సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి 

శ్లోకం వివరణ :

సంసారపంకనిర్మగ్న : సంసారము అను ఊబిలో కూరుకొనిపొఇన జనలను
సముద్ధరణపండితా : ఉద్ధరించుతకు సామర్ధ్యము కలిగినది
యఙ్ఞప్రియా : యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
యఙ్ఞకర్త్రీ : యఙ్ఞము చేయునది
యజమానస్వరూపిణి : యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది

త్ర యీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి:

శ్లోకం వివరణ :

త్ర యీ : వేదస్వరూపిణి
త్రివర్గ నిలయా : ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది
త్రిస్థా : మూడు విధములుగా ఉండునది
త్రిపురమాలినీ : త్రిపురములను మాలికగా ధరించినది
నిరామయా : బాధలూ లేనిది
నిరాలంబా : ఆలంబనము అవసరము లేనిది
స్వాత్మారామా : తన ఆత్మయందే ఆనందించునది
సుధాసృతి: : అమృతమును కురిపించునది


అజాక్షయ వినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా

శ్లోకం వివరణ :

అజా : పుట్టుక లేనిది
క్షయ వినిర్ముక్తా : మాయాతేతమైనది
ముగ్ధా : 12 - 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
క్షిప్రప్రసాదినీ : వెంటనే అనుగరించునది
అంతర్ముఖసమారాధ్యా : అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
బహిర్ముఖసుదుర్లభా : ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది

కార్యకారణ నిర్ముక్తా కామకేళీతరంగితా !

కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీి !!

శ్లోకం వివరణ : 

కార్యకారణ వినిర్ముక్తా: సర్వకార్య, కారణాలను నుండియు విముక్తురాలైన మాత కామకేళీ తరంగితా:

కామకేళీ తరంగిణీ స్వరూపిణి ‌‌. కనత్కనకతటంకా:ప్రకాశమానమైన సువర్ణ తాటంకాలు ధరించినది

లీలావిగ్రహధారిణీ: లీలా మాత్రంగా అనేక అవతారాలు ధరించిన మాత

కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ

గంభీరా గగనాంతస్తా గర్వితా గానలోలుపా

శ్లోకం వివరణ :

గంభీరా : లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)
గగనాంతస్తా : ఆకాశమునందు ఉండునది
గర్వితా : గర్వము కలిగినది
గానలోలుపా : సంగీతమునందు ప్రీతి కలిగినది
కల్పనారహితా : ఎట్టి కల్పన లేనిది
కాష్ఠా : కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
కాంతా : కాంతి కలిగినది
కాంతార్ధ విగ్రహ ; కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము

జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా

శ్లోకం వివరణ :

జన్మమృత్యుజరాతప్త : చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు
జన : జనులు
విశ్రాంతిదాయినీ : విశ్రాంతి ని ఇచ్చునది
సర్వోపనిషదుద్ఘుష్టా : అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
శాంత్యతీతకళాత్మికా : శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప
రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)

ఛంద:సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ
ఉదారకీర్తి రుద్దామ వైభవా వర్ణరూపిణీ

శ్లోకం వివరణ :

ఛంద:సారా : వేదముల సారము
శాస్త్రసారా : వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
మంత్రసారా : మంత్రముల యొక్క సారము
తలోదరీ : పలుచని ఉదరము కలిగినది
ఉదారకీర్తి : గొప్ప కీర్తి కలిగినది
రుద్దామ వైభవా : అధికమైన వైభవము కలిగినది
వర్ణరూపిణీ : అక్షరరూపిణి

 

 

 

 

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ
భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ 

 

శ్లోకం వివరణ :

ముకుందా : విష్ణు రూపిణీ
ముక్తినిలయా : ముక్తికి స్థానమైనది
మూలవిగ్రహరూపిణీ : అన్నింటికీ మూలమైనది
భావఙ్ఞా : సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
భవరోగఘ్నీ : జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
భవచక్రప్రవర్తినీ : లోకచక్రమును నదిపించునడి

 

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూ

శ్లోకం వివరణ :

ప్రాణేశ్వరీ : ప్రాణములకు అధీశ్వరి
ప్రాణదాత్రీ : ప్రాణములు ఇచ్చునది
పంచాశత్పీఠరూపిణీ : శక్తిపీఠముల రూపమున వెలసినది
విశృంఖలా : యధేచ్ఛగా ఉండునది
వివిక్తస్థా : ఏకాంతముగా ఉండునది
వీరమాతా : వీరులకు తల్లి
వియత్ప్రసూ: : ఆకాశమును సృష్టించినది

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా
ప్రసవిత్రీ ప్రచండాఙ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి

శ్లోకం వివరణ :

బ్రహ్మాణీ : సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)
బ్రహ్మజననీ : బ్రహ్మడేవుడిని సృస్టించినది
బహురూపా : సమస్త రూపములు తానై ఉన్నది
బుధార్చితా : ఙ్ఞానులచే పూజింపబదునది
ప్రసవిత్రీ : జగజ్జనని
ప్రచండాఙ్ఞా : తీవ్రమైన ఆఙ్ఞ కలది
ప్రతిష్టా : కీర్తియే రూపముగా కలిగినది
ప్రకటాకృతి: : బహిరంగమైన ఆకారము కలిగినది

Pages