తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రియా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్ర రూపిణీ ||

శ్లోకం వివరణ :

తాంబూల పూరితముఖీ - తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
దాడిమీ కుసుమప్రభా - దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.
మృగాక్షీ - ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
మోహినీ - మోహనమును కలుగజేయునది.
ముఖ్యా - ముఖ్యురాలు.
మృడానీ - మృడుని పత్ని.
మిత్రరూపిణీ - మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా ||

శ్లోకం వివరణ :

అగ్రగణ్యా - దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
అచింత్యరూపా - చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
కలికల్మషనాశినీ - కలియుగ మలినములను పోగొట్టునది.
కాత్యాయనీ - కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
కాలహంత్రీ - కాలమును హరించునది.
కమలాక్ష నిషేవితా - విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.

విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః |
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ ||

శ్లోకం వివరణ :

విమర్శరూపిణీ - జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.
విద్యా - జ్ఞాన రూపిణి.
వియదాది జగత్ప్రసూ - ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.
సర్వవ్యాధి ప్రశమనీ - అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.
సర్వమృత్యు నివారిణీ - సకల మృత్యుభయాలను పోగొట్టునది.

పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా ||

శ్లోకం వివరణ :

పుణ్యకీర్తి - మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
పుణ్యలభ్యా - సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
పుణ్య శ్రవణ కీర్తనా - పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.
పులోమజార్చితా - పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.
బంధమోచనీ - అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
బంధురాలకా - అందమైన చిక్కనైన ముంగురులు కలది.

సరౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతిః స్మృతిరనుత్తమా ||

శ్లోకం వివరణ :

సర్వౌదన ప్రీత చిత్తా - అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది.
యాకిన్యంబా స్వరూపిణీ - యాకినీ దేవతా స్వరూపములో ఉండునది.
స్వాహా - చక్కగా ఆహ్వానించునది.
స్వధా - శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వాగత వచనము.
అమతిః - మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.
మేధా - ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది.
శ్రుతిః - చెవులతో సంబంధము కలిగినది.
స్మృతిః - మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.
అనుత్తమా - తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.

సహస్రదళ పద్మస్థాసర్వవర్ణోపా శోభితా |
సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖి ||

శ్లోకం వివరణ :

సహస్రదళ పద్మస్థా - సహస్రార కమలములో ఉండునది.
సర్వవర్ణోప శోభితా - అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.
సర్వాయుధ ధరా - అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.
శుక్ల సంస్థితా - శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.
సర్వతోముఖీ - సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.

మజ్నాసంస్థా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూప ధారిణీ ||

శ్లోకం వివరణ :

మజ్జా సంస్థా - మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.
హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా - హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.
హరిద్రాన్నైక రసికా - పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.
హాకినీ రూపధారిణీ - హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.

ముద్గౌదనాసక్తాచిత్తా సాకిన్యాంబా స్వరూపిణీ |
అజ్నాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాసనా ||

శ్లోకం వివరణ :

ముద్గౌదనాసక్తచిత్తా - పులగములో ప్రీతి కలది.
సాకిన్యంబా స్వరూపిణీ - సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.
ఆజ్ఞా చక్రాబ్జనిలయా - ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.
శుక్లవర్ణా - తెలుపురంగులో ఉండునది.
షడాసనా - ఆరు ముఖములు కలది.

మూలాధారంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా |
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా ||

శ్లోకం వివరణ :

మూలాధారాంభుజారూఢా - మూలాధార పద్మములో అధివసించునది.
పంచ వక్త్రా - ఐదు ముఖములతో నుండునది.
అస్థి సంస్థితా - ఎముకలను ఆశ్రయించి ఉండునది.
అంకుశాది ప్రహరణా - అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
వరదాది నిషేవితా - వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.

మేదోనిష్ఠా మధుప్రీతా బందన్యాది సమంవితా |
దధ్యన్నాసక్త హృదయా కాకినీరూపధారిణీ ||

శ్లోకం వివరణ :

మేదోనిష్ఠా - మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.
మధుప్రీతా - మధువులో ప్రీతి కలిగినది.
బందిన్యాది సమన్వితా - బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.
దధ్యన్నాసక్త హృదయా - పెరుగు అన్నం ఇష్టపడునది.
కాకినీ రూపధారిణీ - కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.

Pages