IIచక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితాII

శ్లోకం వివరణ : 

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.

గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.

సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత
అశ్వరూఢ దిష్టితాశ్వ కోటికోటిభిరావృత

శ్లోకం వివరణ :

సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవితా : సంపత్కరి అనే సేనా నాయకురాలిచే సేవించబడినది
అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటిభిరావృతా : కోటానుకోట్ల అశ్వ సైన్యముకు నాయకురాలు ఐన అశ్వారూఢ అను శక్తి చే సేవించబడుచున్న

సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత
అశ్వరూఢ దిష్టితాశ్వ కోటికోటిభిరావృత

శ్లోకం సవరించు:

సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవితా : సంపత్కరి అనే సేనా నాయకురాలిచే సేవించబడినది
అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటిభిరావృతా : కోటానుకోట్ల అశ్వ సైన్యముకు నాయకురాలు ఐన అశ్వారూఢ అను శక్తి చే సేవించబడుచున్న

దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా |
భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమన్వితా | | 

శ్లోకం వివరణ :

దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా :- దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా :- భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ | | 

శ్లోకం సవరించు:
మహాపద్మాటవీ సంస్థా :- మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
కదంబ వనవాసినీ :- కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
సుధాసాగర మధ్యస్థా :- చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.
కామాక్షీ :- అందమైన కన్నులు గలది.
కామదాయినీ :- కోరికలను నెరవేర్చునది.

 సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత 


సుమేరశృంగ మధ్యస్ధా : మేరు పర్వత శిఖర మధ్యలో ఉండునది ( మేరు శిఖరమనగా సహస్రార పద్మం)
శ్రీమన్నగర నాయికా : శ్రీపురం (లలితాదేవి లోకము) నాయకురాలు
చింతామణి గృహంతస్దా : చింతామణుల చే నిర్మించిన గృహం
పంచబ్రహ్మాసనస్ధితా : బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఐన ప0చబ్రహ్మలను ఆసనంగా కలది

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా || 


శ్లోకం సవరించు
సర్వారుణా :- సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
అనవద్యాంగీ :- వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
సర్వాభరణ భూషితా :- సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
శివకామేశ్వరాంకస్థా :- శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
శివా :- వ్యక్తమైన శివుని రూపము కలది.
స్వాధీన వల్లభా :- తనకు లోబడిన భర్త గలది.

సింజానమణిమంజీరమండిత శ్రీపదాంబుజా |
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ||

శ్లోకం సవరించు
సింజానమణిమంజీరమండిత శ్రీపదాంబుజా :- ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
మరాళీ మందగమనా :- హంసవలె ఠీవి నడక కలిగినది.
మహాలావణ్య శేవధిః :- అతిశయించిన అందమునకు గని లేదా నిధి.

 

నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా
పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా

నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా -
గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.

పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా -
పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా || 

శ్లోకం సవరించు
ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా :- ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
గూఢగుల్ఫా :- నిండైన చీలమండలు గలది.
కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా :- తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది

Pages