మూలమంత్రాత్మికా, మూలకూటత్రయ కళేబరా 
కులామృతైకరసికా, కులసంకేతపాలినీ | |

శ్లోకం వివరణ : 

మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.

మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.

కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

కంణ్ఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తి కూటైకతాపన్న కట్యధోభాగధారిణీ | |

శ్లోకం వివరణ : 

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా || 

శ్లోకం వివరణ : 

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా | |

శ్లోకం వివరణ : 

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిఃI
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాII

శ్లోకం వివరణ : 

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాI
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీII

శ్లోకం వివరణ : 

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితాI
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాII

శ్లోకం వివరణ : 

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా -
మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా II

శ్లోకం వివరణ : 

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా -
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా -
మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.

భండసైన్య వదోద్యుక్త శక్తివిక్రమ హర్షిత
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక 

శ్లోకం వివరణ : 

భండ సైన్య : భండాసురుని సైన్యము
వధోద్యుక్త : వధించడానికి
శక్తి విక్రమ హర్షితా : ఉపక్రమించిన శక్తి యొక్కపరాక్రమము
నిత్యా పరాక్రమా టోప : నిత్య అను పేరు గల శక్తి యొక్కపరాక్రమము
నిరీక్షణా సముత్సుకా : ఉత్సాహం కలది ( నిత్య చేసేపరాక్రమం చూడటానికి ఉత్సాహం)

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగాII

శ్లోకం వివరణ : 

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.

Pages