ప్రభావతీ ప్రభా రూపా ప్రసిద్ధా పరమేశ్వరీ|
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ||

శ్లోకం వివరణ :

ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
అవ్యక్తా - వ్యక్తము కానిది.
వ్యక్తావ్యక్తస్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.

ప్రభావతీ ప్రభా రూపా ప్రసిద్ధా పరమేశ్వరీ|
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ||

శ్లోకం వివరణ :

ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
అవ్యక్తా - వ్యక్తము కానిది.
వ్యక్తావ్యక్తస్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.

సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్య పరిపూరితా ||

శ్లోకం వివరణ :

సద్యఃప్రసాదినీ - తక్షణములోనే అనుగ్రహించునది.
విశ్వసాక్షిణీ - విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
సాక్షివర్జితా - సాక్షి లేనిది.
షడంగదేవతాయుక్తా - ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
షాడ్గుణ్య పరిపూరితా - ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.

ఓడ్యాణ పీఠనిలయా బిందుమండలవాసినీ |
రహో యాగ్రక్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా ||

శ్లోకం వివరణ :

ఓడ్యాణపీఠనిలయా - ఓడ్యాణ పీఠమునందు ఉంది.
బిందుమండలవాసినీ - బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
రహోయాగక్రమారాధ్యా - ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.

కామేశ్వర ప్రాణనాడీ కృతజ్నా కామపూజితా |
శృంగారరస సంపూర్ణా జయా జాలంధర స్థితా ||

శ్లోకం వివరణ :

కామేశ్వరప్రాణనాడీ - శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
కృతజ్ఞా - చేయబడే పనులన్నీ తెలిసింది.
కామపూజితా - కామునిచే పూజింపబడునది.
శృంగారరససంపూర్ణా - శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
జయా - జయస్వరూపిణి.
జాలంధరస్థితా - జాలంధరసూచిత స్థానము నందున్నది.

పరాప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీ రూపా భక్త మానస హంసికా ||

శ్లోకం వివరణ :

పరా - పరాస్థితిలోని వాగ్రూపము.
ప్రత్యక్చితీరూపా - స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
పరదేవతా - పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
మధ్యమా - పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
వైఖరీరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
భక్తమానసహంసికా - భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.

చితిస్తత్పదలక్ష్యార్ధ చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ||

శ్లోకం వివరణ :

చితిః - కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
తత్పదలక్ష్యార్థా - తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా ||

శ్లోకం వివరణ :

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
తరుణీ - ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
తాపసారాధ్యా - తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
తనుమధ్యా - కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

భ్సక్తిమ త్కల్పలతికా పశుపాశ విమోచినీ |
సంహృతాశేషపాషాండా సదాచార ప్రవర్తికా ||

శ్లోకం వివరణ :

భక్తిమత్కల్పలతికా - భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
పశుపాశ విమోచనీ - వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
సంహృతాశేషపాషండా - సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.
సదాచారప్రవర్తికా - సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసినీ ||

శ్లోకం వివరణ :

విజయా - విశేషమైన జయమును కలిగినది.
విమలా - మలినములు స్పృశింపనిది.
వంద్యా - నమస్కరింపతగినది.
వందారుజనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
వామకేశీ - వామకేశ్వరుని భార్య.
వహ్నిమండవాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.

Pages