మూర్తామూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ 

శ్లోకం వివరణ :

మూర్తామూర్తా : రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది
నిత్యతృప్తా : ఎల్లప్పుదు తృప్తితో ఉండునది
మునిమానసహంసికా : మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి
సత్యవ్రతా : సత్యమే వ్రతముగా కలిగినది
సత్యరూపా : సత్యమే రూపముగా కలిగినది
సర్వాంతర్యామినీ : సృష్టీ అంతటా వ్యాపించినది
సతీ : దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి

పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ

శ్లోకం వివరణ : 

పరంజ్యోతి
: : దివ్యమైన వెలుగు
పరంధామ : శాశ్వతమైన స్థానము కలిగినది
పరమాణు: : అత్యంత సూక్ష్మమైనది
పరాత్పరా : సమస్తలోకములకు పైన ఉండునది
పాశహస్తా : పాశమును హస్తమున ధరించినది
పాశహంత్రీ : జీవులను సంసార బంధము నుంది విడిపించునది
పరమంత్ర విభేదినీ : శత్రువుల మంత్రప్రయోగములను పటాపంచలు చేయునది

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి:
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా

శ్లోకం వివరణ :

కళానిధి: : కళలకు నిధి వంటిది
కావ్యకళా : కవితారూపిణి
రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
రసశేవధి: : రసమునకు పరాకాష్ట
పుష్టా : పుష్ఠి కలిగించునది
పురాతనా ; అనాదిగా ఉన్నది
పూజ్యా ; పూజింపదగినది
పుష్కరా : పుష్కరరూపిణి
పుష్కరేక్షణా ; విశాలమైన కన్నులు కలది

సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ

శ్లోకం వివరణ :

సత్యఙ్ఞానానందరూపా : సచ్చిదానందరూపిణీ
సామరస్యాపరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)
కళామాలా : కళల యొక్క సమూహము
కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
కామరూపిణీ : కోరిన రూపము ధరించునది

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్య స్తరాజ్యధూ:
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా

శ్లోకం వివరణ :

మార్తాండభైరవారాధ్యా : మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
మంత్రిణీ : శ్యామలాదేవి
న్య స్తరాజ్యధూ: రాజ్యాధికారము ఇచ్చునది
త్రిపురేశీ ; త్రిపురములకు అధికారిణి
జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
నిస్త్రైగుణ్యా : త్రిగుణాతీతురాలు
పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది

వీరారాధ్యా విరాద్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రణదా ప్రాణరూపిణీ

శ్లోకం వివరణ :

వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
విరాద్రూపా : అన్నింతికీ మూలమైనది
విరజా : రజోగుణము లేనిది
విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
ప్రణదా : సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా

శ్లోకం వివరణ :

దురారాధ్యా ; కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది
దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్యమైనది
పాటలీకుసుమప్రియా : పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
మహతీ : గొప్పదైనది
మేరునిలయా : మేరుపర్వతము నివాసముగా కలిగినది
మందారకుసుమప్రియా : మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:
ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా

శ్లోకం వివరణ :

స్వర్గాపవర్గదా : స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది
శుద్ధా : పరిశుద్ధమైనది
జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆక్ర్తి కలది
ఓజోవతీ : తేజస్సు కలిగినది
ద్యుతిధరా : కాంతిని ధరించినది
యఙ్ఞరూపా : యఙ్ఞము రూపముగా కలిగినది
ప్రియవ్రతా : ప్రియమే వ్రతముగా కలిగినది

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా

శ్లోకం వివరణ :

క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది
సర్వలోకేశీ : అన్ని లొకములకు అధీశ్వరి
విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
త్రివర్గదాత్రీ ; దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
సుభగా : సౌభాగ్యవతి
త్ర్యంబకా : మూడు కన్నులు కలది
త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండముండాసురనిషూదిని

శ్లోకం వివరణ :

మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు
మహాకాళీ : కాళికాదేవిరూపము దాల్చినది
మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
మహాశనా : లయకారిణి
అపర్ణా : పార్వతీ దేవి
చండికా : చండికాస్వరూపిణి
చండముండాసురనిషూదిని : చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది

Pages