజ్ఞాస కు సంతోషించి నీవు బుద్ధిమంతుడు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడు గానున్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించి మొదట నారాయుని నాభి నుంచి ఒక కమలము - దాని నుండి బ్రహ్మ పుట్టారు. మొదట బ్రహ్మనిస్టు లైనా సనక, సనందన, సనత్ కుమార , ప్రజా పతులైన మరీచి, అత్రి, అంగీరస  లను సృష్టించాడు, తరువాత లోకాలను , దేవతలను, జీవరాశిని, మానవులను సృష్టించారు, వారి వారి పూర్వజన్మ సంస్కారాలను  అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలు మరియు 4 యుగాలను సృష్టించారు.

 అప్పుడు బ్రహ్మ! కలి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచి పెట్టి అధర్మం అనుసరించే వారిని లోబరచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింప చేయి. శివ కేశవులు ఒక్కరే అని, తల్లిదండ్రులు - గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు - తులసిని పూజించే వారిని భావించవద్దు. ప్రత్యేకించి గురు సేవ అందు దీక్ష వహించిన  వారిని, గురు భక్తులను నీవేమి చేయలేవు', వారిని భావించవద్దు అని చెప్పారు. శ్రీ గురుని  గొప్పతనం గురించి బ్రహ్మ ఇలా చెప్పారు.

కలి పురుషుడు స్వామి! గురువంటే ఎవరు? అతని గురించి ప్రత్యేకించి చెబుతున్నారే ! అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు? అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు - ' గురువు త్రిమూర్తుల స్వరూపం, ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపిస్తే వారిని త్రిమూర్తులు కూడా రక్షించలేరు. గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు  సంప్రీతులు అవుతారు గాని గురువు సంప్రీతులు కాకపోవచ్చు .

పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సబ్బ్రాహ్మణులు , వ్రత దీక్ష పూనిన వారు, తపస్వులు ఉండేవారు. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు, వారిలో ఫైలుని కుమారుడు వేద ధర్ముడనే ముని ఒకరు. ఒకసారి అంగీరస మహర్షి శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించవలసి, అందరినీ పిలిచి ఇలా అన్నారు.' నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం - జన్మలో తపస్సుతో నశించిపోయింది ,మిగిలి ఉన్న కొంచెం జీవితం అయిన అనుభవిస్తే కాని తీరదు. దీనిని తప:శ్శక్తితో పోగొట్టుకుంటే అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది కనుక పాపం అనుసరించి  గళత్కు కుష్టి రోగిని, కుంటి వాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవించి మోక్షం పొందాలి. అంత కాలము అక్కడ నాకు తోడుగా సేవ చేయగల వారు మీలో ఎవరున్నారు'' అని అడిగారు.

గురుసేవలో లోపం వస్తే ప్రమాదం అన్న భయంతో అందరూ మౌనం వహించారు కానీ ద్వీపకుడు అనే శిష్యుడు ముందుకు వచ్చి, పాప శేషం ఉంచుకోకూడదు , కానీ మీరు అనుమతిస్తే నేను అనుభవించి మీకు సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అది నేను అనుభవించవలసిందే , వేరొకరు అనుభవిస్తే తీరదు, నా పాప శేషం అనుభవించడం కన్నా నాకు సేవ చేయడమే కష్టతరం, అందుకు ఇష్టమైతే నాతో రావచ్చు.

వేద ధర్ముడు మణికర్ణిక ఘట్టంలో   స్నానం చేసి మణికర్ణిక కు నమస్కరించి పూజించాడు. అలా చేయగానే ఆయనకు గళత్కు కుష్టురోగం , కుంటి తనం, గుడ్డితనం వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్టురోగంతో కుళ్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది., దానికి తోడు మతిస్థిమితం కూడా వచ్చింది ఇప్పుడు. దీపకుడు గురువును సాక్షాత్తు విశ్వనాథుడు అని సేవించేవాడు, కానీ వేద ధర్ముడు అతన్ని అన్ని రీతుల బాధిస్తూ ఉండేవాడు . అతను మంచి అన్నం తెస్తే కొంచెమే తెచ్చాడని ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువ తీసుకొస్తే రుచిగా లేదని విసిరి కొట్టి మంచిది తెమ్మని వేధించేవారు. ఒక్కొక్కసారి ప్రేమతో " అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడువి, నా కోసం చాలా కష్టపడుతున్నావు" అని, మరుక్షణంలోనే నన్ను ఈగలు కుడుతున్నాయి కానీ వాటిని నీవు సరిగ్గా తోలకుండ నన్ను చంపుకుతింటున్నావే " అని తిట్టేవారు. దీపకుడు పని చేయబోతే ఓరి దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతోంది. ఇంకా భిక్షకు వెళ్లి అన్నం తీసుకురావా? అని అంటుండేవారు. గురువే సకల దేవతా స్వరూపమని భావించి కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక, దేవతలని కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యే వాడు. ఎవరితోనూ మాట్లాడకుండాతన పని కూడా చేసుకోకుండా  గురుసేవలోనే నిమగ్నమయ్యే వారు.ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని భక్తికి మెచ్చి అతనికి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నా కూడా గురువు ఆజ్ఞ లేనిదే వరము కోరుకో లేనన్నాడు. దీపకుడు గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా వరం కోరడం మీకు ఇష్టమేనా అని అడుగగా, ఏమిరా! నాకు సేవ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? నాకు ఎట్టి వరం వద్దు అన్నారు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసే వారికి దర్శనం ఇవ్వకుండా ఎప్పుడు స్మరించని నాకు వరం ఇస్తానంటున్నారు ఏమిటి? అని అడగగా గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే! అట్టి వారికి నేను ఆదీనుడను. కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు, గురువే సకలదేవతా స్వరూపం అని, సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఇచ్చే వరం గురువు కూడా ఇవ్వగలడు కదా! అన్నాడు దీపకుడు. అవునుమేము ఇద్దరం ఒక్కటేమా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అనగాదీపకుడు స్వామి! అలా అయితే గురుభక్తి వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి గురు సేవ వలన  తరించావు, బ్రహ్మానందం పొందగలవు' అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.

దీపకుడు సంగతి  చెప్పకముందే వేదధర్ముడు జరిగినది అంతా చెప్పాడు, శిష్యునితో నాయనా! నీ గురుభక్తికి  మేము సంతోషించాము. నీవు కాశి క్షేత్ర యాత్ర చేసి నీవు ఇక్కడే సుఖంగా నివసించు, బ్రహ్మానందం పొందగలవు అన్నారు. వెంటనే గురువు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు, నిజానికి గురుభక్తి పరీక్షించడానికి ఇలా చేశారు గాని, వాస్తవానికి ఆయనకి పాపం ఎక్కడిది? అనుకున్నాడు. ద్వీపకుడిని ఆశీర్వదించి ఆయన అదృశ్యమయ్యారు.

కలిపురుషా! కలియుగం ప్రారంభం కావలసి యున్నది, నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురువు భక్తుని నీవు కంటి తో నైనా చూడవద్దు సుమా! అని బ్రహ్మ దేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు నమస్కరించి భూలోకానికి  వెళ్ళాడు.

గురువు యొక్క మహిమ ఇంతటి దని చెప్పడానికి వీలుందా? నామదారకా! ధ్రుడ  భక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని పూజిస్తారో తప్పక కృతాజ్ఞలు అవుతారు అనిసిద్ధులు చెప్పారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 3

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామదారకడు నమస్కరించి, సిద్ధమని మీరు నా సందేహాలన్నీ తొలగించారు, నాకు గురువు యొక్క యదార్ధ తత్వం తెలిసింది మీకు జయము జయము.. ఇంతకూ మీ నివాసం ఎక్కడ అని అడగగా శ్రీ గురుని చెంతనే ఉంటాను, శ్రీ గురు స్మరణయే నాకు ఆహారం, “శ్రీ గురు చరిత్ర శ్రవణం చేస్తుంటే భక్తి, ముక్తి లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణం లేక శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానం, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానం ఎవరు కోరిన వారికి లభిస్తాయిఅని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు.

నామదారకడుఎంతో ఆసక్తితో ఆయనకు నమస్కరించి దీనిని నేను శ్రవణం చేయాలని అనిపిస్తున్నది, నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వద్ధ (రావి) వృక్షం దగ్గరకు తీసుకువెళ్లి ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టుకునిశ్రీ గురుని పట్ల నీకు అట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం”, చెబుతాను శ్రద్ధగావిను.

పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరి, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించే వారు. ఒకరోజు ద్వాదశి తిధి ఒక గడియ మాత్రమే ఉండగా, దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యుల తో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి అనుష్టానం పూర్తి చేసుకుని భోజనానికి త్వరగా రమ్మని ప్రార్ధించాడు. మహర్షి స్నానానికి వెళ్లి పారాయణ సమయం మీరి పోతున్నా రాకుండా ఆలస్యం చేసినందున, తిధి  మించితే వ్రతభంగం అవుతుంది అలా అని భోజనం చేస్తే అతిధిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని రెండింటిని పరిరక్షించుకోవడానికి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చి కోపించి, “రాజా! నీవు నానా యోధులలో జన్మింతువు  గాక ! అని శపించారు., అప్పుడు  అంబరీషుడు భయపడి శ్రీ హరిని శరణు  పొందాడు, శ్రీహరి దుర్వాసునికి సాక్షాత్కరించిమహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు, అతనిని రక్షించడం నా ధర్మం,” అయినా మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక శాపాన్ని నాకు వర్తింప చేయి అన్నారు. ఇలా నైనా శ్రీహరి అవతరిస్తూ లోకోపకారం  చేయగలరని సంతోషించి అంతర్ధానం అయ్యారు, ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు, ఈయన అత్రి అనసూయలకు జన్మించారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 4

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

 శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు, ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాశాలకు  వెళ్లి , అక్కడ అనసూయాదేవి ప్రాతివ్రత్యాని ఎంతగానో ప్రశంసించాడు , ఆమె వలే  ఆదరించే సాధ్వి మరొకరు లేరని కొనియాడారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలె భయపడి అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిధి వేషాలలో అత్రి మహా ముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, “అయ్యలారా! మీ రాక చేత పావనం అయ్యింది. అత్రి  మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అనగా, అప్పుడు అతిథులుఅమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తాడో, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె భోజనానికి దయచేయమని ప్రార్థించగా అపుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తామని మాట ఇచ్చావు , కానీ మాదొక షరతు ఉన్నది, నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే భోజనం చేస్తాము. లేకపోతే ఆకలితోనే వెళ్లి పోతాము అన్నారు, వారు ఆకలితో వెళ్లిపోతే అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా  వస్తే పాతివ్రత్య భంగమువుతుంది!అయినా వారి విచిత్ర షరత్తుకు నవ్వుకుని," తపోమూర్తి  అయిన అత్రిమహర్షి సంసర్గం వలన నాకు భయం లేదు, ఆకలితో అన్నం అడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పర పురుషులు కారు" అనుకుని సాధ్వి' అయ్యలారా! అలానే చేస్తాను భోజనానికి లేవండి ' అని చెప్పి లోపలకు వెళ్లి మహర్షి పాదుకలకు నమస్కరించి నగ్నంగా వెళ్లేసరికి ముగ్గురు పసిపిల్లలు అయ్యారు, అంతేకాకుండా బాలింత వలె ఆమెకు సన్యమొచ్చింది, ఆమె వెంటనే వస్త్రాలు ధరించి బిడ్డలకు తృప్తిగా పాలించి నిద్రపుచ్చగా త్రిమూర్తులు ప్రపంచాన్ని పాలించి అలిసిపోయిన వారిలా విశ్రాంతి చెందారు.

అత్రి మహర్షి సర్వమూ ఆమె నుండి తెలుసుకుని త్రిమూర్తులను దర్శించి, స్తుతించగా స్తోత్రానికి తృప్తి చెంది తమ తమ రూపాలలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు వారు" మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి" అని కోరారు.త్రిమూర్తులను పుత్రులుగా పొందిన అత్రిమహర్షి - బాల విష్ణుమూర్తికి దత్తుడు అని, బ్రహ్మ దేవునికి చంద్రుడని, రుద్రునికి దుర్వాసనుడు అని నామకరణం చేశాడు. ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి "దత్తాత్రేయుడని" వ్యవహరిస్తారు.

నామధారకా! అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మయైన శ్రీదత్తుడుశాశ్వతంగా భూమిమీద సంచరిస్తూ భక్తులను  సంచరిస్తుంటాడు. కనుక అట్టి కలియుగంలో కూడా బుద్ధి పూర్వకంగా శ్రీ గురుని ఆరాధించి తరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం నీకు లభించింది శ్రద్ధతో విను అన్నాడు సిద్ధయోగి. నామధారకుడు దత్తఅవతారం గురించి విని ఆనందించి, "ఆహా!అలనాటి అనసూయ దేవి ప్రాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, మా వంటి అజ్ఞానులకు మీవంటి గురువు యొక్క కృప లభించాయి" అన్నారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 5

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

 నామధారకుడు , మహానుభావా! భగవంతుడు కలియుగంలో రెండుసార్లు అవతరించారు అంటిరి కదా! వాటిని వివరించమనగా, అతనికి శ్రద్ధభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు, " మంచిది, కథలు వినడం వలన నీకు ఎంత ప్రయోజనమో, అవి చెప్పడం వలన నాకూ అలాంటి ప్రయోజనం కలుగుతుంది " కనుక చెబుతాను శ్రద్ధగావిను. ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వ పురానికి తూర్పు దిక్కున దూరంగా, పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు ఆపస్తంబ శాఖకు చెందినవారు దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా, ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకరు కుంటివాడు, మరొకరు గ్రుడ్డివాడు. తర్వాత కూడా ఇద్దరు పుట్టి చనిపోయారు.

నిత్యం బిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ చేస్తుండగా, ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. అలాంటి రోజున బ్రాహ్మణులు భోజనం చేయకుండా మరెవరూ భోజనం చేయరాదు అని శాస్త్రం. ఇల్లాలైనా సుమతి వచ్చి అతనిని తమ కుల దైవమైన శ్రీ దత్తాత్రేయుడని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన సన్యాసి తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చి , నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు, నీ అభీష్టమేమిటో చెప్పమనగా? " పరమాత్మ! యోగులను  కూడా ముగ్దులను చేసేలా దర్శనమిచ్చి, నా చేతి స్వీకరించారు, ఇంతకంటే నాకేం కావాలి? కానీ నీవు నన్ను తల్లి కనుక నీవిచ్చిన మాట నిలబెట్టుకో" చాలు అన్నది.

భక్తిశ్రద్ధలతో జాగృతమైన ఆమె బుద్ధికి ఆశ్చర్యచకితుడైన దత్తాత్రేయుడు, " అమ్మా! నాతో సమానుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు" అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అప్పుడు సుమతి దేవి ఆనంద పారవశ్యంతో పితృశార్ధ కాలాపాని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి జరిగింది చెప్పగా," సాధ్వి , మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి శార్ధకర్మను యజ్ఞభోక్తయైన విష్ణుకి అర్పిస్తాం? నీవు పెట్టిన బిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మనం మహద్భాగ్యం. ఇది కేవలం నీ విశ్వాసమే! శ్రీ దత్తాత్రేయస్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిధి వలె సంచరిస్తూ ఉంటాడు అని వెల్లడి అయినది.

సుమతి దేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయ శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయినా భగవంతునికి పుట్టుక ఇచ్చింది. అతనికి " శ్రీపాదులు" అని నామకరణం చేశారు. నామధారకా! అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం.

శ్రీ పాదుడు పుట్టినది మొదలు అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటకడుతుండగా, శుభ ముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా గురువు వద్ద అధ్యయనం చేస్తే గాని వేదం రాదు కానీ మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి పూర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతి దేవికి ఇచ్చిన మాట పదార్థం అని నిరూపించారు. ఇది ఆయనకు తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీ పాదుడు పదహారేండ్ల రాగా రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలనికోగా అది తెలిసి నాకు తగిన సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగ స్త్రీ, నేను ఆమెని చేపట్టి సన్యాసి అవుతాను. మాటలు తల్లిదండ్రులకు మనస్థాపాన్ని కలిగించింది. ఆయనను వారించి నాయనా! నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైనా నీ సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరల సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో ప్రగతి ఏమీ? అనగా శ్రీపాద స్వామి అన్న తన అమృత హస్తంతో స్పృచించిన వెంటనే వారిద్దరూ పాద, నేత్ర వంతులయినారు. భగవంతుని సాదియా సాదియా లు లేవు.

అద్భుత సన్నివేశం కనులారా చూసినా తల్లిదండ్రులు శ్రీ పాదుడు కేవలం తమ పుత్రుడు మరచి ప్రపంచమంతా తన సంతానమే అయినా ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంత ఇంట కట్టిపెట్టుకోవడం అపరాధమని తోచి, సుమతి దేవి ప్రభూ! నీవు నా పుత్రుడవు అని గ్రహించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వ లోకాలను పాలించే సంగతి మరిచాను, అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు! అప్పుడు ఆయన తన యదార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశారు." అమ్మా! మీరిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు. నీ కొడుకులు ఇద్దరూ నూరేళ్లు సుఖంగా జీవిస్తారు " అన్నారు.

సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని స్తుతించాక, "తన తల్లి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి తీసుకుని సన్యసించి,పాదచారియై కాసి బృందావనం మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ వదిలి వెళ్ళిన తరువాత గోకర్ణ క్షేత్రం చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగం రూపంలో సాక్షాత్తు శంకరుడే నివాసముంటున్నాడు. లింగాన్ని ప్రతిష్టించిన వారు గనేశ్వరుడు . సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడికి వెళ్లారు" అని సిద్దుడు   చెప్పారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!  

అధ్యాయం  - 6

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

నామధారకుడు“కాశి, బదరీ, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధ మై నందు వలన శ్రీపాద స్వామి అక్కడికి వెళ్లారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు, ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించమని ” కోరాడు. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు, “పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందాలని, నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజించేది. బలగర్వితుడై న రావణుడు అది చూసి శంకరునితోపాటు సెక్స్ కైలాసాన్ని లంకకు తేవాలని, అక్కడకు వెళ్లి శక్తినంతా ఉపయోగించి పర్వతాన్ని నెత్తికి ఎత్తుకో గా , లోకాలన్నీ అకాల ప్రజల్లో ప్రళయంలో నశిస్తాయని తలచి , శివుని ప్రార్థించగా, శివుడు రావణున్ని  కైలాస పర్వతం క్రిందకు అణిచి veyaga , రావణుడు ప్రాణభీతితో శివుని దీనాతిదీనంగా ప్రార్థించి, రాగయుక్తంగా, సుస్వరంగా మధుర గానం చేశాడు. అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు వరం కోరుకోమనగా, “నేను ఈ కైలాసాన్ని నాతో సహా లంక కు తీసుకు వెళ్ళాలా అనుగ్రహించు అని కోరాడు”. ఈ కైలాస పర్వతం తో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగాన్ని ఇస్తా తీసుకో అన్నారు. ఇదంతా నాయకుడు బ్రహ్మ, విష్ణువులకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్లి, “ఎంతపని చేశావు? రావణునికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చారు? సర్వప్రాణి కోటికీ కంటక ప్రాయుడు, లోక భయంకరుడు, అయిన రావణుడు నీ అంతటి వాడు అవటం తగునా? ” అని ఆలోచించి, గణపతిని రావణుని వద్దకు పంపారు. రావణుడు గణపతితో “ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, అందుకుగాను లంకా పట్టణం చూపిస్తా, నీకు ఇష్టం అయితే అక్కడే ఉండవచ్చు” అన్నాడు.

 అమ్మో! ఇంత బరువైన శివలింగాన్ని నేను అంత సేపు మోయగలనా? అయినా భయంకర లంకాపురి కి నేను రాను అన్నాడు. రావణుడు ప్రాధేయపడి ఒప్పించ గా, అలాగేరావణ! దీనిని మోయలేనపుడు  ఎలుగెత్తి మూడు సార్లు పిలిచి, ఇక్కడే స్థాపిస్తాను  "  అన్నారు . రావణుడు పక్కకు వెళ్లినదే వెంటనే గణపతి మూడు సార్లు పిలిచి అక్కడే స్థాపించారు. రావణుడు వచ్చి కోపంగా ఎంత పెకలించిన చూశాడు కానీ రాలేదు. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన క్షేత్రానికి గోకర్ణ మని పేరు వచ్చింది. నాన్ ద్వారక! దానిని భూకైలాస మన వచ్చు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 7

శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుబ్యోనమః

 నామధారకుడు  సిద్ధ యోగి నమస్కరించి. “స్వామి మనదేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రం ఎందుకు ఆశ్రయించారు చెప్పండి" అడిగాడు.

 అప్పుడు సిద్ధ యోగి ఇలా చెప్పారు," పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్ర సహుడనే  పేరు గల రాజు రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అడవిలో క్రూర జంతువులను వేటాడుతూ ఒక   రాక్షసుణ్ణి నేల కూల్చాడు, అప్పుడు రాక్షసుడు ప్రాణాలు విడుస్తూ తన సోదరిని పిలిచి, రాజు పై పగ తీర్చుకో మన్నాడు. రాక్షసుడు మామ చేత సామాన్య మానవుడిలా రాజుకు ఎంతో వినయంతో సేవ చేస్తూ ఉండగా, ఒక రాజు రాజు పితృశార్ధనికి  వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు

కపట సేవకుడు వంటలో రహాస్యంగా నర మాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకుని రాజు పై కోపించి, “రాజా! నీవు మాకు నర మాంసం వడ్డించచావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడు అవుతావుఅని శపించాడు. రాజు కోపంతో ప్రతి శాపం ఇవ్వబోతే పతివ్రత అయిన అతని భార్య దమయంతి గురువును శపించడం మహాపాపమని చెప్పి, శాప జలాన్ని తన పాదాలపై పోసుకో మని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని,

మానవాళి అందరూ నిత్య గురు పారాయణం చేసి గురు కృపను పొందాలని  ఎక్కిరాల  భరద్వాజ గారిచేత  

లికించబడిన శ్రీ గురు చరిత్ర 'ను దత్తాత్రేయుని దయ  వలన  ౩౦౦ పేజీల గురు చరిత్రను 52 పేజీలకు 

సంక్షిపం చేసిఇక్కడ పొందుపరచాముఅమృతోతమైన గురు చరిత్రను పారాయణం చేసి ధన్యులము 

అవుదాము . సర్వశుభాలూ ప్రాప్తించు గాకా

        !!  ఓం గురు దేవ దత్త!!

The Shri Guru Charitra is a book based on the life story of Shri Narasimha Saraswati, written by the 15th-16th century poet Shri Saraswati Gangadhar. The book includes the life story of Shri Narasimha Saraswati, his philosophy and related stories. The language used is the 14-15th century Marathi.

Shri Guru Charitra

Pages