కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా 

కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా -
కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా -
మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది
 
 

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా || 

శ్లోకం సవరించు
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ :- ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా :- రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.

 

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా || 



శ్లోకం సవరించు
లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా :- కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా :- వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది.

 

కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ |
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ | |

శ్లోకం వివరణ :

కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ :- కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.
నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ :- బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.

 

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా || 


శ్లోకం వివరణ :

కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా :- బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా :- రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.

 

అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా || 

శ్లోకం వివరణ :

అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా :- లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా :- పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది

 

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ |
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా | | 


శ్లోకం వివరణ :

నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ :- తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా :- చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది

 


శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా | | 

 

శ్లోకం వివరణ :
 
 

శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా :- శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.

కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా :- కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా | |

 

శ్లోకం వివరణ :


పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః :- పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.
నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా :- కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా |
తాటంక యుగళీభూత తపనోడుప మండలా | |

 

శ్లోకం వివరణ :

 

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా :- కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
తాటంక యుగళీభూత తపనోడుప మండలా :- చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.

 

Pages