భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా
రోగపర్వతదంభొళి ర్మృత్యుదారుకుఠారికా

 శ్లోకం వివరణ :

భాగ్యాబ్ధిచంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
భక్తచిత్తకేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
రోగపర్వతదంభొళి : పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
ర్మృత్యుదారుకుఠారికా : మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది

భవదావసుధావృష్టి: పాపారణ్యదవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా

శ్లోకం వివరణ :

భవదావసుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
పాపారణ్యదవానలా : పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది

మిధ్యాజగదధిష్తాన ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా

శ్లోకం వివరణ :

మిధ్యాజగదధిష్టానా
: మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది
ముక్తిదా : విముక్తి నిచ్చునది
ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
లయకరీ : జగత్తును లయము చేయునది
లజ్జా : లజ్జాస్వరూపిణీ
రంభాదివందితా : రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

చిత్కళా నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ !
నామపారాయణాప్రీతా నందివిద్యా నటేశ్వరీ !!

 శ్లోకం వివరణ :

చిత్కళానందకలికా
: ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ
ప్రేమరూపా : ప్రేమమూర్తి
ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
నామపారాయణప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
నందివిద్యా : అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశేషము
నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి

స్వతంత్రా సర్వతంత్రేశే దక్షిణామూర్తి రూపిణీ
సనకాదిసమారాధ్యా శివఙ్ఞానప్రదాయినీ 

శ్లోకం వివరణ :

స్వతంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
సర్వతంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
దక్షిణామూర్తిరూపిణీ : దక్షిణామూర్తి రూపము ధరించినది
సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
శివఙ్ఞానప్రదాయినీ : ఆత్మఙ్ఞానమును ఇచ్చునది

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా

శ్లోకం వివరణ :


కులోత్తీర్ణా : సుషుమ్నా మార్గమున పైకిపోవునది
భగారాధ్యా : త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
మాయా : మాయాస్వరూపిణీ
మధుమతీ : మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
గణాంబా : గణములకు తల్లి
కుహ్యకారాధ్యా : గుహ్యాదులచే ఆరాధింపబడునది
కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
గురుప్రియా : గురువునకు ప్రియమైనది

సర్వోపాధి వినిర్ముక్తా సదాశివపతివ్రతా
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ 

శ్లోకం వివరణ :

సర్వోపాధివినిర్ముక్తా : ఏరకమైన శరీరము లేనిది
సదాశివపతివ్రతా : శివుని భార్య
సంప్రదాయేశ్వరీ : అన్ని సంప్రదాయములకు అధీశ్వరి
సాధ్వీ : సాధుస్వభావము కలిగినది
గురుమండలరూపిణీ : గురుప్రంపరాస్వరూపిణి

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ

శ్లోకం వివరణ :

దేశకాలపరిచ్ఛిన్నా : దేశకాలములచే మార్పు చెందినది
సర్వగా : సర్వవ్యాపిని
సర్వమోహినీ : అందరిని మోహింప చేయునది
సరస్వతీ : విద్యాస్వరూపిణి
శాస్త్రమయీ : శాస్త్రస్వరూపిణి
గుహాంబా : కుమారస్వామి తల్లి
గుహ్యరూపిణి : రహస్యమైన రూపము కలిగినది

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ 

శ్లోకం వివరణ :

దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
సర్వలోకవశంకరీ : సమస్తలోకములను వశము చేసుకొనునది
సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది
సావిత్రీ : గాయత్రీ మాత
సచ్చిదానందరూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది

రాజ్యలక్ష్మి: కోశనాధా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా

 శ్లోకం వివరణ :

రాజ్యలక్ష్మి: : రాజ్యలక్ష్మీ రూపిణీ
కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
చతురంగబలేశ్వరీ : చతురంగ బలాలకు (రధ,గజ,తురగ,పదాదులు) అధిపతి
సామ్రాజ్యదాయినీ : సామ్రాజ్యమును ఇచ్చునది
సత్యసంధా : సత్యస్వరూపిణి
సాగరమేఘలా : సముద్రములే వడ్డాణముగా కలిగినది

Pages